TE/Prabhupada 0808 - మనము కృష్ణుడిని మోసం చేయలేము

Revision as of 17:17, 17 November 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0808 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730926 - Lecture BG 13.03 - Bombay


కాబట్టి, మన జ్ఞానం చైతన్యము కృష్ణ చైతన్యము అయిన వెంటనే, కృష్ణుడికి అర్థం అవుతుంది. కృష్ణుడు మీ హృదయంలోనే ఉన్నాడు. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭati ( BG 18.61)

కాబట్టి కృష్ణుడు మీ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలడు. మనము కృష్ణుడిని మోసం చేయలేము. కృష్ణుడు వెంటనే అర్థం చేసుకోగలడు. మీరు ఎంత తీవ్రముగా ఉన్నారు, హృదయపూర్వకముగా ఉన్నారు అని, కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి లేదా ఆయన దగ్గరకి చేరుకోవటానికి లేదా భగవత్ ధామమునకు తిరిగి వెళ్ళటానికి, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళటానికి. దానిని కృష్ణుడు అర్థం చేసుకోగలడు. ఆయన అర్థం చేసుకున్న వెంటనే "ఇక్కడ ఒక ఆత్మ, అతను చాలా తీవ్రముగా ఉన్నాడు," ఆయన ముఖ్యంగా, మీ పట్ల జాగ్రత్త తీసుకుంటారు. సమోహం సర్వ-భూతేషు. కృష్ణుడు, దేవదేవుడు, ఆయన అందరికీ సమానం. Samo 'haṁ sarva-bhūteṣu. Na me dveṣyo 'sti na priyaḥ. ఎవరూ ప్రియమైన వారు కాదు లేదా ద్వేషించే వారు కాదు లేదా ఎవరి మీద అసూయ పడేది లేదు. కృష్ణుడు అసూయాపరుడు కాదు, అందరికీ ప్రత్యేకంగా అనుకూలముగా ఉండడు. నిజానికి, భగవంతుడు పరిస్థితి తటస్థంగా ఉంది. ప్రతిఒక్కరూ... ఆయన అందరినీ ఇష్టపడతారు. Suhṛdaṁ sarva-bhūtānāṁ jñātvā māṁ śāntim ṛcchati ( BG 5.29) ఇది కూడా భగవద్గీతలో చెప్పబడింది. ఆయన ప్రతిఒక్కరి స్నేహితుడు.

మన కోరికలను నెరవేర్చుకోవడానికి చాలా మంది వ్యక్తుల స్నేహాన్ని మనము కోరుతున్నాము. కానీ మనము కృష్ణుడితో స్నేహం చేస్తే, కృష్ణుడు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాడని మనకు తెలిస్తే ... ఉపనిషత్తు లో రెండు పక్షుల స్నేహపూర్వకముగా ఒకే చెట్టు, శరీరం లో కూర్చొని ఉన్నాయని చెప్పబడింది. కాబట్టి మనము అర్థం చేసుకుంటే, "కృష్ణుడు నా ఉత్తమ స్నేహితుడు..." అని, కృష్ణుడు చెప్పినట్టు, సుహృదం సర్వ-భూతేషు. ఆయన కేవలం నా స్నేహితుడు, మీ స్నేహితుడు మాత్రమే కాదు, కానీ ఆయన ప్రతిఒక్కరి స్నేహితుడు. కాబట్టి ఆ స్నేహం సమానంగా పంచబడుతుంది. కానీ ఒకవేళ ఎవరైనా ప్రత్యేక భక్తుడు అయినట్లయితే, ye tu bhajanti māṁ prītyā, ఎవరైనా ప్రేమ మరియు ఆప్యాయతలతో, భగవంతుని యొక్క సేవ లో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యంగా అతనిపై ఆసక్తి కలిగి ఉన్నారు. ఇది భక్తునికి కృష్ణుడి కరుణ. కృష్ణుడు ప్రతి ఒక్కరికీ సమానంగా ఉంటాడు, కానీ ఆయన ప్రత్యేకంగా భక్తులకు అనుకూలముగా ఉంటాడు ప్రేమ మరియు విశ్వాసముతో ఆయన సేవలో ఎవరు పాల్గొంటారో.

teṣāṁ satata-yuktānāṁ
bhajatāṁ prīti-pūrvakam
dadāmi buddhi-yogaṁ taṁ
yena mām upayānti te
(BG 10.10)

కృష్ణుడు ఆయనకు ఇస్తాడు ... ఎందుకంటే భక్తునిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాడు...

కాబట్టి ప్రతి ఒక్కరి హృదయంలో, ఆయన కూర్చొని ఉన్నాడు. Kṣetra-jñaṁ cāpi māṁ viddhi sarva-kṣetreṣu bhārata. కానీ ఆయన భక్తునిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు, ఆయనకి మార్గనిర్దేశం, ఆయనకి తెలివి ఇస్తాడు. ఏ రకమైన మేధస్సు? Yena mām upayānti te. కేవలం తిరిగి భగవత్ ధామమునకు తిరిగి వెళ్లడానికి, భగవంతుడు వైపు తిరిగి ఎలా రావచ్చో చెప్పడానికి జ్ఞానమును ఇస్తాడు ఒకరు భౌతిక సంపదను ఎలా సంపాదించవచ్చో తెలుసుకోవడానికి కృష్ణుడు జ్ఞానమును ఇవ్వడు. అది మాయ- దైవీ మాయ లేదా దుర్గాదేవికి అప్పగించబడుతుంది.

అందుచేత కృష్ణుడి ఆరాధనలో చాలా మందికి ఆసక్తి లేదు. వారు దేవత దుర్గా, భగవంతుడు శివుడిని పూజించడంపై సాధారణంగా ఆసక్తి చూపుతారు. ఎందుకంటే శివుని, దుర్గాదేవిని పూజించడం ద్వారా, వారు భౌతిక ఐశ్వర్యము పొందుతారు. కాబట్టి దేవతలను ఆరాధించడం అనేది వంద శాతం భౌతికవాదం అని అర్థం. అక్కడ ఆధ్యాత్మిక జీవితమనే ప్రశ్నే లేదు. అందుచేత కృష్ణుడు చెప్తాడు... ఆ శ్లోకము ఏమిటి? Naṣṭa-buddhayaḥ. Kāmais tais tair hṛta-jñānāḥ yajanti 'nya-devatāḥ ( BG 7.20) ఇతర దేవతలను ఆరాధించడంలో ఆసక్తి ఉన్నవారు, వారి బుద్ధి తీసివేయబడుతుంది, hṛta-jñāna. Kāmais tais tair, māyayāpahṛta-jñāna. ఈ నిబంధనలు ఉన్నాయి. మాయ రెండు విధాలుగా పని చేస్తున్నది: ప్రక్షేపాత్మక- శక్తి, ఆవరణాత్మక-శక్తి ఆవరణాత్మక-శక్తి అంటే ఆమె కప్పివేస్తుంది. ఆవరణాత్మక-శక్తి, ఆమె కప్పివేసినది. వాస్తవిక సత్యమును మాయ కప్పివేస్తుంది