TE/Prabhupada 0879 - భక్తియుక్త సేవలో వినమ్రత చాలా బాగుంటుంది

Revision as of 05:46, 2 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0879 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730412 - Lecture SB 01.08.20 - New York


భక్తియుక్త సేవలో వినమ్రత చాలా బాగుంటుంది శ్రీ చైతన్య మహా ప్రభు ఇలా అన్నారు:

pṛthivīte āche yata nagarādi grāma
sarvatra pracāra haibe mora nāma
(CB Antya-khaṇḍa 4.126)

ప్రతి పట్టణములో, నగరములో, ప్రపంచంలోని గ్రామములో, ఆయన ఉద్యమము ప్రచారము చేయబడుతుంది. ఆయన ఉద్యమము ఏమిటి? ఐరోపావాసులు మరియు అమెరికన్లు బ్రాహ్మణులు కాలేరని దానీ అర్థమా? ఎందుకంటే వైష్ణవ సంస్కృతి అంటే బ్రాహ్మణవాదం తరువాత, బ్రాహ్మణవాదం తరువాత.

māṁ ca yo 'vyabhicāreṇa
bhakti-yogena sevate
sa guṇān samatītyaitān
brahma-bhūyāya kalpate
(BG 14.26)

ఆయన, భక్తి-యోగం... భక్తి-యోగంను తీసుకున్న వ్యక్తి, ఆయన వెంటనే ఆధ్యాత్మిక స్థితి, బ్రహ్మ-భూత స్థాయికి ( SB 4.30.20) వస్తాడు. బ్రాహ్మణుడి గురించి ఏమి మాట్లాడతాము ? ఈ మూసపోత, బలము లేని ఆలోచన వేదముల నాగరికతను చంపింది. ఇప్పుడు మనం తిరిగి బ్రతికిస్తున్నాము. ఇది అందరికీ ఉద్దేశించబడింది.

కృష్ణుడు చెప్తాడు,

māṁ hi pārtha vyapāśritya
ye 'pi syuḥ pāpa-yonayaḥ
striyo śūdrās tathā vaiśyās
te 'pi yānti parāṁ gatim
(BG 9.32)

కృష్ణుడు చెప్పారు. సాధారణముగా మనము తీసుకుంటాము స్త్రీయా అంటే స్త్రీలు శూద్రులు మరియు వైశ్యులు తక్కువ తరగతిలో కానీ ఒకరు భక్తుడు అయినప్పుడు,... ఆయన లేదా ఆమె ఇంకా ఏ మాత్రము అధమ శ్రేణిలో ఉండరు.Te 'pi yānti parāṁ gatim.. భక్తియుక్త సేవ చాలా బాగుంటుంది ఎవరైనా... సాధారణంగా స్త్రీలను తక్కువ బుద్ధి గలవారిగా తీసుకుంటారు; శూద్రులను తక్కువ బుద్ధి గలవారిగా తీసుకుంటారు;వైశ్యులు తక్కువ తెలివైన వారిగా తీసుకుంటారు. కానీ ఆయన కృష్ణ చైతన్యమును తీసుకుంటే, ఆయన అత్యంత తెలివైనవాడు. Kṛṣṇa yei bhaje sei baḍa catura.. ఇది చైతన్య-చరితామృతంలోని ప్రకటన. కృష్ణ చైతన్యమును తీసుకున్న వారు ఎవరైనా ఆయన చాలా తెలివైనవాడు. చైతన్య మహా ప్రభు చెప్తారు: guru-kṛṣṇa-kṛpāya pāya bhakti-latā-bīja ( CC Madhya 19.151) kona bhāgyavān jīva. Ei rūpe brahmāṇḍa bhramite kona bhāgyavān jīva. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం దౌర్భాగ్యము, దురదృష్టము ఉన్న వ్యక్తులకు కాదు. కాదు ఇది చాలా అదృష్టవంతులకు ఉద్దేశించబడింది. కృష్ణ చైతన్యమునకు తీసుకున్న వారు ఎవరైనా అతడిని అదృష్టవంతునిగా పరిగణించాలి ఎందుకంటే ఆయనకి తన జీవితం పరిపూర్ణంగా చేసుకునే దారి ఉంది.

అందుచేత, కృష్ణ చైతన్యములో ఉన్నవాడు, తన విధులను చక్కగా నిర్వర్తించువాడు, ఆయన చాలా అదృష్టవంతుడు, అత్యంత పరిపూర్ణుడైన మనిషి. అంటే, కుంతిదేవి వినయపూర్వకంగా చెప్తుంది. మహిళ శరీరములో ఉన్నప్పటికీ, ఆమె భక్తురాలు. ఆమె సాధారణ స్త్రీ వంటిది కాదు, తక్కువ తెలివితేటలతో. ఆమె అత్యంత... కృష్ణుడిని గుర్తించింది, కృష్ణుడు భగవంతుడు అని ఆమె గుర్తించింది. ఆయన నా దగ్గరకు వచ్చినప్పటికి, నా మేనల్లుడిగా, నన్ను గౌరవించడానికి, కానీ ఆయన భగవంతుడు. " కాబట్టి మునుపటి శ్లోకము లో ఆమె చెప్పింది, alakṣyaṁ sarva-bhūtānām antar bahir avasthitam: ( SB 1.8.18) మీరు సాధారణ మనిషిచే చూడబడరు, మీరు లోపల మరియు వెలుపల ఉన్నప్పటికీ. మరో శ్లోకములో కూడా, na lakṣyase mūḍha-dṛśā: ( SB 1.8.19) దుష్టులు మరియు మూర్ఖులు మిమ్మల్ని చూడలేరు. దీని అర్థం, కుంతీ ఆయనను చూస్తుంది. ఆమె కృష్ణుడిని యధాతథముగా చూస్తుంటే తప్ప, ఆమె ఎలా చెప్పగలదు, mūḍha-dṛśā na lakṣyase? ఆమె చెప్తుంది, ప్రకృతేః పరమ్: "మీరు ఈ భౌతిక సృష్టికి అతీతముగా ఉన్నారు." ఇక్కడ కూడా ఆమె తన వినయమును కొనసాగిస్తుంది. ఈ వినయము భక్తియుక్త సేవలో మంచిది. అందువలన చైతన్య, శ్రీ కృష్ణ చైతన్య మహా ప్రభు మనకు బోధిస్తున్నారు: tṛṇād api sunīcena taror api sahiṣṇunā. ఒకరు గడ్డి కన్నా సహనముగా ఉండాలి మరియు చెట్ల కంటే వినయముగా ఉండాలి, ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించడానికి. ఎందుకంటే చాలా అవాంతరాలు ఉంటాయి. ఎందుకంటే మాయ... మనము నివసిస్తున్నాము... ఉదాహరణకు మనము సముద్రంలో ఉన్నట్లుగా కాబట్టి మీరు మహా సముద్రంలో చాలా ప్రశాంతమైన పరిస్థితిని ఊహించుకోలేరు. ఇక్కడ ఎల్లప్పుడూ ఒడిదుడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. ఒక పెద్ద ఓడ అయిన కూడా, అది కూడా స్థిరంగా ఉండే పరిస్థితిలో లేదు. ఏ సమయంలోనైనా తీవ్రమైన అలలు ఉండవచ్చు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఎప్పుడైనా ప్రమాదము ఉంటుంది అని (ఆశించాలి.)(తెలుసుకోవాలి) మీరు ఈ భౌతిక ప్రపంచం లోపల చాలా ప్రశాంతమైన జీవితాన్ని ఆశించలేరు. Padaṁ padaṁ yad vipadām ( SB 10.14.58) . ప్రతి దశలోను ప్రమాదం ఉంది అని శాస్త్రము చెప్తుంది కానీ మీరు భక్తుడు అయితే, అప్పుడు మీరు తప్పించుకుంటారు. Māyām etāṁ taranti te ( BG 7.14)