TE/Prabhupada 0936 - కేవలం ప్రమాణము చేయడము
730425 - Lecture SB 01.08.33 - Los Angeles
కేవలం ప్రమాణము చేయడము; 'భవిష్యత్తులో.' 'కానీ నీవు ఇప్పుడు ఏమి చేస్తున్నావు, సర్?' మా... ప్రస్తుత సమయంలో, మనము వ్యాధి స్థితిలో ఉన్నాము. వారికి వ్యాధి పరిస్థితి అంటే ఏమిటో తెలియదు, ఆరోగ్యకరమైన పరిస్థితి ఏమిటి, ఈ దుష్టులకు తెలియదు. వారికి ఏమీ తెలియదు, ఇంకా వారు గొప్ప శాస్త్రవేత్తలు, తత్వవేత్తలుగా చెలామణి అవుతున్నారు... వారు ఇలా ప్రశ్నిoచరు: "నాకు చనిపోవాలని లేదు, ఎందుకు మరణం నా మీద బలవంతముగా అమలు చేయబడినది?" అటువంటి విచారణ లేదు. ఏ పరిష్కారం కూడా లేదు. అయినప్పటికీ ఇంకా వారు శాస్త్రవేత్తలు. ఏ రకమైన శాస్త్రవేత్తలు?మీరు...
సైన్స్ అంటే మీరు జ్ఞానములో ఉన్నతి సాధించారు తద్వారా జీవితం యొక్క మీ బాధాకరమైన పరిస్థితి తగ్గించవచ్చు. కనిష్టీకరించవచ్చు, అది సైన్స్. లేకపోతే, ఈ శాస్త్రం ఏమిటి? వారు కేవలం వాగ్దానం చేస్తున్నారు; "భవిష్యత్తులో." కానీ నీవు ఇప్పుడు ఏమి ఇస్తున్నావు, సర్? ఇప్పుడు మీరు బాధపడండి - మీరు బాధపడుతున్నట్లు, బాధ పడుతూ ఉండండి. భవిష్యత్తులో మేము కొన్ని రసాయనాలను కనుగొంటాము. " కాదు. వాస్తవానికి అత్యంతిక-దుఃఖః నివృత్తి. అత్యంతిక, అంతిమముగా. అత్యంతిక అంటే అంతిమముగా అని అర్థం. దుఃఖః అంటే బాధలు. అది మానవ జీవితం యొక్క లక్ష్యంగా ఉండాలి. అందువల్ల వారికి అత్యంతిక- దుఃఖః అంటే ఏమిటో తెలియదు. దుఃఖ అంటే బాధ. అందువల్ల అత్యంతిక-దుఃఖః అంటే ఏమిటో భగవద్గీతలో సూచించబడింది. ఇక్కడ అత్యంతిక-దుఃఖః ఉంది, అయ్యా. ఇది ఏమిటి? Janma-mṛtyu-jarā-vyādhi ( BG 13.9) జననం, మరణం, వృద్ధాప్యం వ్యాధి.
కాబట్టి, ఈ దుఃఖాన్ని, ఈ దుఃఖాన్ని నిర్ములించడానికి లేదా తీసివేయడానికి నీవు ఏమి చేసావు, భౌతిక ప్రపంచంలో ఇటువంటి విషయము లేదు. అత్యంతిక-దుఃఖః నివృత్తి. భగవద్గీతలో అన్ని రకాల బాధల నుండి విముక్తి గురించి చెప్పడము జరిగినది. అది ఏమిటి?
- mām upetya kaunteya
- duḥkhālayam aśāśvatam
- nāpnuvanti mahātmānaḥ
- saṁsiddhiṁ paramāṁ gatāḥ
- ( BG 8.15)
కాబట్టి మీరు ఇది అంతా చదవాలి. మీకు భాగవతము ఉంది, ప్రతిదీ వివరణతో ఉంది. ఇది అత్యంతిక-దుఃఖః నివృత్తి - అన్ని బాధల నుండి అంతిమ విముక్తి. అది ఏమిటి? మామ్ ఉపేత్య. "నా దగ్గరికి వచ్చువాడు, భగవత్ ధామమునకు తిరిగి, భగవంతుని దగ్గరకు తిరిగి వస్తాడు." అందువల్ల వారికి భగవంతుని గురించి ఏమి తెలియదు ఒక వ్యక్తి భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళగలడా, తిరిగి భగవంతుని దగ్గరకు. ఇది ఒక ఆచరణాత్మక విషయమా లేదా కాదా. జ్ఞానం లేదు. కేవలం జంతువుల వలె. అంతే. జ్ఞానం లేదు. వారు ప్రార్థిస్తారు: "ఓ దేవుడా, మా రోజు వారి రొట్టె ఇవ్వండి." ఇప్పుడు ఆయనని అడగండి: "భగవంతుడు అంటే ఏమిటి?" ఆయన వివరించగలడా? లేదు అప్పుడు మనము ఎవరిని అడుగుతున్నాము? గాలిలోనా? నేను అడిగినట్లయితే, నేను కొంత పిటిషన్ను సమర్పించినట్లయితే, అక్కడ ఎవరైనా వ్యక్తులు ఉండాలి. నేను ఆ వ్యక్తి ఎవరు అన్నది నాకు తెలియదు, ఈ పిటిషన్ను ఎక్కడ సమర్పించాలో నాకు తెలియదు. కేవలం... ఆయన ఆకాశంలో ఉన్నాడని వారు చెప్తారు. ఆకాశంలో, అనేక పక్షులు కూడా ఉన్నాయి, (నవ్వు) కానీ అది భగవంతుడు కాదు. మీరు చూడండి? వారికి జ్ఞానం లేదు, జ్ఞానం లేదు. అసంపూర్ణ జ్ఞానం, అంతా. వారు శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, గొప్ప ఆలోచనలు చేసేవారిగా , రచయితలుగా చెలామణి అవుతున్నారు, ... అంతా చెత్త, అంతా చెత్త. ఏకైక పుస్తకం శ్రీమద్-భాగవతం, భగవద్గీత. అంతా చెత్త. భాగవతములో ఇలా చెప్పబడింది:
- tad-vāg-visargo janatāgha-viplavo
- yasmin prati-ślokam abaddhavaty api
- nāmāny anantasya yaśo 'ṅkitāni yat
- śṛṇvanti gāyanti gṛṇanti sādhavaḥ
- ( SB 1.5.11)
మరొక వైపు: na yad vacaś citra-padaṁ harer yaśo (jagat-pavitraṁ) pragṛṇīta karhicit tad vāyasaṁ tīrtham... ( SB 1.5.10) తద్ వాయస తీర్థం. భగవంతుని జ్ఞానంతో సంబంధం లేని ఏ సాహిత్యం అయినా తద్, తద్ వాయస తీర్థం, అది కాకులు సంతోషంగా అనుభూతి చెందే ప్రదేశం. ఎక్కడ కాకులు సంతోషంగా ఉంటాయి? మురికిగా ఉన్న ప్రదేశములో. హంసలు, తెల్లని హంసలు, అవి ఒక చక్కని, స్పష్టమైన నీటిలో ఆనందం తీసుకుంటాయి, ఎక్కడ తోట ఉంటుందో అక్కడ పక్షులు ఉంటాయి.