TE/Prabhupada 0756 - ఆధునిక విద్యలో వాస్తవమైన జ్ఞానం లేదు

Revision as of 10:23, 20 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0756 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 6.1.10 -- Honolulu, May 11, 1976


కాబట్టి, అవును, గురువు, శుకదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజును పరిశీలించారు, రాజు ఒక దశ పరీక్షలో ఉతీర్ణుడు అయినట్లు కనిపిస్తుంది, ప్రాయశ్చిత్త పద్ధతిని తిరస్కరించడం ద్వారా. ఇది తెలివైనది. వెంటనే చెప్పారు, "గురువు, ఇది ఏమిటి?" ఆయన తిరస్కరించాడు. పవిత్రము అయ్యే పద్ధతిని తిరస్కరించడం, ఎందుకంటే అది ఫలాపేక్ష కార్యక్రమాలను కలిగి ఉంటుంది, కర్మ. కర్మ, నేను కొన్ని పాపములను చేశాను, అప్పుడు మరొక, మరొక కర్మ నన్ను శిక్షించడానికి. కావున ఇక్కడ చెప్పబడింది... ఒక కర్మ మరొక కర్మ ద్వారా రద్దు చేయబడదు. కర్మ అంటే పని చేయడము. చట్టాలు మీద చట్టాలను తీర్మానం చేస్తున్నారు , తీర్మానం మీద తీర్మానము చేస్తున్నారు, ఇది సాగుతుంది కానీ విషయాలు అదే స్థితిలో ఉన్నాయి. వారు మారడం లేదు. అందువల్ల అది ఆ విధముగా ఆపబడదు. Karmaṇā karma-nirhāra ( SB 6.1.11) ఇప్పుడు శుకదేవ గోస్వామి, కల్పన జ్ఞాన వేదికను సూచిస్తున్నాడు. ఒక దొంగ, పదేపదే క్రిమినల్ కార్యక్రమాలను చేస్తున్నట్లు విఫలమైనప్పుడు, పదేపదే ఆయన శిక్షించబడుతున్నాడు కానీ ఆయన సరిదిద్దబడలేదు, అప్పుడు దానికి పరిష్కారము ఏమిటి? అది vimarśanam, కల్పనా జ్ఞానం. కర్మ కాండ నుండి జ్ఞాన కాండకు పురోగతి, ఆయన prāyaścitta vimarśanam ( SB 6.1.11) ప్రతిపాదించారు: వాస్తవమైన ప్రాయశ్చిత్తం పూర్తి జ్ఞానము కలిగి ఉంది. ఒకరికి జ్ఞానం ఇవ్వాలి.

ఒకరు జ్ఞానమునకు వస్తే తప్ప... కాబట్టి ఆధునిక విద్యలో వాస్తవమైన జ్ఞానం లేదు. వాస్తవమైన జ్ఞానం భగవద్గీతలో మొదలవుతుంది. భగవద్గీత చదివిన వారు, మొదటి అవగాహన, అర్జునుడికి పాఠం ఇచ్చారు. ఆయన కలత చెందినప్పుడు ఆయన కృష్ణుని శిష్యుడయ్యాడు, śiṣyas te 'haṁ śādhi māṁ prapannam ( BG 2.7) కృష్ణా, ఈ స్నేహపూర్వక పలకరింపులను ఆపుదాము. మనము ఈ స్నేహపూర్వక పలకరింపులను ఆపుదాము ఇప్పుడు నీ శిష్యుడు కావాలని నేను ఇప్పుడు అంగీకరిస్తున్నాను. ఇప్పుడు నీవు నాకు భోధించు. " కాబట్టి మొదటి ఉపదేశము చీవాట్లుపెట్టడము. Aśocyān anvaśocas tvaṁ prajñā-vādāṁś ca bhāṣase ( BG 2.11) మీకు జ్ఞానం లేదు. Gātāsun agatāsūṁś ca nānuśocanti paṇḍitāḥ: మీరు ఒక పండితుని లాగా మాట్లాడుతున్నావు, కానీ నీవు పండితుడివి కాదు. ఆయన పరోక్షంగా చెప్పాడు, "నీవు ఒక అవివేకివి," ఎందుకంటే nānuśocanti, ఈ విధమైన ఆలోచనలు జ్ఞానవంతులైన పండితులచే నిర్వహింపబడవు. అంటే "నీవు జ్ఞానవంతుడైన వ్యక్తివి కాదు." ప్రస్తుతం ఇది జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఆయన చాలా ఉన్నత స్థాయి, జ్ఞానవంతుడిని అని, అనుకుంటున్నాడు, కానీ ఆయన ప్రధమ మూర్ఖుడు. ఎటువంటి ప్రామాణిక జ్ఞానం లేనందున అది జరగబోతోంది. సనాతన గోస్వామి కూడా, చైతన్య మహాప్రభుపాద దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన అదే విషయమును చెప్పారు. ఆయన తెలివిలో ఉన్నాడు. ఆయన ప్రధాన మంత్రి. ఆయన సంస్కృత , ఉర్దూ భాషలలో బాగా జ్ఞానము కలిగిన పండితుడు - ఆ రోజుల్లో ఉర్దూ, ఎందుకంటే అది ముహమ్మదీయుల ప్రభుత్వం. కానీ ఆయన తెలివైనవారు "వారు నన్ను జ్ఞానము కలిగిన పండితుడు అని పిలుస్తారు, కానీ నేను ఏ విధమైన పండితుడిని? "అని అడిగాడు. ఈ ప్రశ్నను చైతన్య మహా ప్రభు ముందు ఉంచారు Grāmya vyavahāre kahaye paṇḍita satya kari māni, āpanāra hitāhita kichui nāhi jāni: నా ప్రియమైన చైతన్య మహాప్రభు, ఈ సామాన్య వ్యక్తులు, వారు చెప్తారు నేను M.A., Ph.D., D.A.C. మరియు ఇంకా ఇంకా అని, నేను చాలా జ్ఞానవంతుడైన పండితుడిని. కానీ నేను గొప్ప పండితుడను, నేను ఏమిటో నాకు తెలియదు నా జీవిత లక్ష్యం ఏమిటి. " చూడండి. "జీవితం యొక్క లక్ష్యమేమిటి?" అని పిలవబడే ఏ విద్వాంసుడిని అయినా అడగండి ఆయన చెప్పలేడు. జీవితం యొక్క లక్ష్యం ఒక్కటే కుక్క వలె: తినడము, త్రాగడము, సంతోషముగా ఉండడము, ఆనందించడము మరియు చనిపోవడము. అంతే. కాబట్టి విద్య ఎక్కడ ఉంది? విద్య లేదు. నిజమైన విద్య భిన్నంగా ఉంటుంది: ఒకరు తన స్వంత స్థానాన్ని తెలుసుకొని, దాని ప్రకారం నడుచుకోవాలి.