TE/Prabhupada 0711 - మీరు ప్రారంభించిన దాన్ని దయచేసి విచ్ఛిన్నం చేయవద్దు చాలా ఆనందంగా దీన్ని కొనసాగించండి
Speech Excerpt -- Mayapur, January 15, 1976
ప్రభుపాద: ..... కాబట్టి ఈ విషయంలో గొప్ప ఆనందం భక్తి వినోద ఠాకూరా యొక్క ఆకాంక్ష యూరోపియన్లు, అమెరికన్లు, భారతీయులు అందరూ కలసి, ఉత్సాహంగా నృత్యం చేస్తూ " గౌరహరి " అని జపించటం.
కాబట్టి ఈ ఆలయం, మాయాపూర్ చంద్రోదయ మందిరం, దివ్యమైన ఐక్యరాజ్యం కొరకు ఉద్దేశించబడింది. ఐక్యరాజ్యసమితి దేని యందు విఫలమైనదో, అది ఇక్కడ సాధించవచ్చు, శ్రీ చైతన్య మహాప్రభుచే సిఫారసు చేయబడిన విధానం ద్వారా,
- పృధివీతె ఆచె యత నగరాది గ్రామ
- సర్వత్ర ప్రచార హైబె మొర నామ
- (CB అంత్య-కాండ 4.126)
కాబట్టి మీరు ఈ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలనుండి వచ్చి ఈ ఆలయంలో నివసిస్తున్నారు. కాబట్టి ఈ యువకులకు శిక్షణ ఇవ్వండి. నేను చాలా ఆనందంగా ఉన్నాను, ప్రత్యేకంగా, చిన్న పిల్లలను చూస్తున్నప్పుడు అన్ని ఇతర దేశాలనుండి ఇంకా భారతీయ, బెంగాలీలు. అందరూ కలిసి, వారి శరీర స్పృహను మర్చిపోయి. ఈ ఉద్యమంలో అది గొప్ప ఘనకార్యము, ప్రతి ఒక్కరూ శరీర భావం మర్చిపోతారు. ఎవరూ "యూరోపియన్", "అమెరికన్", "ఇండియన్", "హిందూ", "ముస్లిం", "క్రిస్టియన్" అని ఆలోచించరు. వారు ఈ అన్ని హోదాను మర్చిపోతారు, వారు కేవలం ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించటంలో పారవశ్యం కలిగి ఉంటారు. కాబట్టి మీరు ప్రారంభించిన దాన్ని దయచేసి విచ్ఛిన్నం చేయవద్దు. చాలా ఆనందంగా దీన్ని కొనసాగించండి. చైతన్య మహాప్రభు, మాయాపూర్ యొక్క ప్రభువు, ఆయన మీ పట్ల చాలా సంతోషంగా ఉంటారు, అంతిమంగా మీరు భగవద్ధామమునకు వెళ్తారు, భగవంతుని వద్దకు వెళతారు. చాలా ధన్యవాదములు. (ముగింపు)