TE/Prabhupada 1030 - మానవజీవితం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఉంది. అదే మానవ జీవితం యొక్క ఏకైక కర్తవ్యం

Revision as of 11:20, 9 March 2018 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 1030 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


740628 - Lecture at St. Pascal's Franciscan Seminary - Melbourne


మానవజీవితం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఉంది. అదే మానవ జీవితం యొక్క ఏకైక కర్తవ్యం. వేదముల సాహిత్యంలో ఇది చెప్పబడింది అథః శ్రీ-కృష్ణ-నామాది. కృష్ణుడు భగవంతుని పేరు. కాబట్టి ఇలా చెప్పబడింది కృష్ణుడి పేరు, కృష్ణుడి రూపం, కృష్ణుడి గుణాలు, కృష్ణుడి కార్యక్రమాలు.... అథః శ్రీ-కృష్ణ-నామాది నామము నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి అథః శ్రీ-కృష్ణ-నామాది న భవేద్ గ్రాహ్యం ఇంద్రియైః ( CC Madhya 17.136) ఇంద్రియ అంటే ఇంద్రియములు. మనం అర్థం చేసుకోలేము కృష్ణుడు అంటే ఏమిటి, లేదా భగవంతుడు--- ఆయన పేరు, ఆయన రూపం, ఆయన లక్షణాలు, ఆయన లీలలు.... మనము ఈ మొద్దు బారిన భౌతిక ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకోలేము. అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మానవ జీవితం దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి ఉద్దేశించబడింది. మానవ జీవితం యొక్క ఏకైక కర్తవ్యం ఇది. ప్రకృతి, భౌతిక ప్రకృతి, ఈ మానవ జీవితం కలిగి ఉండటానికి అవకాశం ఇస్తుంది. ఈ జీవితం యొక్క సులభము, ఈ రకమైన జీవితము, కేవలం భగవంతుని అర్థం చేసుకోవటానికి మనకు ఇవ్వబడింది. ఇతర జీవరాశులు పిల్లులు మరియు కుక్కలు, వృక్షాలు ఇంకా చాలా ఇతర విషయాలు; 8,400,000 రకాల జీవులు ఉన్నాయి----కాబట్టి ఇతర జీవరాశులు భగవంతుని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. మనము ఈ దేశంలోని అన్ని కుక్కలను పిలిస్తే, ఇక్కడకు రండి. మనము భగవంతుని గురించి మాట్లాడుకుందాము, లేదు, అవగాహన ఉండే అవకాశము లేదు. కానీ మానవ రూపంలో అవకాశం ఉంది. ఇది భారతదేశం లేదా అమెరికా లేదా ఆస్ట్రేలియా అన్న పట్టింపు లేదు. ఏ మానవుడైనా, అతడు ప్రయత్నిస్తే శాస్త్రాలను చదివితే---- బైబిల్, భగవద్గీత, భాగవత-- అప్పుడు అతడు భగవంతుని అర్థం చేసుకుంటాడు.