TE/Prabhupada 0534 - కృష్ణుడిని కృత్రిమంగా చూడడానికి ప్రయత్నించ వద్దు

Revision as of 13:01, 12 April 2018 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0534 - in all Languages Category:TE-Quotes - 1971 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971


ప్రభుపాద: కాబట్టి మనము గోస్వాముల యొక్క అడుగుజాడలను అనుసరించాలి, కృష్ణుడు మరియు రాధారాణిని ఏల వేతకాలి, వృందావనము, లేదా మీ హృదయంలో ఇది చైతన్య మహాప్రభు యొక్క భజన పద్ధతి: విరహ భావన, విప్రలంభ, విప్రలంభ-సేవ. ఉదాహరణకు చైతన్య మహా ప్రభు , కృష్ణుని నుండి విడిపోయే భావన విరహ భావన ఆయన సముద్రంలో పడిపోతున్నాడు. ఆయన తన స్నానాల గది లేదా పడక గదిలో నుండి బయటికి వస్తున్నారు, ఆయన అర్ధ రాత్రి వెళ్ళేవారు ఆయన ఎక్కడకి వెళ్ళారో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆయన పరిశోధన చేస్తున్నారు. భక్తియుక్త సేవ యొక్క ఈ పద్ధతిని చైతన్య మహాప్రభు ప్రచారము చేశారు. అది చాలా తేలిక కాదు, "మనము కృష్ణుని చూసాము లేదా రాధా రాణిని చూసాము రాస లీలలో." కాదు, అలాంటిది కాదు. విరహ భావన మీరు కృష్ణుని నుండి ఎంత విరహ భావనను అనుభవిస్తే, మీరు అంత భక్తిలో ఎదుగుతున్నారు అని ఆర్థం చేసుకోవాలి. కృష్ణుడిని కృత్రిమంగా చూడడానికి ప్రయత్నించ వద్దు. విరహ భావనలో ఎదగండి అప్పుడు అది ఖచ్చితముగా ఉంటుంది. ఇది చైతన్య మహా ప్రభు ఉపదేశములు. ఎందుకంటే మన భౌతిక కళ్ళతో మనము కృష్ణుని చూడలేము. Ataḥ śrī-kṛṣṇa-nāmādi na bhaved grāhyam indriyaiḥ ( CC Madhya 17.136) మన భౌతిక ఇంద్రియాలతో మనము కృష్ణుడిని చూడలేము, మనము కృష్ణుడి నామము గురించి వినలేము. కానీ sevonmukhe hi jihvādau. మీరు భగవంతుని యొక్క సేవ లో మీరే నిమగ్నం అయినప్పుడు... సేవ ఎక్కడ ప్రారంభమవుతుంది? Jihvādau. సేవ నాలుక నుండి ప్రారంభమవుతుంది. కాళ్ళు, కళ్ళు, లేదా చెవులు నుండి కాదు. నాలుక నుండి మొదలవుతుంది. Sevonmukhe hi jihvādau. మీరు మీ నాలుక ద్వారా సేవను ప్రారంభిస్తే... ఎలా? జపము చేయండి హరే కృష్ణ. మీ నాలుకను ఉపయోగించండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. కృష్ణ ప్రసాదము తీసుకోండి. నాలుకకు రెండు పనులు ఉన్నాయి: హరే కృష్ణ నామము చేయడము; ప్రసాదం తీసుకోవడము. ఈ పద్ధతి ద్వారా మీరు కృష్ణుడిని అర్ధము చేసుకుంటారు.

భక్తుడు: హరిబోల్!

ప్రభుపాద: కృష్ణుని చూడడానికి ప్రయత్నించవద్దు. మీ భౌతిక కళ్లతో మీరు కృష్ణుని చూడలేరు. మీ భౌతిక చెవులతో ఆయనను మీరు వినలేరు. మీరు తాకలేరు. కానీ మీరు మీ నాలుకని భగవంతుని సేవలో ఉపయోగించినట్లయితే, అప్పుడు ఆయన తనకు తానుగా మీకు వెల్లడి అవుతాడు, "ఇక్కడ నేను ఉన్నాను." అది కావలసినది. అందువల్ల కృష్ణుని పట్ల విరహ భావనను రాధారాణి వలె అనుభూతి చెందండి, చైతన్య మహా ప్రభు మనకు బోధిస్తున్నట్లుగా, భగవంతుని సేవలో నీ నాలుకను నిమగ్నము చేయండి అప్పుడు, ఒక రోజు, మీరు పరిణితి చెందినప్పుడు , మీరు కృష్ణుని ఎదురు ఎదురుగా చూస్తారు.

చాలా ధన్యవాదాలు.