TE/Prabhupada 0022 - కృష్ణుడు ఆకలితో లేరు
Lecture on SB 1.8.18 -- Chicago, July 4, 1974
కృష్ణ ప్రేమతో చెప్తాడు, "నా భక్తుడా," యో మే భక్త్యా ప్రయచ్ఛతి. కృష్ణుడు ఆకలి కలిగిన వాడు కాదు. కృష్ణ నీ దగ్గరకి నీ నైవేద్యము అంగీకరించడానికి ఆకలి తో రాలేదు. లేదు. ఆయన ఆకలి తో లేడు. ఆయన స్వయంగా పరిపూర్ణుడు, మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన సేవ పొందుతాడు, లక్ష్మి-సహస్ర-శత-సంభ్రమ-సేవ్యమానం, ఆయన వందల మరియు వేల అదృష్ట దేవతల నుండి సేవ పొందుతాడు. కానీ కృష్ణ చాలా దయామయుడు, ఎందుకంటే మీరు కృష్ణుని యొక్క నిజాయతి గల ప్రేమికుడు అయితే, ఆయన మీరు ఇచ్చే పత్రం పుష్పం అంగీకరిస్తాడు. మీరు చాలా పేద వాళ్ళు అయినా కూడా, ఆయన మీరు ఏదైతే ఇవ్వగలరో దాన్ని అంగీకరిస్తాడు ఒక చిన్నఆకు, కొంచెం నీరు, కొన్ని పుష్పములు. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరైనా కృష్ణునికి సమర్పించవచ్చు. కృష్ణ, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమి లేదు, నేను చాలా పేదవాడిని. దయచేసి ఇది స్వీకరించు. కృష్ణుడు అంగీకరిస్తాడు. కృష్ణుడు చెప్తాడు, తదహం అస్నామి, "నేను తింటాను." కావున ముఖ్యముగా కావాల్సింది భక్తి, అభిమానం, ప్రేమ.
కావున ఇక్కడ అలక్ష్యంగా చెప్పబడింది. కృష్ణుడు కనిపించడు, భగవంతుడు కనిపించడు, కానీ ఆయన చాలా దయ కలిగిన వాడు మీ ముందుకు వచ్చి, మీ భౌతిక కళ్ళకు కనిపిస్తున్నాడు. కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచంలో కనిపించడు, భౌతిక కనులకు. ఎలాగైతే కృష్ణ యొక్క అంతర్భాగామో మనము కూడా ఆయన లో అంతర్భాగమే, అన్ని జీవులు, కానీ మనము ఒకరిని ఒకరు చూడము. మీరు నన్ను చూడరు, నేను మిమ్మల్ని చూడను. లేదు, నేను నిన్ను చూస్తున్నాను. ఏమి చూస్తున్నారు? మీరు నా శరీరాన్ని చూస్తున్నారు అప్పుడు, ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయినప్పుడు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు "మా నాన్న వెళ్ళిపోయారు అని"? ఎందుకు తండ్రి వెళ్ళిపోయారు? తండ్రి అక్కడే ఉన్నాడు. అప్పుడు మీరు ఏమి చూసారు? మీరు మీ తండ్రి యొక్క శవమును చూసారు, మీ తండ్రిని కాదు. కావున మీరు కృష్ణ యొక్క కణము అయిన ఆత్మను చూడలేనప్పుడు, కృష్ణ ను ఎలా చూడగలరు? కావున శాస్త్రం చెప్తుంది, అతః శ్రీ-కృష్ణ-నామాది న భవేద్ గ్రాహ్యం ఇన్ద్రియైః ( CC Madhya 17.136) ఈ మొద్దుబారిన కళ్ళతో, అతను కృష్ణ ను చూడలేడు, లేదా కృష్ణ పేరు వినలేడు, నామాది. నామ అనగా పేరు. నామ అనగా పేరు, రూపం, లక్షణము, లీలలు. ఈ విషయాలు మీ మొద్దుబారిన కళ్ళ ద్వార లేదా ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకోలేరు. కానీ అవి శుద్ధి అయినప్పుడు, సేవోన్ముఖే హి జిహ్వాదౌ, అవి భక్తి సేవ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయబడితే, మీరు కృష్ణ ని ప్రతిసారి మరియు ప్రతిచోట చూడవచ్చు. కానీ సామాన్య మనిషికి, అలక్ష్యం: కనిపించడు. కృష్ణుడు ప్రతి చోట ఉన్నాడు, భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, అండాంతర- స్త -పరమాణు-కాయంతర-స్తం. కావున అలక్ష్యం సర్వ-భూతానాం. కృష్ణ బయట మరియు లోపల ఉన్నప్పటికీ, కానీ కృష్ణ ను చూడలేము, మనకు కృష్ణ ను చూడడానికి కళ్ళు ఉన్నప్పుడు తప్ప.
కావున ఈ కృష్ణ చైతన్య ఉద్యమం కళ్ళు తెరిచి కృష్ణ ను ఎలా చూడాలి, మరియు మీరు కృష్ణని చూడగలిగితే, అంతర్ః బహిర్ః, అప్పుడు మీ జీవితం విజయవంతం అవుతుంది. కావున శాస్త్రం చెప్తుంది ఏంటంటే,
- అంతర్ బహిర్. అంతర్ బహిర్ యది హారిస్ తపస్ తత్ కిం
- నంతర్ బహిర్ యది హారిస్ తపస్ తత్ కిం
- (Nārada Pañcarātra)
ప్రతి ఒక్కరు పరిపూర్ణము అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ పరిపూర్ణముగా ఉండడం అంటే కృష్ణ ని లోపల మరియు బయట చూడగలిగితే. అది పరిపూర్ణము.