TE/Prabhupada 0044 - సేవ అనగా గురువు ఆజ్ఞను పాటించడం

Revision as of 18:26, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 4.1 -- Montreal, August 24, 1968

అంటే, అతను శ్రీ కృష్ణుడు నిర్దేశించిన మార్గమును ఆచరిస్తున్నాడు. అంతే అతను భావించడు నేను కృష్ణునికి శత్రువుని అవుతాను అని. సూత్రము ఏమిటంటే అతను ఆచరిస్తున్నాడు కృష్ణుడు ఒకవేళ చెప్పినట్లు అయితే "నువ్వు నాకు శత్రువుగా ఉండు" అంటే, నేను అతనికి శత్రువు అవుతాను. ఇదే భక్తి యోగం. అవును, నేను కృష్ణుని సంతృప్తి పరచాలి. ఉదాహరణకు యజమాని తన సేవకునితో "నీవు ఇక్కడ నన్ను కొట్టుము", అని అడిగితే కావున అతను ఆ విధముగా కొడుతున్నాడు, కావున అది సేవ. ఇతరులు చూడవచ్చు, "అరె!! ఆ సేవకుడు తన యజమానిని కొడుతున్నాడు మరియు ఆ సేవకుడు నేను నా యజమానికి సేవచేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ అతడు తన యజమానిని కొడుతున్నాడే !!?? " అని అనుకుంటారు. కానీ ఆ యజమానే తన సేవకుడు తనని కొట్టాలని కోరుకుంటున్నాడు. సేవ అంటే నీవు నీ యజమాని ఆదేశాన్ని పాటించాలి. కావున అది సేవ. అది ఏమైనప్పటికినీ పట్టింపు లేదు!! దీనికి ఒక చక్కని ఉదాహరణ, శ్రీ చైతన్య మహాప్రభు జీవితంలో తనకి మరియు తన ఒక శిష్యుడైన గోవిందుడికి మధ్య జరిగిన ఒకానొక సంఘటన ఉంది శ్రీ చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకున్న పిదపనే (తరువాతనే), గోవిందుడు ఎల్లప్పుడూ తన ప్రసాదాన్ని తీసుకునేవాడు. ఒక రోజు శ్రీ చైతన్య మహాప్రభు తన ప్రసాదం స్వీకరించిన తరువాత, గడప దగ్గర కొద్దిగా విశ్రమించెను. గడప దగ్గర ?? అనగా మార్గ మధ్యంలో గోవిందుడు మహా ప్రభువుని దాటి లోనికి వచ్చాడు. గోవిందుడు ప్రతి రోజు మహా ప్రభువు విశ్రమించిన పిదప, మహా ప్రభు పాదాలను మర్దన చేసేవాడు. కావున గోవిందుడు మహా ప్రభువుని దాటి లోనికి ప్రవేశించి ప్రభువు పాదాలని మర్దన చేయసాగెను. అప్పుడు మహాప్రభువు నిద్రపోతున్నారు, అరగంట తరువాత, ఆయన లేవగానే గోవిందుడిని చూసి, "నీవు ఇంకా ప్రసాదము స్వీకరించలేదా?" అని అడినారు. లేదు మహాప్రభు, ఇంకా తీసుకోలేదు, "ఎందుకు ???" అని మహాప్రభువు అడుగగా, "మీరు మార్గ మధ్యములో పడుకున్నారు, అలాగైతే మరి నీవెట్లా లోనికి వచ్చావు ?. "నేను దాటి లోనికి వచ్చాను". ఎలా నన్ను దాటి లోనికి వచ్చావో, తిరిగి మళ్లీ ఎందుకు దాటకూడదు?? నేను మీకు సేవ చేయడానికి మాత్రమే ఇలా మిమ్ములను దాటి వచ్చాను. కానీ నేను నా ప్రసాదం స్వీకరించుట కొరకు మిమ్మల్ని దాటలేను. ఇలా చేయడం నా సేవా ధర్మం కాదు, అది నా కొరకు. ఇది మీ సేవ కొరకు. కనుక, కృష్ణుని ఆనందం కొరకు, నీవు అతనికి విరోధి అవ్వవచ్చు, మిత్రుడివి అవ్వవచ్చు , మరి ఇంకేదైనా అవ్వొచ్చు. ఇదే భక్తి యోగం. ఎందుకంటే, నీ లక్ష్యం ఎల్లప్పుడూ కృష్ణుని ఆనందపరచడం. ఎప్పుడైతే నీవు నీ ఇంద్రియ తృప్తి కొరకు పరితపిస్తావో, అప్పుడు నీవు వెంటనే ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తావు.

కృష్ణ బహిర్ముఖానుభోగ వాంఛాకరే
నికటస్థ మాయాతారే జాపత్యాదారే
(ప్రేమ వివర్త)

ఎప్పుడైతే మనం కృష్ణున్ని మరచి, మన భౌతిక ఇంద్రియ తృప్తి కోసము చేస్తామో, దీనినే "మాయా" అని అంటారు. ఎప్పుడైతే మనము ఈ ఇంద్రియ తృప్తిని విడిచిపెడతామో మరియు మన ప్రతి కార్యము కృష్ణుని కోసము చేస్తామో, అదియే విముక్తి.