TE/Prabhupada 0074 - మీరు జంతువులను ఎందుకు తినాలి

Revision as of 18:31, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 4.21 -- Bombay, April 10, 1974


అంతా భగవద్గీతలో వివరించబడింది. మీరు గాలి పీల్చడము ద్వారానే నివసించాలి అని. భగవద్గీత చెప్పలేదు భగవద్గీతలో చెప్పారు: అన్నాద్ భవంతి భూతాని ( BG 3.14) అన్నా. అన్నా అంటే ఆహార ధాన్యాలు. ఆహార ధాన్యం అవసరం ఉంది. అన్నాద్ భవంతి భూతాని. భగవద్గీత, మీరు తినడము అవసరం లేదు అని ఎప్పుడూ చెప్పలేదు మీరు కేవలం గాలి పీల్చి యోగా సాధన ద్వార జీవించండి అని చెప్పలేదు. మనం ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, ఇది సిఫార్సు చేయబడింది. యుక్తాహార-విహారస్య. మనము తక్కువ, ఎక్కువ తినకూడదు. నిరాశిస్. నిరాశిస్ అంటే విపరీతమైన కోరికలు. ఇప్పుడు మనము భౌతిక సంతృప్తిని మరింతగా కోరుకుంటున్నాము అది అవసరం లేదు. మీరు జీవితంలో పరిపూర్ణము కావాలంటే, దీనిని తపస్యా అని అంటారు.

ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, కానీ ఆయన అనవసరంగా కోరుకోకూడదు. ప్రతి ఒక్కరికి తినే హక్కు కూడా ఉంది. అందరికి హక్కు వున్నది. జంతువులకు కూడా కానీ మనం మరింత ఆస్వాదించాలని కోరుకుంటున్నాము. మనం జంతువులకు సరిగా జీవించడానికి అవకాశం ఇవ్వటము లేదు. బదులుగా, మనము జంతువులను తినడానికి ప్రయత్నిస్తున్నాము ఇది అవసరమైనది కాదు. ఇది నిరాశిః అంటారు. ఎందుకు మీరు జంతువులను తినాలి? ఇది అనాగరిక జీవితం. ఏ ఆహారం లేనప్పుడు,వారు ఆదివాసి ప్రజలు అయితే, వారు జంతువులను తినవచ్చును, ఎందుకంటే వారికి ఆహారాన్ని ఎలా పండించుకోవాలో తెలియదు. కానీ మానవ సమాజం నాగరికంగా మారినప్పుడు, ఆయన, చాలా మంచి ఆహారమును పండించవచ్చు ఆయన ఆవులను తినే బదులు ఆవులను పెంచుకోవచ్చు. ఆయనకి పాలు వుంటాయి, తగినంత పాలు. మనము పాలు, ధాన్యాల ద్వారా చాలా తయారీ చేసుకోవచ్చు. మనం అనవసరంగా ఆనందించడానికి కోరుకోకూడదు.

ఇక్కడ చెప్పబడింది కుర్వాన్ నాప్నోతి కిల్బిషమ్. కిల్బిషమ్ అంటే పాపముల జీవితము ఫలితంగా అని అర్థం. మన అవసరాని కన్నా ఎక్కువగా కోరుకుంటే, అప్పుడు మనము చిక్కుకుపోతాము, పాపపు కార్యాలలో పాల్గొనడం, కుర్వాన్ అపి, పనిలో వినియోగించినప్పుడు ఐనప్పటికీ. మీరు పని చేస్తున్నప్పుడు తెలిసే లేదా తెలియకుండా , మీరు పాపములు, పవిత్రమైనది కాని పనులు చేస్తారు కానీ మీరు సరిగ్గా బ్రతకాలని, కోరుకుంటే, అప్పుడు కుర్వాన్ నాప్నోతి కిల్బిషమ్. మన జీవితం ఏ పాప ఫలితాలు లేకుండా ఉండాలి. లేకపోతే మనము బాధపడాలి. చాలా అసహ్యకరమైన జీవితాలను చూసినప్పటికీ వారు నమ్మరు. 84,00,000 జీవన జాతులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? అసహ్యకరమైన పరిస్థితిలో జీవించే జీవులు చాలా ఉన్నాయి. వాస్తవానికి, జంతువు లేదా ఇతర జీవులకు తెలియదు, కానీ మానవులుగా, మనము ఈ జీవితం ఎందుకు హేయమైనదిగా వున్నదో తెలుసుకోవాలి. ఇది మాయ భ్రాంతి.

ప్రతి ఒక్కరు కూడా ఒక పంది చాలా మురికిగా నివసిస్తున్నది, మలము తింటూ, అది చాలా సంతోషంగా వున్నాను అని అనుకుంటుంది. అందువలన అది కొవ్వును పొంది ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు, "నేను చాలా సంతోషంగా ఉన్నాను," ఆయన కొవ్వును కలిగివుంటాడు మీరు చూస్తారు ఈ పందులు చాలా కొవ్వుతో ఉంటాయి, కానీ వారు తినేది ఏమిటి? అవి మలం తిని, మురికి ప్రదేశములో వుంటాయి. కానీ అవి "మనము చాలా సంతోషంగా ఉన్నాము" అని అనుకుంటాయి. అది మాయ యొక్క భ్రమ. జీవితంలో చాలా అసహ్యకరమైన పరిస్థితిలో జీవిస్తున్న కొంత మంది, మాయ, భ్రాంతి ద్వారా, ఆయన సరిగ్గా ఉన్నాడని ఆయన చాలా పరిపూర్ణంగా వున్నాను అని ఆలోచిస్తున్నాడు, కానీ ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన చాలా అసహ్యకరమైన స్థితిలో నివసిస్తున్నాడని చూస్తాడు.

ఈ భ్రాంతి ఉంది, కానీ జ్ఞానం ద్వారా, మంచి సాంగత్యము ద్వారా, శాస్త్రము నుండి, గురువు నుండి, సాధువుల నుండి, జీవితం యొక్క విలువ ఏమిటో అర్థం చేసుకోవాలి మరియు అలా జీవించాలి. ఇది కృష్ణుడిచే ఆదేశించబడుతుంది, అది నిరాశిః, అనవసర కోరికలతో ఉండకూడదు, జీవితం యొక్క అవసరాల కంటే ఎక్కువ ఉండకుడదు. దీనిని నిరాశిః అని పిలుస్తారు. నిరాశిః. ఇంకొక అర్థం ఏమిటంటే భౌతిక ఆనందాన్ని ఇష్టపడకపోవటము. ఆయన పూర్తి జ్ఞానంతో ఉన్నప్పుడు ఇది సాధ్యమే "నేను ఈ శరీరం కాదు. నేను ఒక ఆధ్యాత్మిక ఆత్మను. ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎలా ఉన్నత స్థానము వెళ్ళాలి అనేది నా అవసరం. అప్పుడు ఆయన నిరాశి కావచ్చు. ఇవి తపస్సు కొరకు అంశాలు.

ప్రస్తుతం, ప్రజలు మరచిపోయారు. వారికి తపస్సు అంటే ఏమిటో తెలియదు. కానీ మానవ జీవితం ఈ ప్రయోజనము కోసం ఉద్దేశించబడింది. Tapo divyaṁ putrakā yena śuddhyet sattvaṁ yena brahma-saukhyam anantam ( SB 5.5.1) ఇవి శాస్త్రం యొక్క ఆదేశాల. మానవ జీవితం తపస్యా కోసం ఉద్దేశించబడింది. తపస్యా...

అందువలన, వేదముల మార్గం ప్రకారం, జీవితం ప్రారంభంలో తపస్య, బ్రహ్మచారి దశ వున్నది బ్రహ్మచర్య సాధన కోసం గురుకులమునకు ఒక విద్యార్థి పంపబడుతాడు. ఇది తపస్యా, సౌకర్యవంతమైన జీవితం కాదు. నేలపై పడుకోవాలి, గురువు కోసం భిక్ష కోరుతూ ఇంటింటికి వెళ్లుతారు. కానీ వారు అలసిపోరు. వారు పిల్లలు, వారు ఈ తపస్సులలో శిక్షణ ద్వారా వారి సాధన ప్రారంభమవుతుంది. వారు ప్రతి స్త్రీని "అమ్మా" అని పిలుస్తారు." తల్లీ నాకు భిక్ష ఇవ్వండి అని అడుగుతారు వారు గురువు ఇంటికి తిరిగి వస్తారు. భిక్ష ద్వారా వచ్చినదంతా గురువుకి చెందుతుంది. ఇది బ్రహ్మచారి జీవితం. ఇది తపస్యా. తపో దివ్యం ( SB 5.5.1) ఇది వేదముల నాగరికత పిల్లలు జీవితం ప్రారంభం నుండి తపస్యా, బ్రహ్మ కార్యక్రమాలలో శిక్షణ పొందుతారు. బ్రహ్మచర్యము. బ్రహ్మచారి ఏ మహిళను చూడడు. గురువు భార్య యవ్వనములో ఉంటే, ఆయన గురువు భార్యకు దగ్గరగా వెళ్ళడు. ఇవి ఆంక్షలు. ఆ బ్రహ్మచర్యము ఎక్కడ ఉంది? బ్రహ్మచారులు లేరు. ఇది కలియుగము. తపస్సు లేదు