TE/Prabhupada 0085 - జ్ఞాన సంస్కృతి అంటే ఆధ్యాత్మిక సంస్కృతి

Revision as of 18:32, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on Sri Isopanisad, Mantra 9-10 -- Los Angeles, May 14, 1970

విజ్ఞానమును పెంపొందించుకోవడము ద్వారా ఒక ఫలితం వస్తుంది అని జ్ఞాన వంతులు వివరించారు అజ్ఞానమును పెంపొందించుకోవడము ద్వారా వేరొక ఫలితం వస్తుంది

కాబట్టి నిన్న మనము కొంత వరకు వివరించాము అజ్ఞానమును పెంపొందించుకోవడము అంటే ఏమిటో జ్ఞానం పెంపొందించుకోవడము అంటే ఏమిటి. అజ్ఞానమును పెంపొందించుకోవడము అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అని అర్థం. అది వాస్తవమైన జ్ఞానం. సౌకర్యల కోసం పరిజ్ఞానాన్ని పెంపొందించడము లేదా భౌతిక శరీరం రక్షించేందుకు, అది అజ్ఞాన సంస్కృతి. మీరు ఏ విధముగానైనా శరీరమును రక్షించేందుకు ప్రయత్నించండి అది సహజముగా జరగవలసినది జరుగుతుంది. అది ఏమిటి? జన్మ -మృత్యు-జరా-వ్యాధి ( BG 13.9) మీరు పునరావృతమవుతున్న జనన మరణముల నుండి, ఈ శరీరమును ఉపశమనం కావించలేరు వ్యక్తమైనప్పుడు వ్యాధి ముసలి తనము నుండి. ప్రజలు శరీరం యొక్క జ్ఞానమును పెంపొందించుకోవటానికి చాలా వరకు తీరిక లేకుండా ఉన్నారు వారు ప్రతి క్షణం ఈ శరీరం కుళ్లిపోతుంది అని చూస్తున్నప్పటికీ శరీరం యొక్క మరణం, జన్మించగానే నమోదు అవుతుంది వాస్తవం. కాబట్టి మీరు శరీరం యొక్క సహజ క్రమమును ఆపలేరు. మీరు శరీరం యొక్క క్రమమును అంగీకరించాల్సి ఉంటుంది అవి, పుట్టుక, మరణము, ముసలితనం, వ్యాధి.

కాబట్టి భాగవతము చెప్తుంది యస్యాత్మ బుద్ధిః కుణాపే త్రిధాతుకే ( SB 10.84.13) ఈ శరీరమును మూడు ప్రాథమిక అంశాలతో తయారు చేసారు శ్లేష్మం, పిత్తం, గాలి. ఇది వేదలు ఆయుర్వేదముల చికిత్స ప్రకారము ఈ శరీరం శ్లేష్మం, పిత్తం, గాలి యొక్క ఒక సంచి ముసలితనంలో వాయుప్రసరణ దెబ్బతింటుంది; కాబట్టి ముసలివారికి కీళ్ళవాతం చాలా శారీరక వ్యాధులు వస్తాయి

కాబట్టి భాగవతము చెప్తుంది, "పిత్తం, శ్లేష్మం, గాలి ఈ కలయికను తానుగా అంగీకరించినా వ్యక్తి, ఆయన ఒక గాడిద. నిజానికి, ఇది వాస్తవం. మనము పిత్త, శ్లేష్మం, గాలి యొక్క కలయికను మనముగా అంగీకరిస్తే కాబట్టి తెలివైన వాడు, గొప్ప తత్వవేత్త, ఒక గొప్ప శాస్త్రవేత్త, దీని అర్థము ఆయన పిత్త, శ్లేష్మం, గాలి యొక్క కలయిక? కాదు, ఇది తప్పు. ఆయన పిత్త లేదా శ్లేష్మం లేదా గాలి నుండి భిన్నము. ఆయన ఒక ఆత్మ. ఆయన కర్మ ప్రకారం, ఆయన తన ప్రతిభను చూపిస్తున్నాడు కాబట్టి వారు కర్మ, కర్మ సిధ్ధాంతమును అర్థం చేసుకోలేరు. మనము వివిధ వ్యక్తిత్వాలను ఎందుకు చూస్తాము?