TE/Prabhupada 0095 - మన కర్తవ్యము శరణాగతి పొందుట
Lecture on BG 4.7 -- Bombay, March 27, 1974
మనము శరణాగతి పొందుతున్నాము. కానీ కృష్ణుడికి శరణాగతి పొందటము లేదు. ఇది వ్యాధి. ఇది వ్యాధి. కృష్ణ చైతన్య సంఘం యొక్క లక్ష్యం ఈ వ్యాధికి చికిత్స చేయడము. ఈ వ్యాధిని నయం చేయుట. కృష్ణుడు కూడా వస్తారు. అతను చెప్పుతున్నారు yadā yadā hi dharmasya (BG 4.7). dharmasya glāniḥ, ధర్మమును ఆచరించడములో ధర్మమునకు హాని కలిగినప్పుడు హాని జరిగినప్పుడు krsna says, tadātmānaṁ sṛjāmy aham. And abhyutthānam adharmasya. రెండు విషయాలు ఉన్నాయి కృష్ణడు యొక్క ఆశ్రయం తీసుకోననప్పుడు, వారు అనేక కృష్ణులను తయారు చేస్తారు అనేకమంది ముర్ఖులు ఆశ్రయము పొందుటకు. దీనిని adharmasya అంటారు ధర్మము అంటే కృష్ణడికి ఆశ్రయం పొందుట కానీ కృష్ణడుకి ఆశ్రయం పొందే బదులు వారు కుక్కలకు, పిల్లులకు వీటికి, వాటికీ చాల అంశాలకు ఆశ్రయము తీసుకుంటారు. ఇది ఆధర్మం.
కృష్ణడు హిందూ ధర్మము లేదా ముస్లిం ధర్మము లేదా క్రైస్తవ ధర్మము అని పిలవబడేవాటిని ఏర్పాటు చేయుటకు రాలేదు వారు వాస్తవమైన ధర్మమును ఏర్పాటు చేయుటకు వచ్చారు నిజమైన ధర్మము అంటే మనము నిజమైన వ్యక్తి దగ్గర ఆశ్రయము తీసుకోవాలి. అది నిజమైన ధర్మము. మనము ఆశ్రయము పొందుతున్నాము అందరికి కొంత అవగాహన ఉన్నాది. ఆయన అక్కడ ఆశ్రయం తీసుకున్నాడు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత, ఏదైనా, ఎక్కడో ఒక్క చోట ప్రతి ఒక్కరికి కొంత అవగాహన వుంది ఈ ఆదర్శమునకు అధిపతి కూడా ఉన్నాడు. మన కర్తవ్యము ఆశ్రయము పొందుట ఇది వాస్తవము. కానీ మనము ఎక్కడ ఆశ్రయం పొందాలో తెలియదు. ఆది సమస్య. ఆశ్రయము ఎక్కడ పొందాలో తెలియకపోవటము వలనా లేదా పొందుటలో పొరపాటు చేయుటవలన మొత్తం ప్రపంచం అస్తవ్యస్తమైన పరిస్థితిలో వున్నది.
మనము ఆశ్రయమును ఒక చోటనుండి మరొక చోటకు మారుస్తున్నాము. ఇoక కాంగ్రెస్ పక్షము వద్దు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పక్షము " తరువాత ఇక కమ్యూనిస్ట్ పక్షము వద్దు. ఈ పక్షము, ఆ పక్షము. పక్షము మారడము వలన ఉపయోగం ఏమిటి? ఎందుకంటే ఈ పక్షము లేదా ఆ పక్షము వారు. కృష్ణుడికి ఆశ్రయము పొందలేదు. మీరు కృష్ణుడికి ఆశ్రయము పొందాలి అని నిర్నయించుకోక పోతే శాంతి ఉండదు. ఇది అర్ధము చేసుకోవలసిన విషయము. మీరు పెనము మీదనుండి మంటలోనికి మారడము మిమల్ని రక్షించదు అందువల్ల కృష్ణడు యొక్క చివరి ఆదేశం
- sarva-dharmān parityajya
- mām ekaṁ śaraṇaṁ vraja
- ahaṁ tvāṁ sarva-pāpebhyo
- mokṣayiṣyāmi...
- (BG 18.66)
ధర్మము యొక్క హాని అంటే అర్థము .శ్రీమద్-భాగవతములో పేర్కొన్నారు. Sa vai puṁsāṁ paro dharmaḥ. మొదటి తరగతి లేదా ఉన్నతమైన ధర్మాము. Paraḥ అంటే పరబ్రహ్మము Sa vai puṁsāṁ paro dharmo yato bhaktir adhokṣaje (SB 1.2.6). మనము Adhokṣajaకు శరణు తీసుకోవడం వలన adhokshaj అంటే మహోన్నతమైన అద్యాత్మికము లేదా కృష్ణడు కృష్ణుని మరో పేరు Adhokṣaja, Ahaituky apratihatā. Ahatuki అంటే ఎటువంటి కారణం లేకుండా. ఎటువంటి కారణం లేకుండా. కృష్ణుడు అంతటి వాడు ఇటువంటి వాడు అందువలన నేను ఆశ్రయము తీసుకుంటాను కాదు, ఎ కారణం లేకుండా. Ahaituky apratihatā. దీనిని ఆపలేము. ఎవరు ఆపలేరు. మీరు కృష్ణుడికి ఆశ్రయము పొందాలంటే ఏది అపకుడదు, ఏది అడ్డంకి కాకూడదు. మీరు ఏ పరిస్థితిలో అయిన చేయవచ్చు. మీరు దీన్ని చెయ్యవచ్చు. Ahaituky apratihatā yayātmā suprasīdati. అప్పుడు మీరు ,మీ ఆత్మ, మీ మనస్సు, మీ శరీరం, సంతృప్తి చెందుతారు. ఇది పద్ధతి.