TE/Prabhupada 0126 - నా ఆధ్యాత్మిక గురువు సంతృప్తి కోసమే

Revision as of 18:39, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 4.18 -- Delhi, November 3, 1973

భక్తురాలు: మీరు చెప్పారు మనము చేస్తున్న సేవలకు కృష్ణుడు సంతోషించినడా లేదా ఆని పరీక్షించవలెను. కానీ పరీక్ష ఏమిటి?

ప్రభుపాద: ఆధ్యాత్మిక గురువు గనుక సంతోషించినట్లయితే, కృష్ణుడు సంతోషిస్తాడు. మీరు రోజు ఈ పాటను పాడుతున్నారు. Yasya prasādād bhagavat-prasādo yasyāprasādān na gatiḥ kuto 'pi. ఆధ్యాత్మిక గురువు సంతోషించినట్లయితే, అప్పుడు కృష్ణుడు సంతోషిస్తాడు. అది పరీక్ష. గురువు సంతోషిoచక పోతే, అయినకు ఏ ఇతర మార్గం లేదు. ఇది అర్థం చేసుకొనుట చాలా సులభం. కార్యాలయంలో పని చేస్తున్న ఎవరైనా అనుకుందాం,తన పైన వున్నవారు అతనికి యజమాని, హెడ్ గుమస్తా లేదా ఆ శాఖ సూపరింటెండెంట్. అందరూ పని చేస్తున్నారు. అయిన సూపరిండెంట్ను సంతృప్తిపరిస్తే, లేదా హెడ్ గుమస్తాను, అయిన మేనేజింగ్ డైరెక్టర్ను సంతృప్తి పరిచాడు అని అర్ధం చేసుకోవాలి ఇది చాలా కష్టం కాదు. మీపైన ఉన్న అధికారి, కృష్ణుడి ప్రతినిధి, అయినను సంతృప్తి పరచాలి. Yasya prasādād bhagavat-prasādo yasya. అందువలన ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకత్వం అవసరం. కృష్ణుడు ఆధ్యాత్మిక గురువు రూపంలో వస్తాడు. ఇది చైతన్య-చరితామృత్తంలో చెప్పబడింది. Guru-krsna -kṛpāya. Guru-krsna -kṛpāya. గురు-కృప, గురువు యొక్క దయ, కృష్ణుని యొక్క దయ. వారిద్దరూ సంతృప్తి చెందినప్పుడు మన మార్గం స్పష్టంగా ఉంటుంది. Guru-krsna -kṛpāya pāya bhakti-latā-bīja (CC Madhya 19.151). అప్పుడు మన భక్తియుక్త సేవ సంపుర్ణమవుతుంది మీరు ఈ వాక్యమును గురుఅష్టకలో గుర్తు పట్టలేదా? Yasya prasādād bhagavat-prasādo yasyāprasādān na gatiḥ kuto 'pi.

ఈ ఉద్యమం లాగానే. ఈ ఉద్యమం నా ఆధ్యాత్మిక గురువు సంతృప్తి కోసం మాత్రమే ప్రారంభించబడింది. అయిన కోరారు. చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం ప్రపంచమంతా వ్యాపించాలని కోరుకున్నారు. అందువలన అయిన నా గాడ్ బ్రదర్స్ అనేక మందిని ఆదేశించారు, కావలని కోరుకున్నారు ... అయిన ఆదేశించలేదు, అయిన కోరుకున్నారు. అయిన నా గాడ్ బ్రదర్స్లో కొoత మందిని విదేశీ దేశాలకు పంపారు, ఏది ఏమయినప్పటికీ, అయిన విజయవంతం కాలేదు. ఆయన వారిని తిరిగి వెనక్కి పిలిచారు. నేను అనుకున్నాను "ఈ వృద్ధాప్యంలో నేను ప్రయత్నిస్తాను." ఆధ్యాత్మిక గురువు కోరికను తృప్తి పరచడాము మాత్రమే కోరిక. మీరు ఇప్పుడు సహాయం చేశారు. ఇది విజయవంతం అయింది. ఇది yasya prasādād bhagavat-prasādaḥ. మనము నిజంగా నిజాయితీగా ఆధ్యాత్మిక గురువు సూచించిన దిశలో పని చేస్తే, అది కృష్ణుని సంతృప్తి పరుస్తుంది, కృష్ణడు మనకు భక్తిలో ఉన్నతి చెందటానికి సహాయం చేస్తాడు.