TE/Prabhupada 0151 - మనము ఆచార్యుల దగ్గర నుండి నేర్చుకొనవలెను
Lecture on SB 7.6.1 -- Madras, January 2, 1976
మనము వివిధ ప్రణాళికలు చేస్తున్నాము కానీ అవి విజయవంతం కావు అది అంత నేను గత రాత్రి వివరించాను, మనం స్వతంత్రంగా ఆలోచిస్తున్నాం చాలా విషయాలకు స్వతంత్రంగా ప్రణాళిక చేస్తున్నాం సంతోషంగా ఉండడానికి . ఇది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. అది మాయ మనకు బ్రాంతి కలిగించే ఏర్పాటు. Daivī hy eṣā guṇa-mayī mama māyā duratyayā. మీరు అధిగమించలేరు. అంతిమ పరిష్కారం ఏమిటి? Mām eva ye prapadyante māyām etāṁ taranti te (BG 7.14). మనము కృష్ణకు ఆశ్రయముపొందితే, మన అసలు స్వరూపమును పునరుద్ధరించుకుంటాము. అంటే ... కృష్ణ చైతన్యము అoటే మన చైతన్యంతో ఎన్నో విషయాలు ఉంచుకునే బదులు ... అవి అన్ని కలుషిత చైతన్యములు. వాస్తవమునకు. మనకు చైతన్యము వున్నది, అది నిజం, కానీ మన చైతన్యము కలుషితం అయినది. మనము చైతన్యమును శుద్ధి చేసుకోవాలి. చైతన్యమును శుద్ధి చేసేందుకు కావలసినది భక్తి. భక్తి, నారాద పంచారాత్రలో ఇవ్వబడిన నిర్వచనం ... రూపా గోస్వామి ... రూపా గోస్వామి అంటున్నారు,
- anyābhilāṣitā-śūnyaṁ
- jñāna-karmādy-anāvṛtam
- ānukūlyena kṛṣṇānu-
- śīlanaṁ bhaktir uttamā
- (Brs. 1.1.11)
ఇతర ఉద్దేశ్యం లేనిది ఫస్ట్ క్లాస్ భక్తి అంటారు Anyābhilā ... ఇక్కడ భౌతిక ప్రపంచంలో, భౌతిక ప్రకృతి నియంత్రణలో Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ, ahaṅkāra-vimūḍhātmā kartā... (BG 3.27). మనము ప్రకృతి యొక్క పూర్తి నియంత్రణలో ఉన్నాము, భౌతిక ప్రకృతి. మనం మూర్ఖులము కనుక, ఎందుకంటే మన స్థానాన్ని మనము మరచిపోయాము, అందువలన అహంకారము ఇది అహాoకారము : "నేను భారతీయుడిని," "నేను అమెరికన్ని," "నేను బ్రహ్మణుడిని," "నేను క్షత్రియుడిని" ఇది అహంకారము అందువల్ల నరాద పంచారాత్ర చెపుతుంది sarvopādhi-vinirmuktaṁ (CC Madhya 19.170). హోదాలచే కలుషితము కాకుండా ప్రతి ఒక్కరు స్వేచ్చను పొందవలెను నేను భారతీయుడిని, "నేను అమెరికన్ని," ఇది నేను, "" ఇది నేను. "" నేను ... " Sarvopādhi vinirmuktaṁ tat-paratvena nirmalam. అయిన పరిశుద్ధమైనప్పుడు, నిర్మలముగా, ఏ హోదా పట్ల ఆకర్షణ లేకుండా, "నేను కృష్ణుడి ఆoశను" Ahaṁ brahmāsmi.
ఇది ahaṁ brahmāsmi. కృష్ణుడు దేవాదిదేవుడు. అయినను శ్రీమద్-భగవద్గీతలో వివరించారు. అర్జున Arjuna... Paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān puruṣaṁ śāśvatam ādyam (BG 10.12). అర్జునుడు దీనిని గుర్తించి, "మీరు ప్రామాణికులందరిచే గుర్తించబడ్డారు" అని అన్నాడు. ప్రహ్లాదా మహరాజా ప్రామాణికులలో ఒకరు. నేను ప్రామాణికులను వర్ణించాను. బ్రహ్మా ప్రామాణికం, శివడు ప్రామాణికం, కపిల దేవుడు ప్రామాణికం, కుమారా, నలుగురు కుమారాలు, వారు ప్రామాణికులు, మను ప్రామాణికం. అదేవిధంగా, ప్రహ్లాదా మహారాజ ప్రామాణికం. జనక మహారాజ ప్రామాణికం. పన్నెండు మంది ప్రామాణికులు ఉన్నారు అర్జునుడు ధృవీకరించాడు "నీవు నీ గురించి మాట్లాడుతున్నావు, నీవే, నీవే దేవదిదేవుడివి అని" mattaḥ parataraṁ nānyat (BG 7.7), భగవద్గీత చర్చద్వార నేను కూడా నిన్ను పరా బ్రాహ్మము (దేవాది దేవుడిగా) అంగీకరిస్తున్నాను. అంతేకాకుండా, ప్రామాణికులు అందరు కూడా మిమ్మల్ని దేవదిదేవునిగా అంగీకరించారు. ఇటీవలే, మన కాలములో, రామానుజాచార్య, మధ్వాచార్య, ఆచార్యులు అందరు కుడా కృష్ణుడిని దేవదిదేవునిగా అంగీకరిoచారు. శంకరాచార్య కూడా, అయిన కృష్ణుని అంగీకరించారు. కావున bhagavān svayaṁ kṛṣṇaḥ. కృష్ణుడుని దేవాదిదేవునిగా ఆచార్యులు అందరు అంగీకరించారు.
మనం ఆచార్యుల నుండి నేర్చుకోవాలి, సామాన్య మానవుడు లేదా ఏ స్వయం ప్రకటిత ఆచార్యుల నుండి కాదు. కాదు. అ విధానము పని చేయదు. మన లాగే ... కొన్నిసార్లు న్యాయస్థానములో మనకు తీర్పును ఇస్తారు. అది ప్రామాణికం అయినందు వలన మనము చాలా సీరియస్ గా తీసుకుంటాము మనము తీర్పు ఇవ్వలేము. అదేవిధంగా, భగవద్గీతలో ఆచర్యోపసానము సిఫార్సు చేయబడింది. మనము ఆచార్యుల దగ్గరకు వెళ్ళాలి. Ācāryavān puruṣo veda: ఆచార్యుడిని ఆచార్య పరంపరలో అంగీకరించినవారికి, ఆయనకు తెలుసుస్తుంది అందువల్ల, ఆచార్యులు అందరు దేవాదిదేవుడుగా కృష్ణునిని అంగీకరిస్తారు. నారద, అయిన ఆమోదించారు, Vyāsadeva, అయిన అంగీకరించారు, అర్జునుడు కూడా అంగీకరించారు, అతడు వ్యక్తిగతంగా కృష్ణుని దగ్గర, భగవద్గీతను విన్నాడు. బ్రహ్మదేవుడు. నిన్న ఎవరో ప్రశ్నించారు, "కృష్ణుడి పేరు ద్వాపర-యుగానికి ముందు ఉందా?" అక్కడ ఉంది.శాస్త్రములలో కృష్ణుడు ఉన్నారు. వేదాలలో, అధర్వ వేదంలో ఇతర వేదములలో, కృష్ణుడు పేరు ఉంది. బ్రహ్మ సంహితలో , బ్రహ్మదేవుడు, బ్రహ్మ సంహిత రాశాడు- ఇది స్పష్టంగా వివరించబడింది, īśvaraḥ paramaḥ kṛṣṇaḥ sac-cid-ānanda-vigrahaḥ (Bs. 5.1), anādir ādiḥ. Anādir ādir govindaḥ sarva-kāraṇa-kāraṇam (Bs. 5.1). కృష్ణుడు కూడా చెప్పుతారు mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañjaya (BG 7.7). Ahaṁ sarvasya prabhavo (BG 10.8). Sarvasya అంటే దేవతలు అందరు, జీవులూ అందరు, ప్రతిఒక్కటి. వేదాంత చెప్పినది, janmādy asya yataḥ (SB 1.1.1). కృష్ణుడు పరమ మహోనతమైన వ్యక్తి īśvaraḥ paramam, బ్రహ్మ దేవుడి నుండి ఆయన వేదముల జ్ఞానమును ప్రచారము చేసినాడు, కృష్ణుడు కూడా చెప్తాడు, vedaiś ca sarvair aham eva vedyam (BG 15.15). ఇది అంతిమ లక్ష్యం.