TE/Prabhupada 0152 - పాపములు చేసే వ్యక్తి కృష్ణ భక్తుడు కాలేడు



Lecture on BG 1.31 -- London, July 24, 1973

ప్రతి ఒక్కరు Gṛha-kṣetra-sutāpta-vittaiḥ (SB 5.5.8)) గృహస్థా జీవితంతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు కొంత భూమి కలిగి ఉంటారు ఆ రోజుల్లో పరిశ్రమ లేదు. అందువలన పరిశ్రమ అంటే భూమి అని అర్థం కాదు. మీకు భూమి వుంటే, మీరు మీ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. కానీ వాస్తవానికి మన జీవితము అదే. ఈ గ్రామంలో మనం చాలా ఖాళీగా ఉన్న భూమిని చూస్తున్నాము, కాని వారు వారి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవటములేదు. వారు తినడానికి వారు ఆవులను, నిస్సహాయమైన ఆవులను చంపుతున్నారు. ఇది మంచిది కాదు. Gṛha-kṣetra. మీరు గృహస్థ అవుతారు, కాని మీరు మీ ఆహారాన్ని భూమి నుండి ఉత్పత్తి చేసుకోండి. మీరు ఆహారాన్ని ఉత్పత్తి చేసేటప్పుడు, అప్పుడు పిల్లలు కనండి, Gṛha-kṣetra-suta-āpta-vitta. భారతదేశంలో గ్రామలలో, ఇప్పటికీ ఈ పద్ధతి వుంది పేద వ్యక్తులలో , రైతులలో, రైతు ఆవును ఉంచుకోలేక పోతే, అయిన వివాహం చేసుకోడు. jaru and garu. జారు అంటే భార్య, గారు అంటే ఆవు. ఒక ఆవుని వుంచుకోగలిగితేనే అతను భార్యను స్వీకరిస్తాడు. జారు మరియు గారు. మీరు భార్యను ఉంచుకుంటే, వెంటనే పిల్లలు వస్తారు. కానీ మీరు వారికి ఆవు పాలు ఇవ్వకపోతే, పిల్లలు చాలా ఆనారోగ్యముతో వుంటారు., వారు తగినంత పాలు త్రాగాలి. కావున ఆవును తల్లిగా భావిస్తారు. ఒక తల్లి పిల్లలకు జన్మనిస్తుంది, మరొక తల్లి పాలు సరఫరా చేస్తోంది.

అందువల్ల ప్రతి ఒక్కరూ ఆవు తల్లికి రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఆమె పాలు సరఫరా చేస్తోంది. మన శాస్త్రముల ప్రకారం ఏడుగురు తల్లులు ఉన్నారు. Ādau mātā, వాస్తవమైన తల్లి, ఆమె శరీరం నుండి నేను పుట్టినాను. Ādau mātā, ఆమె తల్లి. గురు-పత్నీ, ఆచార్యుని భార్య. ఆమె కూడా తల్లి. Ādau mātā guru-patnī, brāhmaṇī. ఒక బ్రాహ్మణుడి భార్య, ఆమె కూడా తల్లి. Ādau mātā guru-patnī brāhmaṇī rāja-patnikā, Ādau mātā guru-patnī brāhmaṇī rāja-patnikā, రాజు భార్య రాణి కుడా తల్లి. కావున ఎoతమంది? Dhenu means cow. Dhenu అంటే ఆవు అని అర్థం. ఆమె కూడా తల్లి . Dhātrī అంటే నర్స్. Dhenu dhātrī tthā pṛthvī, భూమి కూడా. భూమి కూడా తల్లి. సాధారణంగా ప్రజలు జన్మించిన మాతృభూమిని ప్రేమతో చూస్తున్నారు. అది మంచిది. కానీ వారు కూడా తల్లి ఆవు యొక్క సంరక్షణ తీసుకోవాలి. కానీ వారు తల్లి సంరక్షణ తీసుకోవడం లేదు. అందువలన వారు పాపత్ములు. వారు బాధపడాలి. వారికి యుద్ధం, అంటురోగలు, కరువు వుంటాయి ప్రజలు పాపములు చేస్తుంటే, వెంటనే ప్రకృతి సహజముగా శిక్షిస్తుంది. మీరు దానిని నివారించలేరు.

అందువలన కృష్ణ చైతన్య ఉద్యమం అoటే అన్ని సమస్యలకు పరిష్కారం. పాపo చేయకుoడాఉండమని ప్రజలకు బోధిoచడo. ఎందుకంటే పాపము చేసే మనిషి కృష్ణ భక్తుడు కాలేడు. కృష్ణ భక్తుడు కవాలoటే అయిన తన చేసే పాపములను అపవలసి ఉంటుంది.