TE/Prabhupada 0166 - మీరు మంచు పడటాన్ని ఆపలేరు
Lecture on BG 2.7-11 -- New York, March 2, 1966
మనము ఎల్లప్పుడూ బాధలతో ఉoటామని మర్చిపోకూడదు. మూడు రకాల బాధలు ఉన్నాయి. ఈ ఆర్థిక సమస్య గురించి నేను చెప్పను ... అది కూడా మరొక బాధ. కానీ వేదముల జ్ఞానం ప్రకారం - ఇది వాస్తవం - మూడు రకాల బాధలు ఉన్నాయి. శరీరం మనస్సు యొక్క ఒక రకమైన బాధ ... ఇప్పుడు, నాకు తలనొప్పి వస్తుంది అని అనుకుందాం. ఇప్పుడు నాకు జ్వరము వచ్చింది , నాకు చాలా చలిగా ఉన్నాది, అనేక శరీర బాధలు ఉన్నాయి. అదేవిధంగా, మనము మనస్సు యొక్క బాధలను కుడా కలిగి ఉన్నాము. నా మనస్సు నేడు బాగా లేదు. నేను ఉన్నాను... ఎవరో నన్ను ఏదో అన్నారు.. నేను బాధపడుతున్నాను. లేదా నేను ఏదో లేదా ఒక్క స్నేహితుడిని, చాలా వాటిని కోల్పోయాను. శరీరం మనస్సు యొక్క బాధలు, తరువాత ప్రకృతి ద్వారా బాధలు, ప్రకృతి. దీనిని ఆధిదైవిక అని పిలుస్తారు, మనకు నియంత్రణ లేదు. ప్రతి బాధలో మనకు ఎటువంటి నియంత్రణ లేదు, ముఖ్యంగా ... భారీగా మంచు కురుస్తుంది అనుకుందాం. మొత్తం న్యూయార్క్ నగరం మంచు పడుతోంది, మనము అందరము అసౌకర్యాములో ఉంచబడ్డము ఇది ఒక విధమైన బాధ. కానీ మీకు నియంత్రణ ఉండదు. మీరు మంచు పడటం ఆపలేరు. మీరే చూడoడి? కొన్ని ఉంటే, కొంత గాలి ఉంది, చల్లని గాలి, మీరు ఆపలేరు. దీనిని ఆధిదైవిక బాధ అని పిలుస్తారు. శరీర మరియు మనస్సు వలన బాధను ఆద్యాత్మిక భాద అంటారు. ఇతర బాధలు, ఆదిభౌతిక, ఇతర జీవులవలన దాడి, నా శత్రువు, కొన్ని జంతువులు లేదా కొన్ని పురుగులు, చాలా భాధలు. ఈ మూడు రకాల బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి. ఎల్లప్పుడూ. కానీ మనకు ఈ బాధలు ఉండటము ఇష్టము లేదు. ఈ ప్రశ్న వచ్చినప్పుడు .
ఇప్పుడు ఇక్కడ అర్జునుడు చైతన్యము కలిగి ఉన్నాడు ఒక పోరాటం ఉంది, శత్రువుతో పోరాడటము నా విధి, కానీ వారు నా బంధువులు కారణంగా నేను బాధలు అనుభవిస్తున్నాను. ఆయన ఆ విధముగా భావిస్తున్నాడు మానవుడు తాను ఎల్లప్పుడూ కష్టాలు ఎదుర్కొంటున్నాడనే వాస్తవానికి మేల్కొని మనకు ఈ బాధలు అన్ని వద్దు అని కోరుకుంటే తప్ప ... ఈ ప్రశ్న ... అతడు ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వెళ్ళవల్సిన అవసరం ఉంది. మీరు చూడoడి? ఆయన జంతువు వలె ఉన్నంత వరకు , ఆయన ఎల్లప్పుడూ బాధలలో ఉన్నాడని అతనికి తెలియదు ... ఆయనకు తెలియదు, ఆయన పట్టించుకోడు, లేదా ఆయన ఒక పరిష్కారం కనుగోనాలని అనుకోడు. ఇక్కడ అర్జునుడు బాధపడుతు ఉన్నాడు, ఆయన ఒక పరిష్కారం కనుగోనాలని, అందువలన ఆయన ఒక ఆధ్యాత్మిక గురువును అంగీకరిoచాడు. మన బాధలు మనకు తెలుసుగనుక, మనము భాధ పడుతున్న పరిస్థితుల నుండి మేల్కొను చున్నాము... బాధ ఉంది. బాధలను మరచిపోవడమనే దానికి అర్ధము లేదు. దుఖము వున్నది కానీ తన బాధలను పరిష్కర0చుకోవాలి అని సీరియస్గా తీసుకున్నప్పుడు, అప్పుడు ఆధ్యాత్మిక గురువు అవసరము. అర్జునుడుకి ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక గురువు కావాలి. ఇది స్పష్టంగా ఉన్నదా? అవును. ఆ బాధ ఉంది. దీనికి ఏ విద్య అవసరం లేదు, కేవలం ఆలోచిస్తూ వుంటే, కొద్దిగా ఆలోచన, నేను ఈ బాధలు అన్ని కోరుకోలేదు, కానీ నేను బాధపడుతున్నాను ఎందుకు? ఏదైనా పరిష్కారం ఉందా? అక్కడ ఉన్నదా? కానీ పరిష్కారం ఉంది. ఈ గ్రంథాలన్నీ, ఈ వేదముల జ్ఞానం, ప్రతిదీ ... వేదముల జ్ఞానం మాత్రమే కాదు ... ఇప్పుడు ... , ఎందుకు మీరు పాఠశాలకు వెళ్తున్నారు? ఎందుకు మీరు కళాశాలకు వెళ్తున్నారు? మీరు శాస్త్రీయ విద్యను ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ఎందుకు లా చదువుతున్నారు? మాన బాధలను ముగించడానికి అంతా ఉద్దేశించబడింది. బాధలు ఏమీ లేనట్లయితే, అప్పుడు ఎవ్వరూ విద్యను తీసుకోరు. మీరే చూడoడి? కానీ "నేను చదువుకున్నట్లయితే, నేను వైద్యుడు అయితే లేదా నేను ఒక న్యాయవాది అయితే లేదా నేను ఇంజనీర్ అయినట్లయితే, నేను సంతోషంగా ఉంటాను" అని ఆయన అనుకుంటాడు. ఆనందము. ఇది అంతిమ లక్ష్యం. నేను మంచి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం పొందుతాను. నేను సంతోషంగా ఉంటాను.
నేను చెప్పుతున్నది ఏమిటంటే ఆనందం చేస్తున్న ప్రతి పనికి ముగింపు, ... కానీ బాధలను తగ్గించుకోవటము, అవి తాత్కాలికమైనవి. వాస్తవమైన బాధ, వాస్తవమైన బాధ ఈ భౌతిక ఉనికి వలన, ఈ మూడు రకాల బాధలు. తన బాధ గురించి తాను తెలుసుకొని, తన బాధలకు ఒక పరిష్కారం కనుగొనాలని అనుకుంటే, అప్పుడు ఒక ఆధ్యాత్మిక గురువు అవసరం ఉంది. ఇప్పుడు, మీరు మీ బాధలకు పరిష్కారం కనుగొనాలనుకుంటే మీరు ఒక వ్యక్తిని సంప్రదించాలనుకుంటే, ఇప్పుడు మీరు ఎ వ్యక్తిని కలిస్తే, ఎవరైతే మీ అన్ని బాధలను ముగించగలరో? ఆ ఎంపిక ఇక్కడ ఉండాలి. మీరు ఆభరణాలను, వజ్రాలను, చాలా విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే మీరు ఒక కిరాణా దుకాణానికి వెళ్లినట్లయితే ... అలాంటి అజ్ఞానం వలన - మీరు మోసం చేయాబడాలి. మీరు మోసం చేయాబడాలి. కనీసం మీరు ఒక నగల దుకాణానికి చేరుకోవాలి. నగల దుకాణం, మీరు చూడండి? మీరు కనీసము ఆ జ్ఞానం కలిగి ఉండాలి.