TE/Prabhupada 0167 - భగవంతుడు చేసిన చట్టాలలో లోపము ఉండదు



Lecture on SB 6.1.8-13 -- New York, July 24, 1971

మనిషి తయారు చేసిన చట్టం, వారు చంపిన వ్యక్తిని పరిగణనలోకి తీసుకుoటున్నారు. మరొకరిని చంపిన వాడు, చంపబడాలి. ఎందుకు జంతువు కాదు? జంతువు కుడా ఒక జీవి. మనిషి కుడా జీవి. ఒకవేళ ఒక వ్యక్తి ఒక మనిషిని చంపినట్లయితే అతడు చంపబడాలి అనే చట్టము ఉంటే, ఒక మనిషి ఒక జంతువును చంపినట్లయితే అయిన కూడా చంపబడాలి అని ఎందుకు ఉండకుడదు? కారణం ఏంటి? ఇది మానవులు చేసిన చట్టము, లోపములు కలిగినది. కానీ దేవుడు చేసిన చట్టాలలో లోపం ఉండదు. దేవుడు చేసిన చట్టానికి, మీరు ఒక జంతువును చంపినట్లయితే, మీరు ఒక వ్యక్తిని చంపిన విధముగా సమానముగా శిక్షార్హులు. అది దేవుడు నియమం. క్షమించడము లేదు. మీరు ఒక మనిషి చంపినప్పుడు మీరు శిక్షింపబడతారు, కానీ మీరు ఒక జంతువును చంపినప్పుడు మీరు శిక్షించబడరు. ఇది కల్పన. ఇది పరిపూర్ణ చట్టం కాదు. పరిపూర్ణ చట్టం. అందువలన జీసస్ క్రైస్ట్ తన పది ఆజ్ఞలలో సూచిస్తారు: "నీవు చంపకూడదు." అది ఖచ్చితమైన చట్టం. నేను మనుష్యులను చంపను, నేను జంతువులను చంపుతాను అని తేడా చుపెట్టకుడదు

అందువలన వివిధ ప్రాయశ్చిత్తములు ఉన్నాయి. వేద చట్టం ప్రకారం, ఒక ఆవు మెడ మీద తాడుచే కట్టి వేయబడినప్పుడు చనిపోయినట్లయితే ... ఆవు సురక్షితం కానందున, ఏదో ఒకవిధంగా అది చనిపోతుంది, తాడు మెడ చుట్టూ ఉన్నందున, ఆవు యజమాని కొoత ప్రాయశ్చిత్తం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆవు తాడుతో కట్టి వేయబడటము వలన ఆవు చనిపోయినట్లు భావించాల్సి ఉంటుంది. ప్రాయశ్చిత్తము ఉంది. ఇప్పుడు మీరు ఆవులను చాలా జంతువులను ఇష్టపూర్వకంగా చంపుతుంటే ఉంటే, మనకు ఎంత బాధ్యత ఉన్నది? అందువలన ప్రస్తుత క్షణం యుద్ధం ఉంది, మానవ సమాజం సామూహికముగా మారణకాండలో చంపబడుతుంది - ప్రకృతి యొక్క చట్టం. జంతువులను చంపుతు వెళ్ళుతుఉంటే మీరు యుద్ధాన్ని నిలిపివేయలేరు . అది సాధ్యం కాదు. చంపడము వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఒక్క సారిగా మొత్తని చంపడం. కృష్ణుడు చంపినప్పుడు, అయిన ఒక్క సారిగా మొత్తని చంపుతాడు. నేను చంపినప్పుడు - ఒకరి తరువాత ఒకరిని. కానీ కృష్ణుడు చంపినప్పుడు, అయిన చంపిన వారు అందరిని ఒక చోటుకు తీసుకు వచ్చి చంపేస్తాడు. అందువలన శాస్త్రములలో ప్రాయశ్చిత్తం ఉంది. మీ బైబిల్లో కూడా, ప్రాయశ్చిత్తము, ఒప్పుకోవటము, కొంత జరిమానా చెల్లించటం వoటివి ఉన్నాయి. కానీ ప్రాయశ్చిత్తం చేసిన తరువాత, ప్రజలు ఎందుకు అదే పాపం చేస్తారు? దానిని అర్థం చేసుకోవాలి.