TE/Prabhupada 0218 - గురువు యొక్క కర్తవ్యము కళ్ళను తెరిపించడము
Lecture on SB 6.1.55 -- London, August 13, 1975
కాబట్టి మనం జీవులము, మనము కృష్ణుడిలో భాగము. ఉదాహరణకు చిన్న కణములు మరియు అగ్ని వలె, మన పరిస్థితి ఆ విధముగానే ఉంది. లేదా సూర్యుడు మరియు మెరుస్తున్న చిన్న కణాలు కలవడము వలన సూర్యరశ్మి అవుతుంది. మనము రోజువారీ చూసే సూర్యరశ్మి, ఇది ఒక మిశ్రమం కాదు. అణువులు, చాలా చిన్న, మెరుస్తున్న కణములు ఉన్నాయి మనము ఆలా ఉన్నాము, చాలా చిన్న.... అణువులు, పదార్థ పరమాణువులు ఉన్నట్లు- ఎవ్వరూ లెక్కించలేరు - అదేవిధముగా, మనము భగవంతుని యొక్క అణు కణాలము. ఎంతమంది మనము ఉన్నామో, ఏ లెక్కింపు లేదు. అసంఖ్య. అసంఖ్య అంటే మనము లెక్కించలేము. చాలా మంది జీవులు. కాబట్టి మనము చాలా చిన్న కణములు, ఈ భౌతిక ప్రపంచంలోకి మనము ఇక్కడకు వచ్చాము. ఉదాహరణకు ప్రత్యేకంగా ఐరోపావాసుల వలె, వారు వలసరాజ్యాల కోసం ఇతర దేశాలకు వెళతారు, భౌతిక వనరులను వారి ఇంద్రియ తృప్తి కొరకు ఉపయోగించుటకు. అమెరికా కనుగొనబడింది, యూరోపియన్లు అక్కడ వెళ్ళారు. ఆలోచన ఏమిటంటే అక్కడకు వెళ్ళి... ఇప్పుడు వారు చంద్రుడి లోకము వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అక్కడ ఏమైనా సౌలభ్యం ఉంటే కనుగొనేందుకు ఇది బద్ధ జీవి యొక్క ధోరణి. కాబట్టి వారు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చారు. Kṛṣṇa bhuliya jīva bhoga vāñchā kare. అంటే పురుషుడు భోక్త.
భోక్త. కృష్ణుడు వాస్తవానికి భోక్త. Bhoktāraṁ yajña-tapasām ( BG 5.29) కాబట్టి మనము కృష్ణుడిని అనుకరిస్తున్నాము. ఇది మన పరిస్థితి. అందరూ కృష్ణుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. మాయావాదులు, వారు తపస్సు చేసినప్పటికీ, తపస్సులు - చాలా పరిపూర్ణంగా వారు ఆధ్యాత్మిక జీవితం యొక్క సూత్రాలను అనుసరిస్తారు - కానీ వారు మాయ కింద ఉన్నారు, చివరికి వారు ఆలోచిస్తున్నారు "నేను భగవంతుడు, పురుష," అదే వ్యాధి, పురుష. పురుష అంటే భోక్త. అది "నేను కృష్ణుడను..." Bhoktāraṁ yajña...... తపస్సు ద్వారా చాలా ఉన్నత స్థానమునకు వెళ్ళినా కూడా, నియమావళి సూత్రములను పాటించిన తరువాత, మాయ బలంగా ఉంది, ఇప్పటికీ ఆయన ఈ అభిప్రాయంలో ఉన్నాడు, "నేను పురుషుడను" అని. సాధారణ పురుష మాత్రమే కాదు, కానీ భగవంతునిగా కృష్ణుడిగా, భగవద్గీతలో వర్ణించినట్లుగా. Paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān, puruṣam śāśvata: ( BG 10.12) "నీవు పురుషుడవు." కావున మాయ చాలా బలంగా ఉంది, చాలా జీవులను తన్నినది జన్మ జన్మలకి, అయినప్పటికీ ఆయన ఆలోచిస్తున్నాడు, "నేను పురుషుడను, నేను ఆనందంగా ఉన్నాను." ఇది వ్యాధి.
అందువల్ల ఇక్కడ చెప్పబడినది eṣa prakṛti-saṅgena puruṣasya viparyayaḥ ( SB 6.1.55 ) . ఈ భావన నుండి ఆయన భౌతిక జీవితము మొదలైంది, "నేను పురుషుడను, నేను ఆనందిస్తాను." ఆయన "నేను ఆనందించే వాడిని," అనే ఈ ఆలోచనను వదలలేక పోవటము వలన జన్మ జన్మలకి ఆయన విపర్యాయః, వ్యతిరేక పరిస్థితి. వ్యతిరేక పరిస్థితి అంటే... ఎందుకంటే జీవి భగవంతుడు యొక్క భాగం మరియు అంశ భగవంతుడు సత్ చిత్ ఆనంద విగ్రహ (Bs 5.1) కాబట్టి మనము కూడా సత్ చిత్ ఆనంద విగ్రహ, ఒక చిన్న సత్ చిత్ ఆనంద విగ్రహ, కానీ మన పరిస్థితి ప్రకృతి, పురుషుడు కాదు. ఇద్దరు... ఉదాహరణకు రాధా కృష్ణుల లాగానే, వారు ఒకే లక్షణముతో ఉన్నారు. Rādhā-kṛṣṇa-praṇaya-vikṛtir hlādinī-śaktir asmāt. వారు ఒకరే, కానీ అయినప్పటికీ, రాధ ప్రకృతి, కృష్ణుడు పురుషుడు. అదేవిధముగా, మనము కృష్ణుడి అంశ అయినప్పటికీ, మనము ప్రకృతి, మరియు కృష్ణుడు పురుషుడు. కావున తప్పుగా, పురుషుడుగా అవ్వాలని మనము అనుకుంటాము, దీనిని మాయ లేదా విపర్యాయః అని అంటారు. ఇక్కడ చెప్పబడింది. Evaṁ prakṛti-saṅgena puruṣasya viparyayaḥ. విపర్యాయః అంటే ఆయన నిజానికి ఆయన పురుషునిచే ఆనందించబడడానికి అని అర్థం. పురుష మరియు ప్రకృతి, పురుషుడు మరియు స్త్రీలు ఆనందిస్తే వారు ఆనందిస్తారు, వారు అదే ఆనందం పొందుతారు, కానీ ఒకరు పురుషుడు; ఒకరు ప్రకృతి. అదేవిధముగా, కృష్ణుడు పురుషుడు, మనము ప్రకృతిగా ఉంటాము. కృష్ణుడితో మనము ఆనందించినట్లయితే, అప్పుడు అనంద, సత్ చిత్-ఆనంద అక్కడ ఉంటుంది దానిని మనము మర్చిపోయాము. మనము పురుషుడిగా ఉండాలనుకుంటున్నాము. కాబట్టి ఏదో ఒక విధముగా, ఈ పరిస్థితి ఉనికిలోకి వచ్చింది, పురుషునిగా అవడానికి, ఆనందించే వానిగా అవ్వడానికి అసత్యపు భావన అప్పుడు ఫలితం ఏమిటి? ఫలితము మనము జన్మ జన్మలకి ఆనందించే వానిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాము, కానీ మనము ఆనందించబడుతున్నాము; మనము ఆస్వాదించే వారిమి కాదు. మనము కేవలం ఆనందించే వారిగా మారడానికి కష్టపడుతూ ఉన్నాము. ఇది మన పరిస్థితి.
మీరు ఈ పోరాటాన్ని ఎలా ఆపుతారు మరియు మీ వాస్తవ స్థానానికి ఎలా వస్తారు? ఇక్కడ చెప్పబడింది. Sa eva na cirād īśa-saṅgād vilīyate ( SB 6.1.55 ). జీవితము యొక్క ఈ అసత్యపు భావన, "నేను పురుషుడను," దీనిని పూర్తిగా జయించ వచ్చు ఎలా ? Īśa-saṅga, భగవంతునితో సాంగత్యము వలన, ఈశ. ఈశ అంటే మహోన్నతమైన నియంత్రికుడు. Īśa-saṅga. కాబట్టి ఈశ ఎక్కడ ఉంది? నేను ఈశ చూడలేను. నేను చూడలేను... కృష్ణుడు ఈశ అయినప్పటికీ, మహోన్నతమైన, కానీ నేను ఆయనని చూడలేను. " ఇప్పుడు, కృష్ణుడు అక్కడ ఉన్నాడు. మీరు గుడ్డి వారు. ఎందుకు మీరు ఆయనని చూడరు? కాబట్టి మీరు చూడలేరు. మీరు మీ కళ్ళు తెరవ వలసి ఉన్నది, మూసుకోవడము కాదు. ఇది గురువు యొక్క కర్తవ్యము. గురువు కళ్ళను తెరుస్తారు.
- ajñāna-timirāndhasya
- jñānāñjana-śalākayā
- cakṣur unmīlitaṁ yena
- tasmai śrī-gurave namaḥ
- (Gautamīya Tantra)
కాబట్టి ఎలా కృష్ణుడు కళ్ళను తెరిపిస్తారు? jñānāñjana-śalākayā ద్వారా. ఉదాహరణకు చీకటిలో మనం దేనిని చూడలేము. కానీ అగ్గిపుల్లలు లేదా కొవ్వొత్తి ఉంటే, కొవ్వొత్తిని వెలిగించి ఉంటే, మనము చూడవచ్చు. అదేవిధముగా, గురువు యొక్క కర్తవ్యము కళ్ళను తెరిపించడము కళ్ళను తెరిపించడము అంటే అతనికి జ్ఞానం ఇవ్వడం అంటే "మీరు పురుషుడు కాదు, మీరు ప్రకృతి, మీ అభిప్రాయమును మార్చుకోండి" ఇది కృష్ణ చైతన్యము