TE/Prabhupada 0309 - ఆధ్యాత్మిక గురువు శాశ్వతమైనవారు

Revision as of 19:07, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 2, 1968


మధుద్విస: ఒక క్రైస్తవుడు ఏ విధముగానైన, ఒక ఆధ్యాత్మిక గురువు సహాయం లేకుండా, యేసుక్రీస్తు మాటలను నమ్మి, అయిన బోధనలను అనుసరిoచటానికి ప్రయత్నిస్తూ ఆధ్యాత్మిక ఆకాశాన్ని చేరుకోవచ్చా?

ప్రభుపాద: నాకు అర్ధముకాలేదు.

తమాల కృష్ణ : ఈ యుగములో ఒక క్రైస్తవుడు, ఒక ఆధ్యాత్మిక గురువు లేకుండా, కానీ బైబిల్ చదవడం, యేసు యొక్క ఉపదేశముల అనుసరించాడము ద్వారా, చేరుకోవడానికి ...

ప్రభుపాద: మీరు బైబిలు చదివినప్పుడు, మీరు ఆధ్యాత్మిక గురువుని అనుసరిస్తారు. అనుసరించాడము లేదని మీరు ఎలా చెప్పగలరు? మీరు బైబిలు చదివిన వెంటనే, మీరు ప్రభువు జీసస్ క్రైస్ట్ ఉపదేశమును అనుసరిస్తున్నారని అర్థం, అనగా మీరు ఆధ్యాత్మిక గురువుని అనుసరిస్తున్నారు. ఆధ్యాత్మిక గురువు లేకుండా ఉండే అవకాశం ఎక్కడ ఉంది?

మధుద్విస: నేను జీవించి ఉన్నా ఆధ్యాత్మిక గురువు గురించి అడుగుతున్నాను.

ప్రభుపాద: ఆధ్యాత్మిక గురువు ప్రశ్న కాదు ... ఆధ్యాత్మిక గురువు శాశ్వతమైనవారు. ఆధ్యాత్మిక గురువు శాశ్వతమైనవారు. మీ ప్రశ్న ఆధ్యాత్మిక గురువు లేకుండా ఆధ్యాత్మిక గురువు లేకుండా మీరు జీవితములో ఏ దశలోనూ ఉండకూడదు. మీరు ఈ ఆధ్యాత్మిక గురువు లేదా ఆ ఆధ్యాత్మిక గురువుని అంగీకరించవచ్చు. ఇది వేరే విషయము. కానీ మీరు అంగీకరించాలి. మీరు "బైబిలు చదవడoద్వారా" బైబిలు చదివినప్పుడు మీరు ఆధ్యాత్మిక గురువుని అనుసరిస్తున్నారని అర్ధము ప్రభువు జీసస్ క్రైస్ట్ ను అనుసరిస్తూన్న కొంతమంది ఆచార్యులు, మతాచార్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ విధముగానైన, మీరు ఒక ఆధ్యాత్మిక గురువును అనుసరించ వలసి ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు లేకుండా అనే ప్రశ్న ఉండదు. ఇది స్పష్టాంగా వుందా?

మధుద్విస: భగవద్గీత ఉపదేశములను మీ సహాయం లేకుండా, మీ వివరణ లేకుండా మేము అర్థం చేసుకోలేకపోతున్నాము.

ప్రభుపాద: అదేవిధంగా, మీరు చర్చిలో పూజారి సహాయంతో బైబిలును అర్థం చేసుకోవాలి.

మధుద్విస: అవును. కానీ అయిన తన గురువు శిష్య పరంపర ద్వార లేదా అయిన బిషప్ నుండి మంచి వివరణను పొందుతున్నాడా? ఎందుకంటే బైబిల్ యొక్క వివరణలో ఏదో వ్యత్యాసం ఉన్నట్లుంది. అనేక క్రైస్తవ వర్గాలు వివిధ రకములుగా బైబిల్ ను అనువదిస్తున్నరు.

ప్రభుపాద: అయి ఉండవచ్చు, బైబిల్ మీద ఎలాంటి వ్యాఖ్యానము ఉండకూడదు. అప్పుడు బైబిల్ ను వారు ప్రామాణికముగా తీసుకోలేదు. మీరు ఏదైన వివరణ ఇస్తే ... ఉదాహరణకు "ఒక చేతి పారను, చేతిపార అంటారు. మీరు వేరే దానితో పిలిస్తే, అది వేరొక విషయము. అయిన ఆధ్యాత్మిక గురువు కాదు. ఇ గడియారము వలె. ప్రతి ఒక్కరూ దీనిని గడియారము అంటారు, నేను దానిని కళ్ళజోడు అని పిలిస్తే, నేను ఆధ్యాత్మిక గురువు అనే దాని యొక్క విలువ ఏమిటి? నేను తప్పుదారి పట్టిస్తున్నాను. ఇది గడియారము. నేను చెప్పవలెను (నవ్వు) ఉంది ... తప్పుడు వివరణ ఉన్నప్పుడు, అయిన ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు కాదు. అయిన ఆధ్యాత్మిక గురువు కాదు, ప్రామాణికము అని దేనిని అంటారు. ఈ గడియారముని ఎలా చూడాలనే విషయాన్ని మీకు నేర్పించాలనుకుంటే నేను చెప్పగలను దీనిని గడియారము అని పిలుస్తారు దీనిని చేయి అని పిలుస్తారు ఇది సమయ సూచికగా పిలువబడుతుంది; ఇది, ఇది అని పిలుస్తారు ... బాగుంది. నేను చెప్పినట్టే "ప్రతిఒక్కరూ అది గడియారము అని చెపుతారు, అది కళ్ళజోడు అని నేను చెప్తాను" నేను ఏ విధమైన ఆధ్యాత్మిక గురువుని? వెంటనే అయినని తిరస్కరించండి. ఆ బుద్ధిని మీరు కలిగి ఉండాలి, ఎవరు ఒక నకిలీ ఆధ్యాత్మిక గురువు లేదా వాస్తవమైన ఆధ్యాత్మిక గురువు. లేకపోతే మీరు మోస పోతారు. అది జరుగుతోంది. ప్రతి ఒక్కరు తనకి తోచినట్లు వ్యాఖ్యానము చేస్తున్నారు. భగవద్గీత, వేలాది ఎడిషన్లు ఉన్నాయి, వారు తమకు తోచినట్లు, అర్ధంలేని విధముగా వ్యాఖ్యానము చేయడానికి ప్రయత్నించారు. వాటిని అన్నిటిని దూరంగా విసిరి వేయాలి. ఉదాహరణకు మీరు భగవద్గీతను చదివవల్సిన అవసరం ఉంది. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వ్యాఖ్యానాము అనే ప్రశ్నే లేదు. అప్పుడు ప్రామాణికం అనేది పోతుoది. మీరు వ్యాఖ్యానాము చేసిన వెంటనే, ఎటువంటి ప్రామాణికం లేదు. న్యాయ శాస్త్ర పుస్తకము. మీరు చెప్పుతున్నది న్యాయస్థానములో న్యాయమూర్తి ముందు చెప్పినట్లయితే, , మై డియర్ లార్డ్, నేను ఈ విధంగా ఈ భాగాన్ని అర్థం చేసుకుంటాను, అది అంగీకరించబడుతుందా? న్యాయమూర్తి వెంటనే చెప్పుతాడు, "మీరు ఎవరు అర్థం చెప్పటానికి? మీకు హక్కు లేదు." ఈ న్యాయ శాస్త్ర పుస్తకము యొక్క ప్రామాణికం ఏమిటి, అప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి "నేను ఈ విధంగా వివరించాను"? వివరణ, అవసరమైనప్పుడు? ఒక విషయము అర్థం కాన్నాప్పుడు. నేను చెప్పినట్టే, "ఇది గడియారము" ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు "ఇది గడియారము, అవును," అప్పుడు ఇది కళ్ళజోడు అని అర్థం చేసుకునే అవకాశం ఎక్కడ ఉంది? ఎవరైనా స్పష్టమైన గద్యాన్ని అర్థం చేసుకుంటే ... ఉదాహరణకు బైబిల్లో ఉన్నట్లుగా, దేవుడు అన్నాడు 'సృష్టి ఉండవలెను అని" సృష్టి ఉన్నాది'. వివరణ అవసరము ఎక్కడ ఉంది? అవును, దేవుడు సృష్టించాడు. మీరు సృష్టించలేరు. వ్యాఖ్యానానికి అవకాశం ఎక్కడ ఉంది? అనవసరమైన వివరణ అవసరం లేదు ఆది ప్రామాణికము కాదు, అనవసరంగా వివరించే వారు, వారిని వెంటనే తిరస్కరించాలి. వెంటనే, ఏ ఆలోచన లేకుండా. దేవుడు , "సృష్టి ఉండవలెను అని" అన్నాడు. కావున సృష్టి ఉంది. సరళమైన విషయము. వ్యాఖ్యానము చేయవలసిన ప్రశ్న ఎక్కడ ఉంది? ఇక్కడ వ్యాఖ్యానము చేయవలసినది ఏమి ఉన్నాది? ఇది అర్థం కావచ్చు ఆని సూచించండి. నేను సరిగ్గా చెప్పానా? బైబిల్ ప్రారంభంలో ఇలా చెప్పబడింది? దేవుడు, 'సృష్టిని ఉండవలెను' అని అన్నాడు, కావున సృష్టి జరిగింది. మీ వ్యాఖ్యానం ఏమిటి? మీ వ్యాఖ్యానం ఏమిటో నాకు చెప్పoడి. వ్యాఖ్యానానికి ఎలాంటి అవకాశమైనా ఉందా? మీలో ఎవరైనా సూచించగలరా? అప్పుడు వ్యాఖ్యానం యొక్క అవకాశం ఎక్కడ ఉంది? ఒకరు వివరించవచ్చు. ఇది భిన్నమైన విషయము, కానీ దేవుడు సృష్టించాడు అనేది వాస్తవం, అది ఉంటుంది. దానిని మీరు మార్చలేరు. ఇప్పుడు, ఆ నిర్మించే పద్ధతి ఎలా జరిగింది, అది భాగావతం లో వివరించబడింది: అన్నిoటిలో మొదట, ఆకాశము ఉంది, తరువాత ధ్వని ఉంది, తరువాత అది ఉంది, ఇది ఉంది. ఇది సృష్టి యొక్క నిర్మాణా పద్ధతి, అది మరొక విషయము. కానీ వాస్తవానికి, దేవుడు సృష్టించాడు అనేది ప్రాధమిక వాస్తవం, అది ఏ పరిస్థితులలో నైనా అలాగే ఉంటుంది. మూర్ఖపు శాస్త్రవేత్త చెప్పుతాడు, ", ఒక ముక్క ఉంది ఇది విభజించబడింది, ఈ గ్రహాల ఉన్నాయి. బహుశా ఇది బహుశా ఆది , ఇవ్వి అన్ని అర్ధంలేనివి. వారు కేవలము "బహుశా," అవ్వచ్చు "అని అర్ధము చేసుకుంటారు." ఇది శాస్త్రము కాదు - "అవ్వచ్చు," "బహుశా." ఎందుకు బహుశా? ఇక్కడ స్పష్టమైన ప్రకటన, ఉంది "దేవుడు సృష్టించాడు." అంతే. అయిపోయింది