TE/Prabhupada 0376 - భజాహురేమన భాష్యము
Purport to Bhajahu Re Mana -- Los Angeles, January 7, 1969
Bhajahū re mana, śrī-nanda-nandana-abhaya-caraṇāravinda re. ఇది ఒక గొప్ప వైష్ణవ కవి గోవింద దాస రచించిన పాట. భగవద్గీతలో ఇది చెప్పబడింది, మీరు మీ మనసును నియంత్రిస్తే మీ మనస్సు నీకు ఉత్తమ మిత్రుడు స్నేహితుడు. కానీ నీ మనస్సు నియంత్రించబడకపోతే మీ మనస్సే మీ గొప్ప శత్రువు. అందువలన మనం స్నేహితుడు లేదా శత్రువు అని వెనుక వెతుకుతున్నాం, వారు ఇద్దరు నాతోనే కూర్చుని వున్నాయిరు. మనం మన మనస్సు యొక్క స్నేహాన్ని ఉపయోగించుకోగలిగితే అత్యధిక పరిపూర్ణ దశకు చేరుకుంటాము. కానీ మన మనస్సును శత్రువుగా మార్చుకున్నట్లయితే అప్పుడు నా నరకమునకు మార్గం స్పష్టముగా ఉంటుoది. అందువలన గోవింద దాస ఠాకూర అతను తన మనస్సుతో మాట్లాడుతున్నాడు. యోగి వివిధ వ్యాయామ పద్ధతుల ద్వారా మనస్సును నియంత్రించడానికి ప్రయత్నిస్తాడు. ఇది కూడా ఆమోదించబడింది. కానీ ఇది చాలాకాలం తీసుకుంటుంది మరియు కొన్నిసార్లు వారు విఫలమవుతారు. చాలా సందర్భాలలో వారు వైఫల్యం చెందారు. విశ్వామిత్రుడు వంటి ఒక గొప్ప యోగి కూడా వైఫల్యం చెందారు. ఈ అతిచిన్న మరియు పనికి మాలిన యోగుల గురించి ఏమి మాట్లాడుతాము.
అందువలన గోవింద దాస చెబుతున్నాడు "నీ మనస్సును కృష్ణ చైతన్యం లో నిమగ్నం చేయి." అప్పుడు మనస్సు సహజముగా నియంత్రించబడుతుంది. మీ మనస్సును కృష్ణ చైతన్యంలో మినహా మరే పనిలో నిమగ్నం అవడానికి అవకాశం లేకుండా ఉంటే, అప్పుడు నా మనస్సు నా శత్రువు కాలేదు. అది సహజంగానే నా మిత్రుడు అవుతుంది. ఇది శ్రీమద్భాగవతము ఉపదేశము sa vai manaḥ kṛṣṇa-padāravindayoḥ ( SB 9.4.18) మహారాజా అంబరీషుడు, అతను మొదట తన మనసును కృష్ణుడి యొక్క కమల పాద పద్మముల మీద నిమగ్నం చేసుకున్నాడు. అదే విధంగా ఇక్కడ కూడా గోవింద దాస కూడా అతను తన మనస్సును అడుగుతున్నాడు. నా ప్రియమైన మనసా, నీవు అభయ చరణారవింద పాద పద్మముల యందు నిమగ్నం కావాలి. ఇది కృష్ణుడి పాదపద్మముల యొక్క పేరు. అభయ అంటే నిర్భయమైనవి. మీరు కృష్ణుడి యొక్క పాద పద్మముల ఆశ్రయం తీసుకుంటే వెంటనే మీరు నిర్భయులవుతారు. అందువలన అతను నా ప్రియమైన మనస్సా గోవిందుని యొక్క పాదపద్మముల సేవలో నీవు నిమగ్నం కావాలి అని సూచించాడు. Bhajahū re mana śrī-nanda-nandana. అతను గోవిందా అని చెప్పలేదు. అతను కృష్ణుడిని నంద మహారాజు కుమారుడు అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆ పాద పద్మములు నిర్భయమైనవి. మాయ యొక్క దాడి నుండి మీకు ఏ భయమూ లేదు.
నేను చాలా విషయాలు ఆనందించాలని వచ్చాను. ఎలా నేను కృష్ణుడి పాదపద్మముల మీద నా మనసును నిలుపుకోవాలి. అప్పుడు గోవింద దాస సలహా ఇస్తున్నారు, “లేదు లేదు”. దుర్లభ మానవ జన్మ. మీరు ఆ విధంగా మీ జీవితాన్ని వృథా చేసుకోకూడదు. మానవ జీవితం చాలా అరుదుగా లభిస్తుంది. అనేక అనేక వేల లక్షల జన్మల తర్వాత మీకు ఈ అవకాశం వచ్చింది. దుర్లభ మానవ జనమ సత్సంగె. అందువలన మీరు ఎక్కడికి వెళ్లవద్దు పూర్తిగా శుద్ధభక్తుల సాంగత్యంలో ఉండాలి. తారహో యే భవ సింధూరే.. "అప్పుడు నీవు అజ్ఞానము అనే మహాసముద్రం దాటి వెళ్ళగలవు". నేను కృష్ణుడిపై ఎల్లవేళలా నా మనసును నిలబెట్టుకుంటే అప్పుడు నేను నా కుటుంబం నా ఇతర ధన సామాగ్రితో ఎలా ఆనందిస్తాను. అందుకే గోవింద దాస అన్నాడు. ei dhana yauvana. మీరు మీ సంపదను మీ యవ్వన వయస్సును అనుభవించాలని కోరుకుంటున్నారు. ei dhana yauvana, putra parijana, మీరు స్నేహం, ప్రేమ కుటుంబం యొక్క సమజం ఆనందించండి అనుకుంటున్నర, కానీ నేను చెప్తున్నాను " ithe ki āche paratīti re, అర్థంలేని భౌతిక విషయాలలో సర్వోత్కృష్టమైన ఆనందం ఉందని మీరు అనుకుంటున్నారా.. లేదు, ఏదీ లేదు. ఇది కేవలం భ్రాంతి. Ei dhana yauvana, putra parijana, ithe ki āche paratīti re. Durlabha mānava-janama sat-saṅge, taraha ei bhava sindhu re.
- śīta ātapa bāta bariṣaṇa
- ei dina jāminī jāgi 're
- viphale sevinu kṛpaṇa durajana
- capala sukha-laba lāgi' re
గోవింద దాసు తన మనస్సుకు గుర్తు చేస్తున్నాడు. మీకు మీ భౌతిక ఆనందం గురించి అనుభవం ఉంది. భౌతిక ఆనందమంటే, భౌతిక ఆనందం యొక్క చివరి లక్ష్యము మైథున జీవితము. కానీ నీకు గుర్తు లేదా, ఈ లైంగిక జీవితాన్ని ఎంత సమయం ఆనందిస్తున్నావు. చపల. మినుకు మినుకు మంటూ కొన్ని నిమిషాలు లేదా క్షణం అంతే. కానీ అందుకొరకు మీరు చాలా కష్టపడుతున్నారు. Śīta ātapa. మంచు వర్షం కురుస్తున్నా లెక్కచేయరు. కాల్చివేసే వేడిని లెక్కచేయరు. జడి వాన కురిసినా లెక్కచేయరు. రాత్రిల్లో పని చేయవలసి వచ్చినా లెక్కచేయరు. రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు దాని వలన వచ్చే ఫలితం ఏమిటి? కేవలం మినుకు మినుకుమనే ఆనంద క్షణాల కోసం, మీరు దీని గురించి సిగ్గుపడరా? ఈ రీతిగా śīta ātapa, bāta bariṣaṇa, ei dina jāminī jāgi re. దిన అంటే రోజు, జామినీ అంటే రాత్రి రాత్రింబవళ్లు మీరు చాలా కృషి చేస్తున్నారు ఎందుకు? Capala sukha-laba lāgi' re. కేవలం మినుకు మినుకుమనే ఆనందం కొరకు. అప్పుడతను చెప్తున్నాడు, ei dhana yauvana, putra parijana, ithe ki āche paratīti re. అక్కడ నిజానికి ఎటువంటి ఆనందం లేదు, శాశ్వతమైన ఆనందం, సర్వోత్కృష్టమైన ఆధ్యాత్మిక ఆనందం, ఈ జీవితంలోనే ఆనందించవచ్చు. లేదా యవ్వన వయసు లేదా కుటుంబమూ సమాజమూ, అక్కడ ఎటువంటి ఆనందమూ లేదు. సర్వోత్కృష్టమైన ఆధ్యాత్మిక ఆనందం లేదు.
అందువలన kamala-dala-jala, jīvana ṭalamala. మరియు ఎంతకాలం నీ జీవితాన్ని అనుభవించగలవో నీకు తెలియదు. కారణం ఇది నిలకడ లేకుండా ఉంటుంది మీరు నిలకడ లేకుండా ఉండే స్థితిలో ఉన్నారు. తామరాకుమీద నీటిబొట్టులా, అది కదులుతూ ఉంటుంది. ఏ సమయంలోనైనా అది పడిపోతుంది మన జీవితం కూడా అలాగే నిలకడ లేకుండా ఉంది. ఏ సమయంలోనైనా అది పడిపోతుంది, అనుకోకుండా మనము ప్రమాదంలో పడితే పూర్తవుతుంది. అందువలన ఆ విధంగా ఈ జీవితాన్ని వృధా చేయకండి. "Bhajahū hari-pada nīti re. ఎల్లప్పుడు కృష్ణ చైతన్యములో నిమగ్నమవండి ఇది మీ జీవితం యొక్క విజయము. ఎలా ఈ కృష్ణ చైతన్యంలో నెలకొనాలి. అతను సలహా ఇస్తున్నాడు śravaṇa kīrtana, smaraṇa vandana, pāda-sevana dāsya re. మీరు ఎవరైనా తొమ్మిది విధాలైన భక్తియుత సేవలలో ఏ ఒక్కటైనా స్వీకరించవచ్చు. వాటినన్నింటినీ కూడా స్వీకరించవచ్చు అది చాలా మంచి విషయం. లేకపోతే ఎనిమిదింటిని స్వీకరించవచ్చు వాటిలో ఏడింటిని అయినా, ఆరింటిని అయినా, ఐదింటిని అయినా, నాలుగింటిని అయినా స్వీకరించవచ్చును. కానీ మీరు వాటిలో ఏ ఒక్కటైనా సరే తీసుకున్నారంటే మీ జీవితం విజయవంతం అవుతుంది. ఆ తొమ్మిది పద్ధతులు ఏమిటి? శ్రవణ కీర్తనం ప్రామాణికమైన శాస్త్రాలు ప్రామాణికుల నుండి వినడము మరియు కీర్తించడం. నుండి శ్రవణ కీర్తనం. స్మరణం. గుర్తు చేసుకోవడం. వందనం, ప్రార్థన చేయడం. Śravaṇa kīrtanaṁ, smaraṇaṁ vandana, pāda-sevanam. శాశ్వత సేవకునిగా అతని పాద పద్మములను సేవించడం. పూజన సఖీ-జన లేదా మీ స్నేహితుడిగా కృష్ణుణ్ణి ప్రేమించుటకు ప్రయత్నించండి ఆత్మ నివేదన. లేదా కృష్ణుని కోసం అన్నింటినీ వదిలేయండి. అది భక్తి యుక్త సేవ యొక్క మార్గం, గోవింద దాస్ ఈ కృష్ణ చైతన్య మునకు ఆశపడుతున్నారు