TE/Prabhupada 0375 - భజాహురేమన భాష్యము భాగము రెండు



Purport to Bhajahu Re Mana -- San Francisco, March 16, 1967


జీవితం చాలా ప్రమాదకరమైనది మరియు ప్రమాదకరమైన స్థితిలో ఉంది అందువల్ల ప్రతి ఒక్కరు ఈ మానవ జన్మ యొక్క ప్రయోజనాన్ని పొందాలి. వెంటనే కృష్ణ చైతన్యంలో నియమితులము కావాలి. ప్రతి ఒక్కరూ తన మనసును అభ్యర్ధించాలి, నా ప్రియమైన మనస్సా, ప్రమాదకరమైన స్థితి లోకి నన్ను లాగవద్దు. దయచేసి నన్ను కృష్ణ చైతన్యంలో ఉంచుము. ఈ విధంగా కృష్ణచైతన్యంలో, అది ఎలా సాధించగలం, అదికూడా గోవింద దాస చేత వర్ణించబడుతుంది. అతను చెప్తున్నాడు,

śravaṇa, kīrtana, smaraṇa, vandana,
pāda-sevana, dāsya re,
pūjana, sakhī-jana, ātma-nivedana
govinda-dāsa-abhilāṣa re

అభిలాష అంటే కోరిక, ఆశ లేదా ఆశయం. అతను తొమ్మిది విభిన్న మార్గాల్లో భక్తుడు కావాలనే ఆశ తో ఉంటాడు. మొదటి విషయము శ్రవణ, శ్రవణ అంటే వినడము. ఎవరైనా ప్రామాణికులనుండి వినండి ఇది ఆధ్యాత్మిక జీవితము లేదా ఇది కృష్ణ చైతన్యం యొక్క ఆరంభము. కేవలము అర్జునుడి లా, అతను కృష్ణుడి నుండి వినడం ద్వారా తన ఆధ్యాత్మిక చైతన్యం లేదా కృష్ణ చైతన్యమును సాధించాడు. అదేవిధంగా ఎవరైనా కృష్ణుడి నుండి లేదా కృష్ణుడి ప్రతినిధి నుండి వినవలసినది. ఎవరైతే కృష్ణుడి మాటలను యథాతథంగా వివరిస్తాడో అతని నుండి వినవలెను. కారణం, ప్రస్తుతానికి నేరుగా మనకు శ్రవణం చేయడానికి అవకాశం లేదు. కృష్ణుడి నుండి నేరుగా శ్రవణం చేయడానికి ఉంది. ఏర్పాటు ఉంది అక్కడ. అందరి హృదయంలో కృష్ణుడు ఉన్నాడు ఎవరైనా అతని నుండి చాలా సులభంగా తెలుసుకోగలరు. ఎక్కడైనా సరే ప్రతిచోట కానీ అతను ఎలా వినాలి అనేది శిక్షణ కలిగి ఉండాలి. దీని కోసం కృష్ణుడి ప్రతినిధి సహాయం అవసరమవుతుంది. అందుచేత చైతన్య మహా ప్రభువు చెప్పెను ఎవరైనా భక్తియుత సేవతో ఇది సాధించవచ్చని, కృష్ణుడి యొక్క మరియు ఆధ్యాత్మిక గురువు యొక్క దయ వలన. Guru-kṛṣṇa-kṛpāya pāya bhakti-latā-bīja ( CC Madhya 19.151) ఆధ్యాత్మిక గురువు దయ వలన, గురువు మరియు కృష్ణుడి దయ ద్వారా, ఒకరు భక్తియుక్త సేవలో కృష్ణుడిని సేవించే అవకాశాన్ని సాధించగలరు. చైతన్య-చరితామృతంలో కూడ ఇది చెప్పబడింది, ఆధ్యాత్మిక గురువు కృష్ణుడి ప్రత్యక్ష రూపము. సూర్యుడు సూర్యరశ్మి ద్వారా మీ గదిలోకి ప్రవేశిస్తున్నట్లుగా కృష్ణుడు ఆధ్యాత్మిక గురువుగా భక్తుని ముందుకు వస్తాడు. సూర్యుడు మీ గది లేదా మీ నగరం లేదా మీ దేశంలోకి ప్రవేశించనప్పటికీ - అతను చాల మిలియన్ల మిలియన్ల మైళ్ల దూరంలో ఉన్నాడు- ఐనప్పటికీ, అతను తన శక్తి, సూర్యరశ్మి ద్వారా ప్రతిచోట ప్రవేశించును. అదేవిధంగా, కృష్ణుడు తన వేర్వేరు సామర్థ్యాలతో ప్రతిచోటా ప్రవేశిస్తాడు. కృష్ణుడి నుండి ఈ జ్ఞానాన్ని పొందటానికి, వారు వినవలసి ఉంది. వినడం చాలా ముఖ్యం. అందువలన గోవింద దాసు చెప్తాడు, శ్రవణ. శ్రవణ అంటే వినడము. మరియు ఎవరైతే చక్కగా విన్నారో, అతని తదుపరి దశ కీర్తనం. కేవలము కొద్దిగా చక్కగా విన్న మన అబ్బాయిల వలె, ఇప్పుడు వారు వీధులలో వెళుతూ కీర్తన చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇది సహజమైన క్రమము. మీరు వింటున్నారు అని కాదు, కానీ మీరు నిలిపివేయబడ్డారు. లేదు. తరువాతి దశ కీర్తనం . కీర్తన, జపము చేయడము ద్వార లేదా వ్రాయడం ద్వార లేదా మాట్లాడటం ద్వార లేదా ప్రచారము ద్వార, అక్కడ కీర్తనం ఉంటుంది. అలాగ శ్రవణ కీర్తనం, మొదట శ్రవణము తరువాత కీర్తనం. శ్రవణ కీర్తన. ఎవరి గురించి వినాలి కీర్తించాలి? విష్ణువు గురించి, ఏ అర్థం లేనిదో కాదు. Śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ ( SB 7.5.23) ఈ విషయాలు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి. సాధారణ ప్రజలు, వారు కూడ వినడం కీర్తించడంలో నెలకొనివున్నారు. వారు వార్తపత్రికలో ఎవరో రాజకీయవేత్తల గురించి విని, రోజు మొత్తం వారి చర్చలు జరుపుతున్నారు, జపిస్తూన్నారు. ఈ మనిషి ఎన్నికయ్యారు. ఈ వ్యక్తి ఎన్నుకోబడతాడు. వినడము, జపము చేయడము ప్రతిచోటా ఉంది. మీకు ఆధ్యాత్మిక మోక్షం కావాలంటే, మీరు విష్ణువు గురించి వినాలి, కీర్తించాలి. ఎవ్వరివీ వినకూడదు. Śravaṇa, kīrtana, smaraṇa, vandana, pāda-sevana, dāsya re. కావున కవి పాడారు Śravaṇa, kīrtana, smaraṇa, vandana, pāda-sevana, dāsya re. వివిధ పద్ధతులు ఉన్నాయి: శ్రవణము, కీర్తన, జపము చేయడము, గుర్తుచేసుకోవడం, ఆలయంలో పూజలు, సేవలలో పాల్గొనడం. అందువల్ల అతను తొమ్మిది రకాల భక్తియుక్త సేవలను కోరుకుంటున్నాడు. చివరకు, పూజన సఖీ-జన. సఖీ-జన అంటే భగవంతుని యొక్క ఆంతరంగిక భక్తులు, వారిని సంతోషపెట్టడము ఆత్మ -నివేదన. ఆత్మ అనగా తను(ఆత్మ) అని అర్థం, నివేదన అంటే శరణాగతి పొందాలి. గోవింద-దాస-అభిలాష. కవి నామము గోవింద దాస్, అతను తన కోరికలు ఇవి మాత్రమే అని వ్యక్తం చేస్తున్నారు. అతను ఈ విధంగా తన మానవ రూపం యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. ఈ పాట యొక్క మొత్తం సారాంశము