TE/Prabhupada 0392 - నారద ముని భజయ్ వీణ
Purport to Narada Muni Bajay Vina -- Los Angeles, September 22, 1972
Nāma amani, udita haya, bhakata-gītā-sāme. ఇది భక్తి వినోద్ ఠాకూర్ పాడిన పాట. ఈ పాట యొక్క ఉద్దేశం ఏమిటంటే నారదముని ఒక గొప్ప వ్యక్తి . తను వీణ వాయించేవారు. వీణ నారద ముని దగ్గర ఉండే ఒక తీగ వాయిద్యం. నారద ముని వీణ వాయిస్తూ రాధికా రమణ ధ్వనిని పాడుతున్నాడు కృష్ణుడికి మరో పేరు రాధికా-రమణ. ఎప్పుడైతే వీణని వాయించారో, అప్పుడు భక్తులందరూ ఆ శబ్దానికి స్పందించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ నామము చాలా అందమైన ధ్వని గా మారింది. Amiya dhārā variṣe ghana. వీణ వాయిస్తూ గానము చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అమృతపు జల్లులు పడుతూ ఉన్నట్లు అనిపించింది. అప్పుడు భక్తులందరూ ఆనందపారవశ్యంతో నృత్యం చేస్తూ పూర్తిస్థాయి సంతృప్తితో నృత్యం చేస్తున్నారు అప్పుడు, వారు నృత్యం చేస్తున్నప్పుడు, వారు ఈ దివ్య మధురిమ అను వర్షంలో తడిసి మత్తుగా ఉన్నాట్లు కనబడ్డారు. ఎలాగైతే త్రాగినప్పుడు వ్యక్తులు మత్తుగా ఉంటారో, అదేవిధంగా, పారవశ్యంతో, భక్తులు అందరూ మత్తుగా ఉన్నారు. వారిలో కొందరు ఏడుస్తూ ఉన్నారు, మరికొందరు నాట్యం చేస్తూ ఉన్నారు. మరియు వారిలో కొందరు, బహిరంగంగా నృత్యం చేయలేకపోయినప్పటికీ, వారి హృదయంలో వారు నృత్యం చేశారు. ఈ విధముగా పరమశివుడు నారదముని ఆలింగనం చేసుకున్నాడు . మరియు అతను పారవశ్యం లో మాట్లాడటం మొదలుపెట్టాడు. పరమశివుడు నారదునితో నృత్యము చేయుచుండగా చూసిన బ్రహ్మకూడా నృత్యంలో పాల్గొన్నాడు. అప్పుడు బ్రహ్మ చెప్పటం ప్రారంభించాడు "మీరందరూ దయచేసి హరి బోల్ హరి బోల్ అని నామ జపము" చేయ మన్నాడు. ఈ విధంగా, క్రమముగా స్వర్గం యొక్క రాజు, ఇంద్రుడు, అతను కూడ గొప్ప సంతృప్తితో చేరారు హరి బోల్ హరి బోల్ అంటూ నృత్యము చేయటము ప్రారంభించారు ఈ విధంగా, భగవంతుని పవిత్ర నామము యొక్క దివ్యమైన నామ ధ్వని ప్రభావంతో, విశ్వమంతా పారవశ్యంతో నిండి పోయినది భక్తివినోద ఠాకురా చెప్పుతున్నారు, ఎప్పుడైతే ఈ విశ్వమంతా పారవశ్యంతో నిండి పోయి ఉందో అప్పుడు నేను పూర్తిగా సంతృప్తి చెందాను. అందువలన ఇలా హరినామ సంకీర్తన చక్కగా కొనసాగవలెనని శ్రీరూపగోస్వామి వారి పాద పద్మములకు భగవద్ధాసుడగు భక్తివినోద విన్నవించు కొనుచున్నాడు హరి-నామ ఈ జపమును ఈ విధంగ చక్కగ నడిపించనివ్వండి. "