TE/Prabhupada 0391 - మానస దేహో గేహోకు భాష్యము



Purport to Manasa Deha Geha


Mānasa, deho, geho, jo kichu mor. ఇది భక్తివినోద ఠాకూర పాడిన పాట. అతను పూర్తి శరణగతి ప్రక్రియను బోధిస్తున్నాడు.

Mānasa, deho, geho, jo kichu mor. మొదట, అతను మనస్సును శరణాగతి చేస్తూన్నాడు, ఎందుకంటే మనస్సు అనేది అన్ని రకాల ఊహాకల్పనలకి మూలం, మరియు శరణగతి పొందుట, భక్తియుక్త సేవలను అందించడం అంటే మొదట మనసును నియంత్రించటం. అందువలన అతను mānasa, అర్థం "మనస్సు," తరువాత dehe: అంటే "ఇంద్రియాలు." Śarīra దేహ అంటే ఈ శరీరం; శరీరము అంటే ఇంద్రియాలు అని అర్థం కాబట్టి, కృష్ణుని యొక్క పాదపద్మములకు మనసును శరణాగతి చేసినట్లయితే, అప్పుడు సహజముగా ఇంద్రియాలు కూడ శరణాగతి పొందుతాయి. అప్పుడు, "నా ఇల్లు." దేహ, గేహో. గేహో అంటే ఇల్లు. జో కిచు మోర్. మనము కలిగి ఉన్నవి అన్ని ఈ మూడు విషయాలను కలిగి ఉన్నాయి: మనస్సు, శరీరం మరియు మా ఇల్లు. కాబట్టి భక్తి వినోద ఠాకూర ప్రతిదీ శరణాగతి చేయాలని ప్రతిపాదిస్తున్నారు.

Arpilū tuwā pade, nanda-kiśor. కృష్ణుడు నందకిశోరుడు. అందువలన “నేను నా మనస్సును నా శరీరమును నా ఇల్లును నీకు అంకితం చేస్తున్నాను.”

sampade vipade, jīvane-maraṇe: ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నా లేదా నేను దుఃఖంలో ఉన్నా, నేను జీవించి ఉన్నా లేదా నేను చనిపోయినా Dāy mama gelā, tuwā o-pada baraṇe: “ "ఇప్పుడు నాకు ఉపశమనం పొందాను.” నాకు చాలా ఉపశమనంగా ఎందుకు ఉంది అంటే నేను మీకు అంతా సమర్పించాను కాబట్టి.

Mārobi rākhobi-jo icchā tohārā: “ ఇప్పుడు ఇది మీ మీద ఆధారపడి ఉంది మీరు నన్ను కాపాడాలి అనుకున్నా లేదా నన్ను చంపాలని అనుకున్నా, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. "

Nitya-dāsa prati tuwā adhikārā: "మీకు సరైనది అని అనిపించినది ఏమైనా చేయటానికి మీకు ప్రతి హక్కు ఉంది నీ సేవకునికి సంబంధించి. నేను నీ శాశ్వత సేవకుడిని. "

Janmāobi moe icchā jadi tor: “మీరు కోరుకున్నట్లయితే “ ఎందుకంటే భక్తుడు తన ఇంటికి తిరిగి వెళతాడు, తిరిగి భగవంతుని వైపు వెళ్తాడు - అందువలన భక్తి వినోద ఠాకూర్ ప్రతిపాదించారు “ఒకవేళ నేను మళ్ళీ జన్మించాలని మీ కోరికైతే అది పట్టింపు లేదు.

hakta-gṛhe jani janma hau mor: ఇది నా అభ్యర్థన మాత్రమే, ఒకవేళ నేను మళ్ళీ జన్మించాలంటే దయచేసి ఒక భక్తుడి ఇంటిలో నా జన్మను తీసుకునే అవకాశం ఇవ్వండి. " Kīṭa-janma hau jathā tuwā dās: "నేను ఒక పురుగుగా జన్మించిన నాకు బాధలేదు కానీ నేను భక్తుడి ఇంటిలో ఉండాలి.

Bahir mukha brahma-janme nāhi āś: “ అభక్తుడిగా జీవించటము నాకు ఇష్టం లేదు “ నేను బ్రహ్మ గా జన్మించినా నేను భక్తులతో ఉండాలనుకుంటున్నాను.

Bhukti-mukti-spṛhā vihīna je bhakta: భౌతిక సంతోషం కోసం లేదా ఆధ్యాత్మిక మోక్షం కోసం శ్రద్ధ వహించని భక్తుడు నాకు కావాలి..

Labhaite tāko saṅga anurakta: "నేను కేవలము ఇటువంటి స్వచ్ఛమైన భక్తులతో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను.

Janaka jananī, dayita, tanay: “ఇప్పటినుండి మీరే నా తండ్రి , మీరే నా సోదరుడు, మీరే నా కుమార్తె, మీరే నా కుమారుడు, మీరే నా ప్రభువు, మీరే నా ఆధ్యాత్మిక గురువు, మీరే నా భర్త, సర్వస్వం మీరే.

Bhakativinoda kohe, śuno kāna: "నా ప్రభువు, కానా - కృష్ణ, మీరు రాధికా రాణి యొక్క ప్రేమికులు, కానీ మీరు నా జీవితం మరియు ఆత్మ, దయచేసి నాకు రక్షణ కల్పించండి. "