TE/Prabhupada 0464 - శాస్త్రము అనేది సోమరులకు కాదు
Lecture on SB 7.9.8 -- Mayapur, February 28, 1977
కావున mahājano yena gataḥ sa panthāḥ ( CC Madhya 17.186) మనము మహాజనులను అనుసరించినట్లయితే కృష్ణ చైతన్యమును మనము బాగా నేర్చుకోవచ్చు. మహాజన అంటే గొప్ప వ్యక్తులు. వారు భగవంతుడి యొక్క భక్తులు. వారిని మహాజనులు అని పిలుస్తారు. జన అంటే "వ్యక్తి." సాధారణ రీతిలో ఈ విధముగానే, భారతదేశంలో చాలా ధనవంతుడు అయిన వ్యక్తిని మహాజన అని పిలుస్తారు, కాబట్టి ఈ మహాజన అనగా భక్తియుక్త సేవలో ధనవంతుడు అయిన వ్యక్తి. ఆయనను మహాజన అని పిలుస్తారు. Mahājano yena gataḥ sa panthāḥ కాబట్టి మనకు అంబరీష మహారాజు ఉన్నారు. మనకు ప్రహ్లాద మహారాజు ఉన్నారు. అనేకమంది రాజులు, యుధిష్టర మహారాజు, పరీక్షిత్ మహారాజు, వారు రాజర్షులు. కాబట్టి కృష్ణ చైతన్యము, వాస్తవానికి, చాలా గొప్ప వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది.
- imaṁ vivasvate yogaṁ
- proktavān aham avyayam
- vivasvān manave prāhur
- manur ikṣvākave 'bravīt
- (BG 4.1)
వాస్తవానికి, శాస్త్రము అనేది సోమరులకు కాదు. అత్యంత జ్ఞానము కలిగిన బ్రాహ్మణులకు అత్యంత ఉన్నతమైన క్షత్రియులకు. వైశ్యులు, శూద్రులు, వారు శాస్త్రంలో బాగా పాండిత్యము కలిగి ఉండాలని ఆశించడము లేదు, కాని, సరైన బ్రాహ్మణుల మరియు క్షత్రియుల మార్గనిర్దేశకత్వములో, వారు కూడా పరిపూర్ణమవ్వుతారు. మొట్టమొదటి సంపూర్ణ తరగతి, మునయో, ఇలా చెప్పబడింది, sattvaikatāna gatayo munayo (SB 7.9.8), గొప్ప ఋషులు. సాధారణముగా, "గొప్ప ఋషులు" అనగా బ్రాహ్మణులు,వైష్ణవులు. వారు భక్తియుక్త సేవ ద్వారా సత్వ-గుణములో ఉన్నారు. రజో, తమో-గుణాలు వారిని తాకలేవు. Naṣṭa-prāyeṣv abhadreṣu nityaṁ bhāgavata-sevayā ( SB 1.2.18) భద్ర మరియు అభద్ర, మంచి మరియు చెడు. కాబట్టి రజో గుణము, తమో - గుణము చెడ్డది, సత్వ గుణము మంచిది. మనము ఉన్నట్లయితే, చెప్పినట్లుగా, sattvaikatāna-gatayo... మీరు ఎల్లప్పుడూ సత్వ గుణములో ఉన్నట్లయితే, అప్పుడు ప్రతిదీ చేయవలసినది స్పష్టముగా ఉంటుంది. సత్వ గుణము అంటే ప్రకాశం. అంతా స్పష్టంగా, పూర్తి జ్ఞానం. రజో గుణము స్పష్టంగా ఉండదు. ఉదాహరణ ఇచ్చినారు: చెక్క వలె . అగ్ని ఉంది, కాని అగ్ని యొక్క మొదటి లక్షణం, చెక్క, మీరు పొగను చూస్తారు. మీరు చెక్కకు నిప్పు పెడితే , మొట్టమొదట పొగ వస్తుంది. కావున పొగ ... మొదట చెక్క , తరువాత పొగ, తరువాత అగ్ని. అగ్ని నుండి, మీరు అగ్నిని అగ్నిహోత్రము కోసము ఉపయోగిస్తే , అది ఉత్తమము. ప్రతిదీ ఒకే మూలం నుండి వస్తుంది. భూమి నుండి, చెక్క వస్తుంది, చెక్క నుండి పొగ వస్తోంది, పొగ నుండి అగ్ని వస్తుంది. అగ్ని,అగ్నిహోత్రములో వినియోగించినప్పుడు , Svāhā - అది అగ్ని యొక్క సరైన ఉపయోగము. వ్యక్తులు చెక్క స్థాయిలో ఉంటే, అది పూర్తిగా మరచిపోవడము. ఎవరైనా పొగ స్థాయిలో ఉన్నప్పుడు, కొద్దిగా కాంతి ఉంటుంది. వారు అగ్ని స్థాయిలో ఉండినప్పుడు, అప్పుడు పూర్తి కాంతి ఉంటుంది. కృష్ణుడి సేవలో కాంతి వినియోగించినప్పుడు, అది పరిపూర్ణము. మనము అలా అర్థం చేసుకోవాలి