TE/Prabhupada 0465 - వైష్ణవుడు శక్తివంతమైనవారు, అయినప్పటికీ ఆయన చాలా సాత్వికంగా వినయంతో ఉంటాడు



Lecture on SB 7.9.8 -- Mayapur, February 28, 1977


కాబట్టి ప్రహ్లాద మహారాజు వైష్ణవుడు. వైష్ణవ అర్హతలు ఇవి,

tṛṇād api sunīcena
taror api sahiṣṇunā
amāninā mānadena
kīrtanīyaḥ sadā hariḥ
(CC Adi 17.31)

వైష్ణవుడు ఎల్లప్పుడూ వినయంతో ఉంటాడు - సాత్వికత వినయము గలవారు. అది వైష్ణవుడు. వైష్ణవుడు శక్తివంతమైనవారు, అయినప్పటికీ ఆయన చాలా సాత్వికంగా వినయంతో ఉంటాడు. ఇక్కడ లక్షణం ఉంది. ప్రహ్లాద మహారాజ ఎంతో అర్హుడు, వెంటనే భగవంతుడు నరసింహ-దేవ తన తలపై చేతిని ఉంచెను: నా ప్రియమైన బాలకా, నీవు చాలా బాధపడ్డావు. ఇప్పుడు శాంతిని పొందుము. ఇది ప్రహ్లద మహారాజ యొక్క స్థితి - వెంటనే భగవంతుడిచే అంగీకరింపబడ్డారు. కాని ఆయన ఇలా ఆలోచిస్తున్నారు, "నేను చాలా హీన కుటుంబంలో జన్మించాను, ఉద్రేకంగల కుటుంబంలో ఉన్నాను ," ugra-jāteḥ. ఇప్పుడు నరసింహ-దేవ తన తలను తాకారని ఆయన గర్విష్ఠుడు కాలేదు, నాలాగా ఎవరున్నారు? నేను గొప్ప వ్యక్తిత్వం కలవాడిని. "ఇది వైష్ణవ కాదు. సనాతన గోస్వామి, ఆయన చైతన్య మహాప్రభు వద్దకు వచ్చినప్పుడు, ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ, nīca jāti nīca karma nīca saṅgī: ` నేను చాలా తక్కువ తరగతి కుటుంబంలో జన్మించినాను, మరియు నా విధులు కూడా చాలా తక్కువ తరగతికి చెందినవి, మరియు నా సాంగత్యం కూడ చాలా తక్కువ స్థాయి. కాని సనాతన గోస్వామి చాలా గౌరవనీయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు, కానీ ఆయన మహమ్మదీయ రాజు సేవను అంగీకరించినందున, ఆయన తన బ్రాహ్మణ సంస్కృతిని కోల్పోయాడు. ఆయన కోల్పోలేదు, కాని పైపైన అలా కనిపించింది, కారణం ఆయన మహమ్మదీయులతో కలసిపోయి, వారితో తినడం, వారితోపాటు కూర్చొని, వారితో మట్లాడటం. కాని అతడు వదిలిపెట్టాడు. Tyaktvā tūrṇam aśeṣa-maṇḍala-pati-śreṇīṁ sadā tuccha. ఆయన అర్థం చేసుకున్నారు, నేను ఏమి చేస్తున్నాను? నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను." Jāniyā śuniyā viṣa khāinu. నరోత్తమదాస ఠాకూర్ చెప్తూ "నేను తెలిసి విషం తీసుకుంటున్నాను." తెలియకుండా ఒకరు విషం తీసుకోవచ్చు, కాని తెలిసి ఒకరు విషం తీసుకోవడమంటే, ఇది చాలా చింతించదగినది. కాబట్టి నరోత్తమదాస ఠాకూర్ అన్నారు,

hari hari biphale janama goṅāinu
manuṣya-janama pāiyā, rādhā-kṛṣṇa nā bhajiyā,
jāniyā śuniyā viṣa khāinu

కాబట్టి మనము ప్రపంచవ్యాప్తంగా ఈ కృష్ణచైతన్య ఉద్యమమును ప్రచారము చేయటానికి ప్రయత్నిస్తున్నాము, కాని ఇప్పటికీ, ప్రజలు ఈ కృష్ణచైతన్య ఉద్యమమును తీసుకోకపోతే, అప్పుడు ఆయన తెలిసి విషాన్ని తాగతున్నాడు. ఇది పరిస్థితి. ఆయన విషాన్ని త్రాగుతున్నారు. అది సత్యము. మనము దేనిని ఊహించుకోవడము లేదు, సిద్ధాంతం కాదు. వారు మనల్ని నిందిస్తున్నారు, "బ్రెయిన్వాష్." అవును, అది మెదడును శుభ్రం చేయుట. ఇది ... అన్ని మురికి విషయాలు, చెడులు, మనస్సు లో ఉన్నాయి, మనము వారిని శుభ్రం చేయుటకు ప్రయత్నిస్తున్నాము. అది మన...

śṛṇvatāṁ sva-kathāḥ kṛṣṇaḥ
puṇya-śravaṇa-kīrtanaḥ
hṛdy antaḥ stho hy abhadrāṇi
vidhunoti suhṛt satām
(SB 1.2.17)

ఈ పదం, అక్కడ ఉంది. Vidhunoti అంటే శుభ్రం చేయుట. శుభ్రం చేయుట. మీరు శ్రీమద్ భాగవతం లేద భగవద్గీత యొక్క సందేశం విన్నప్పుడు, ఈ పద్ధతి vidhunoti , శుభ్రం చేయుట . వాస్తవమునకు, ఇది బ్రెయిన్వాషింగ్ - కాని మంచి కోసం. శుభ్రం చేయుట చెడు కాదు. (నవ్వు) ఈ మూర్ఖులకు, వారికి తెలియదు. వారు ఆలోచిస్తున్నారు, "నీవు నన్ను పరిశుద్ధం చేస్తున్నావు? నీవు చాలా ప్రమదకరమైనవాడివి." అది వారి Mūrkhāyopadeśo hi prakopāya na śāntaye: ఒక దుష్టుడుకి, మీరు మంచి సలహా ఇస్తే, ఆయన కోపగించుకుంటాడు. Mūrkhāyopadeśo hi prakopāya na śāntaye. అది ఎలా? Payaḥ-pānaṁ bhujaṅgānāṁ kevalaṁ viṣa-vardhanam