TE/Prabhupada 0470 - ముక్తి కూడా మరొక మోసం

Revision as of 19:34, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.9 -- Mayapur, March 1, 1977


ముక్తి కూడా మరొక మోసం అని శ్రీధర స్వామి చెప్పాడు. ఎందుకు ముక్తి? కృష్ణుడు కోరలేదు "నీవు ముక్త కాకపోతే, విముక్తి పొందలేదంటే, నీవు సేవ చేయలేవు." లేదు. మీరు ఏ పరిస్థితిలోనైనా సేవ చేయవచ్చు. Ahaituky apratihatā. మొదట మనము విముక్తి పొందాలి అని కాదు. కారణం మీరు భక్తిని ప్రారంభించిన వెంటనే, మీరు అప్పటికే విముక్తి పొందారు. భక్తుని స్థితి చాలా గొప్పగా ఉంది, ఏ ఇతర రహస్యమైన ఉద్దేశ్యం లేకుంటే, ఆయన ఇప్పటికే విముక్తి చెందారు. Brahma-bhūyāya sa kalpate.

māṁ ca ya 'vyabhicāreṇi
bhakti-yogena yaḥ sevate
sa guṇān samatītyaitān
brahma-bhūyāya kalpate
(BG 14.26)

వెంటనే.

sarva dharmān parityajya
mām ekaṁ śaraṇaṁ vraja
ahaṁ tvāṁ sarva-pāpebhyo
mokṣayiṣyāmi...
(BG 18.66)

మీ పాపజీవితపు ప్రతిక్రియను తుడిచిపెట్టే భాద్యత కృష్ణుడు తీసుకుంటాడు, అంటే వెంటనే మీరు ముక్త అని అర్థం, మీరు స్వేచ్ఛ పొందుతారు. ముక్తి అంటే... మనము ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకున్నాము ఎందుకనగా మనం సృష్టిస్తున్నాం, ఒకదాని తర్వాత మరొకటి,సమస్యలను. Nūnaṁ pramattaḥ kurute vikarma ( SB 5.5.4) మనము అలాంటి స్థితిలో ఉన్నందున, మనము వ్యతిరేకముగా వ్యవహరిస్తాము, సరిగ్గా కాదు, మీకు కోరికోనప్పటికీ... మీరు ఒక చీమను కూడా చంపకూడదు అని చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ, తెలియకుండా, తెలియకుండా మీరు, నడుస్తున్నప్పుడు, మీరు చాలా చీమలను చంపుతారు. మరియు మీరు ఆ పని పాపము కాదని అనుకోకండి. మీరు పాపము చేశారు. ముఖ్యంగా భక్తులుకానివారు, వారు చంపినదానికి బాధ్యత కలిగి ఉండాలి, చాలా చిన్న జీవులు నడుస్తున్నప్పుడు లేదా... మీరు చూసినట్లైతే అక్కడ నీటికుండ ఉంది, చాలా చిన్న జంతువులు అందులో ఉన్నాయి. నీటికుండను తరలించడం ద్వార, మీరు చాలా జీవులను చంపేస్తారు. ఓవెన్లో అగ్నిని రగిలిస్తున్న సమయంలో, అక్కడ చాలా జీవజాతులు ఉన్నాయి. మీరు వాటిని చంపేస్తారు. కాబట్టి ఉద్దేశపూర్వకంగానో, తెలియకుండానో, ఈ భౌతిక ప్రపంచంలో ఇటువంటి స్థితిలో ఉన్నాము మనం చాలా చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా పాపములకు పాల్పడాలి. మీరు జైనులను చూసారు, వారు అహింస వెనుక ఉన్నారు. మీరు చూస్తారు వారు ఇలాంటి వస్త్రాన్ని ఉంచుకుంటారు, కాబట్టి, చిన్న కీటకాలు నోటిలోకి ప్రవేశించవు. కాని ఇవి కృత్రిమమైనవి. మీరు తనిఖీ చేయలేరు. గాలిలో చాలా జీవులు ఉన్నాయి. నీటిలో చాలా జీవులు ఉన్నాయి. మనము నీటిని త్రాగాలి. మీరు దీన్ని తనిఖీ చేయలేరు. ఇది సాధ్యం కాదు. కాని మీరు భక్తియుక్త సేవలో స్థిరముగా ఉన్నట్లయితే, అప్పుడు మీరు బద్ధులు కారు.

Yajñārthe karmaṇo 'nyatra loko 'yaṁ karma-bandhanaḥ ( BG 3.9) మీ జీవితం యజ్ఞం కోసం అంకితమైతే, కృష్ణుడి సేవ కొరకు, అప్పుడు మనము ఏ జ్ఞానం లేకుండా చేసిన అనివార్యమైన పాపభరిత కార్యక్రమాలకు, మనము బాద్యులము కాదు. Manye mithe kṛtaṁ pāpaṁ puṇyaya eva kalpate. కాబట్టి మన జీవితం కృష్ణచైతన్యము కోసం మాత్రమే అంకితం చేయాలి. అప్పుడు మనము సురక్షితంగా ఉంటాము. లేకపోతే మన కార్యక్రమాలకు చాలా ప్రతిస్పందనతో మనము చిక్కుకుoటాము మరియు తిరిగి జనన మరణ చక్రంలో పడిపోతాము. Mām aprāpya nivartante mṛtyu-saṁsāra-vartmani ( BG 9.3)

nūnaṁ pramattaḥ kurute vikarma
yad indriya-prītaya āpṛṇoti
na sādhu manye yato ātmano 'yam
asann api kleśada āsa dehaḥ
(SB 5.5.4)

సురక్షితమైన పరిస్థితి ఏంటంటే మనము ఎప్పుడూ కృష్ణచైతన్యములో నిమగ్నమవ్వాలి. అప్పుడు మనము పాపజీవితపు ప్రతిస్పందన నుండి సురక్షితంగా ఉంటాము, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధిస్తాము