TE/Prabhupada 0471 - కృష్ణుడిని సంతృప్తిపరచుటకు సులభమయిన మార్గం కేవలం మీకు మీ హృదయము అవసరం
Lecture on SB 7.9.9 -- Mayapur, March 1, 1977
ప్రభుపాద: కాబట్టి ప్రహ్లాద మహారాజు ఇట్లు తలచెను, ఆయన ఒక కుటుంబం, అసుర కుటుంబంలో జన్మించాడు, అయినప్పటికీ ఉగ్ర, ugra-jātam, అయినప్పటికీ, ఆయన కృష్ణుడిని సేవించాలని నిర్ణయించుకుంటాడు, భగవంతుడు నరసింహస్వామిని, భక్తి తో, అడుగుజాడలను అనుసరిస్తూ, gaja-yūtha pāya, ఏనుగు రాజు... ఆయన జంతువు. ఈ కథ మీకు తెలుసు, ఆయన నీటిలో మొసలి దాడికి గురయ్యాడు. రెండింటి మధ్య జీవితము కోసం పోరాటం, మరియు తరువాత, మొసలి నీటిలో జంతువు; అతడు గొప్ప శక్తి కలిగి ఉన్నాడు. మరియు ఏనుగు, ఆయన కూడ చాలా పెద్దది అయినప్పటికీ, శక్తివంతమైన జంతువు, కానీ ఆయన నీటి జంతువు కాదు, అందువలన ఆయన చాలా నిస్సహయంగా ఉన్నాడు. కాబట్టి చివరికి, ఆయన భగవంతుడి యొక్క పవిత్ర నామకీర్తన ప్రారంభించారు ప్రార్థించారు, అందువలన ఆయన రక్షించ బడ్డాడు. ఆయన రక్షించ బడ్డాడు, కారణం మొసలి ఏనుగు యొక్క కాలు పట్టుకున్నది, ఆయన కూడ రక్షించబడ్డాడు ఎందుకంటే ఆయన వైష్ణవ. మరియు ఈ జంతువు, మొసలి, ఆయన ఒక వైష్ణవుని పాదముల కింద ఉన్నాడు, అందువలన ఆయన కూడ రక్షించబడ్డాడు. (నవ్వు) ఇది కథ, మీకు తెలుసు. కావున, chāḍiyā vaiṣṇava sevā. ఆయన పరోక్షంగా వైష్ణవునికి సేవలను అందించాడు ఆయన కూడా విముక్తి పొందాడు.
కాబట్టి భక్తి మంచి విషయం, చాలా సులభంగా మీరు దేవాదిదేవుని యొక్క అనుగ్రహం పొందవచ్చు. కృష్ణుడు మీపై సంతోషించినట్లయితే, ఏమి మిగిలి ఉంటుంది? మీరు ప్రతిదాన్ని పొందుతారు. మీరు ప్రతిదాన్ని పొందుతారు. Yasmin vijñāte sarvam eva vijñātaṁ bhavanti (Muṇḍaka Upaniṣad 1.3). కృష్ణుడిని సంతృప్తిపరచుటకు సులభమయిన మార్గం ... మీకు చాలా డబ్బు, ఎక్కువ విద్య, ఏమీ అవసరం లేదు. కేవలం మీకు మీ హృదయము అవసరం: ఓ కృష్ణా, మీరు నా ప్రభువు. మీరు శాశ్వతంగా నా యజమాని. నేను శాశ్వతంగా నీ సేవకుడను. నన్ను మీ సేవలో వినియోగించుము. అది హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే / (భక్తులు జపించిరి) హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఇది హరే కృష్ణ మంత్రం యొక్క అర్ధం: "ఓ కృష్ణా , కృష్ణుడి యొక్క శక్తి, నేను నీ దాసుడను. ఎట్లాగో నేను ఇప్పుడు ఈ భౌతిక స్థితిలో పడిపోయినాను. దయచేసి నన్ను తీసికొని నీసేవలో నన్ను నిమగ్నం చేయండి." Ayi nanda-tanuja patitaṁ kiṅkaraṁ māṁ viṣame bhavaṁ budhau. మనకు చైతన్య మహాప్రభువు బోధిస్తున్నాడు. Bhavaṁ budhau. ఈ భౌతిక ప్రపంచం గొప్ప మహాసముద్రం వంటిది, భవ. భవ అంటే పునరావృతము జన్మించడము మరియు మరణించడము అని అర్ధం, అంబు అంటే, అంబుద అంటే సముద్రంలో మహాసముద్రంలో. కాబట్టి ఈ మహాసముద్రంలో మనం కష్టపడి పోరాడుతున్నాం. కాబట్టి చైతన్య మహాప్రభు చెప్పారు, ayi nanda tanuja patitaṁ kiṅkaraṁ mām: నేను శాశ్వతంగా నీ సేవకుడను. ఎట్లాగో నేను ఇప్పుడు ఈ మహాసముద్రంలో పడిపోయి పోరాడుతున్నాను. నన్ను తీసుకువెళ్ళు. Ayi nanda-tanuja patitaṁ kiṅkaraṁ mām viṣame bhavāmbudhau kṛpāya. మీ కారణము లేని దయ ద్వార...
- ayi nanda-tanuja patitaṁ kiṅkaraṁ māṁ viṣame bhavāmbudhau
- kṛpāya tava pāda-paṅkaja-sthita-dhūlī sadṛśsaṁ vicintaya
- (CC Antya 20.32, Śikṣāṣṭaka 5)
ఇది భక్తి-మార్గ, భక్తియుక్త సేవ, చాలా వినయంతో, సాత్వికతతో, ఎల్లప్పుడూ కృష్ణుడిని ప్రార్థించడం, దయచేసి మీ యొక్క కమల పాదముల దుమ్ము యొక్క కణంలో ఒకటిగా నన్ను పరిగణించండి. ఇది చాలా సులభమైన విషయం. Man-manā. ఈ విధముగా కృష్ణుడి గురించి ఆలోచించండి, ఆయన భక్తులుకండి, వందనాలు సమర్పించుము మరియు ఏమైనా పత్రం పుష్పం, చిన్న పుష్పం, నీరు, మీరు సమకూర్చoడి, కృష్ణుడికి అర్పించoడి. ఈ విధముగా చాలా శాంతిగా నివసిస్తూ సంతోషంగా ఉండండి.
చాలా ధన్యవాదలు.
భక్తులు: జయ ప్రభపాద