TE/Prabhupada 0659 - కేవలం సద్భావంతో, విధేయతతో విన్నప్పుడు, అప్పుడు మీరు కృష్ణుడిని అర్థం చేసుకుంటారు

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969


ప్రభుపాద: అవును!

భక్తుడు: ప్రభుపాద, మీరు చెప్పారు కృష్ణునికి అవయవాలు లేవు అని, కళ్లు లేవు, మనము గ్రహించగలిగే రూపము కాదు. అప్పుడు చిత్రాలలో, అర్చామూర్తులలో మనకు ఇచ్చిన కృష్ణుడి రూపాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?

ప్రభుపాద: అవును, అది నేను వివరించాను. మీరు ఆయనను చక్కగా సేవిస్తే ఆయన వెల్లడి చేస్తాడు. మీ ఆరోహణ పద్ధతి ద్వారా మీరు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు. మీరు కృష్ణుడిని సేవించాలి కృష్ణుడు వెల్లడి చేస్తారు. ఇది భగవద్గీతలో చెప్పబడింది, మీరు పదవ అధ్యాయంలో చూస్తారు.

teṣām evānukampārtham
aham ajñāna-jaṁ tamaḥ
nāśayāmy ātma-bhāva-stho
jñāna-dīpena bhāsvatā
(BG 10.11)

ఎల్లప్పుడూ నా సేవలో నిమగ్నులై వున్నవారు, కేవలము వారికి ప్రత్యేక సహాయాన్ని చూపించడానికి, tesam evanukampartham, aham ajnana - jam tamah nasayami. జ్ఞానము అనే కాంతి ద్వారా అజ్ఞానము అనే అంధకారాన్ని నశింపచేసెదను. కాబట్టి కృష్ణుడు మీలో ఉన్నాడు. భక్తి పద్ధతి ద్వారా కృష్ణుడిని మీరు నిజాయితీగా శోధిస్తున్నప్పుడు, ఇది భగవద్గీతలో చెప్పబడింది, మీరు పద్దెనిమిదవ అధ్యాయంలో, bhaktya mam abhjanati ( BG 18.55) ఈ భక్తి పద్ధతి ద్వారా నన్ను సులువుగా అర్థం చేసుకోవచ్చు. Bhaktya భక్తి అంటే ఏమిటి? భక్తి ఈ విధంగా ఉంది. Sravanam kirtanam visnoh ( SB 7.5.23) కేవలము విష్ణువు గురించి వినటం, కీర్తించటం. ఇది భక్తి యొక్క ఆరంభం.

కావున మీరు కేవలం సద్భావంతో, విధేయతతో విన్నప్పుడు, అప్పుడు మీరు కృష్ణుడిని అర్థం చేసుకుంటారు. కృష్ణుడు మీకు వెల్లడి అవుతాడు. sravanam kirtanam visnoh smaranam pada - sevanam archanam vandanam dasyam, విభిన్నమైన తొమ్మిది రకాల రకాలు ఉన్నాయి. కాబట్టి వందనం, ప్రార్థనలు అందించటం, అది కూడా భక్తి. శ్రవణం, దాని గురించి వినటం. ఉదాహరణకు మనము ఈ భగవద్గీత నుండి కృష్ణుని గురించి వింటున్నట్లుగా. ఆయన మహిమను కీర్తించటం, హరే కృష్ణ. ఇది ఆరంభం. sravanam kirtanam visnoh ( SB 7.5.23) విష్ణువు అంటే, ఇది..... అంతా విష్ణువు. ధ్యానం విష్ణువు. భక్తి అనేది విష్ణువు. విష్ణువు లేకుండా కాదు. కృష్ణుడు విష్ణువు యొక్క వాస్తవ రూపం. Krsnas tu bhagavan svayam ( SB 1.3.25) దేవాదిదేవుని వాస్తవ రూపం. కాబట్టి మనం ఈ పద్ధతిని అనుసరిస్తే మనం ఎట్టి సందేహం లేకుండా అర్థం చేసుకోవచ్చు.