TE/Prabhupada 0946 - మనము ఈ శరీరము నుంచి మరొక దానికి వెళ్ళుతున్నాము మాయా ఆనందం అని పిలవబడే దాని కోసం
720831 - Lecture - New Vrindaban, USA
మనము ఈ శరీరము నుంచి మరొక దానికి వెళ్ళుతున్నాము ఇల్యూసరీ హ్యాపీనెస్ మాయా ఆనందం అని పిలవబడే దాని కోసం బద్ద జీవితము అంటే మనం ఒక శరీరాన్ని అంగీకరిస్తాము, భౌతిక శరీరమును ఇది చాలా విధాలుగా కండిషన్డ్ చేయబడింది. ఉదాహరణకు శరీరము ఆరు రకాల మార్పులకు గురైనట్లు. ఇది పుట్టింది. శరీరం జన్మించినది, జీవి కాదు. ఇది ఒక నిర్దిష్ట సమయమున జన్మించింది, అది కొంత సమయం వరకు మిగిలి ఉంది, ఇది పెరుగుతుంది, ఇది కొన్ని ఉప ఉత్పత్తులను అందిస్తుంది, అప్పుడు శరీరం తగ్గిపోతుంది చివరికి అది అదృశ్యమవుతుంది. ఆరు రకాల మార్పులు. ఈ ఆరు రకాలైన మార్పులు మాత్రమే కాకుండా, అనేక కష్టాలు కూడా ఉన్నాయి. వాటిని త్రివిధ క్లేశములు అని పిలుస్తారు: శరీరమునకు సంబంధించిన, మనస్సుకు సంబంధించిన, ఇతర జీవులు ఇస్తున్న దుఃఖములను, సహజ అవాంతరాల వల్ల జరుగుతున్న దుఃఖములు. ఏమైనప్పటికీ, మొత్తం విషయము నాలుగు సూత్రాలు సంలోకముగా చెప్పబడినది, జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి. ఇవి మన బద్ధ జీవితం.
కాబట్టి, ఈ బద్ధ జీవితము నుండి బయటపడటానికి, మన భాగవత చైతన్యాన్ని లేదా కృష్ణ చైతన్యమును పునరుద్ధరించినట్లయితే, లేదా భగవంతుని చైతన్యమును, మీరు ఇష్టపడేది... మనము "కృష్ణుడి" గురించి మాట్లాడినప్పుడు అంటే దేవాదిదేవుడు అని అర్థం. భగవంతుని చైతన్యం, కృష్ణ చైతన్యము, లేదా మన వాస్తవ చైతన్యం. ఉదాహరణకు మనలో ప్రతి ఒక్కరిలాగే, మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాము నేను అటువంటి గొప్పమనిషి యొక్క కుమారుడిని. అటువంటి మరియు అటువంటి గొప్పమనిషి నా తండ్రి. ఇది తండ్రికి, తండ్రితో ఉన్న సంబంధాన్ని గుర్తుంచుకోవడం సహజము. సాధారణ వ్యాపారములో కూడా, మర్యాద ఏమిటంటే ఒక వ్యక్తి తన గురించి చెప్పుకుండేటట్లు అయితే, ఆయన తన తండ్రి పేరును ఇవ్వాలి. భారతదేశం లో ఇది చాలా అవసరం, తండ్రి నామము లేదా టైటిల్ అందరికీ చివరి పేరు. కాబట్టి మహోన్నతమైన తండ్రి, కృష్ణుడిని మనము మరచిపోయినప్పుడు, మనము స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నాము... మనము నా ఆనందం ప్రకారం జీవితాన్ని ఆనందించాలనుకుంటే స్వతంత్రముగా అని అర్థం. దీనిని స్వాతంత్రం అని పిలుస్తారు. కానీ... కానీ అటువంటి స్వాతంత్ర్యం ద్వారా, మనము ఎప్పుడూ సంతోషంగా లేము, కాబట్టి మనం ఈ శరీరము నుండి మరొకదానికి వెళ్ళుతాము భ్రమ కలిగించే ఆనందం అని పిలవబడే దాని వలన ఒక నిర్దిష్టమైన శరీరం, ఆనందం యొక్క ఒక నిర్దిష్టమైన సౌకర్యమును కలిగి ఉంది కనుక. ఉదాహరణకు మనలో ప్రతి ఒక్కరు, మనము ఆకాశంలో ఎగరాలని అనుకుంటున్నాము. కానీ మనం మానవులము కనుక, మనం రెక్కలు కలిగి లేము, మనము ఎగరలేము. కానీ పక్షులు, అవి జంతువులు అయినా, తక్కువ స్థాయి జంతువులుగా ఉన్నప్పటికీ, అవి సులభముగా ఎగరగలవు. ఈ విధముగా, మీరు విశ్లేషణాత్మకముగా అధ్యయనం చేస్తే, ప్రతి నిర్దిష్టమైన శరీరము ఒక నిర్దిష్టమైన సౌకర్యమును కలిగి ఉంది, ఇతరులు కలిగి లేరు. కానీ జీవితంలోని అన్ని సౌకర్యాలను మనము కోరుకుంటున్నాము. అది మన ఆసక్తి