TE/Prabhupada 0945 - భాగవత-ధర్మము అంటే భక్తులకు మరియు భగవంతునికి మధ్య ఉన్న సంబంధం



720831 - Lecture - New Vrindaban, USA


భాగవత-ధర్మము అంటే భక్తులకు మరియు భగవంతునికి మధ్య ఉన్న సంబంధం ఈ కృష్ణ చైతన్యము ఉద్యమములో పాల్గొంటున్నందుకు నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పటికే శ్రీమణ్ కీర్తనానంద మహారాజ వర్ణించారు, ఈ భాగవత-ధర్మము భగవంతుని చేత చెప్పబడినది. భగవంతుడు శ్రీ కృష్ణుడు, భగ-వాన్. ఇది ఒక సంస్కృత పదం. భగ అంటే అదృష్టం, వాన్ అంటే అర్థం కలిగి ఉన్న వ్యక్తి. ఈ రెండు పదాలను కలిపితే వచ్చే పదం భగవాన్ లేదా మహోన్నతమైన అదృష్టవంతుడు. ఎవరైనా చాలా ధనవంతుడైతే, ఎవరైనా చాలా బలంగా ఉంటే మనం అదృష్టముగా లెక్కించుతాము, ఎవరైనా చాలా అందమైన వారు అయితే, ఎవరైనా చాలా తెలివైన వారు అయితే ఎవరైనా జీవితాన్ని పరిత్యజించిన వారు అయితే. ఈ విధముగా, ఆరు ఐశ్వర్యములు ఉన్నాయి, ఈ ఐశ్వర్యములు, సంపూర్ణముగా కలిగి ఉన్నప్పుడు, శత్రుత్వం లేకుండా, ఆయనను భగవాన్ అంటారు. అందరిలో కల్ల ధనవంతుడు, అందరిలో కల్ల తెలివైన వాడు, అత్యంత అందమైన వాడు, అత్యంత ప్రసిద్ధమైన వాడు, ఈ విధముగా పరిత్యజించిన వాడు, ఈ విధముగా భగవంతుడు. భాగవతము అనే పదము కూడా భగ అనే పదం నుండి వస్తుంది. భగ నుండి, ఇది ఒక అసమాపక క్రియ ఉపయోగించినప్పుడు, ఇది భగగా అవుతుంది. కాబట్టి భాగవతము. అదే విషయము, వాన్, ఈ పదం వత్ పదం, వత్ - శబ్దం నుండి వచ్చింది భాగవత. సంస్కృతంలో, ప్రతి పదం వ్యాకరణంగా చాలా క్రమపద్ధతిలో ఉంది. ప్రతి పదం. అందువలన దీనిని సంస్కృత భాష అని పిలుస్తారు. సంస్కృతం అంటే సంస్కరించబడింది. మనము మన కల్పనల ద్వారా తయారు చేయలేము; ఇది పరిపూర్ణంగా వ్యాకరణ నియమాలు నిబంధనల ప్రకారం ఉండాలి.

కాబట్టి భాగవత-ధర్మము అనగా భక్తులకు భగవంతునికి మధ్య ఉన్న సంబంధం. భగవాన్ అంటే భగవంతుడు. భక్తుడు అంటే భాగవత, లేదా భగవంతునితో సంబంధం కలిగి ఉండటము. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవంతునితో సంబంధం కలిగి ఉంటారు, ఉదాహరణకు తండ్రి మరియు కుమారుడు ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉంటారు. ఆ సంబంధం ఏ దశలోనైనా తెగిపోదు, కానీ కొన్నిసార్లు అది కుమారుడు, తన సొంత స్వాతంత్ర్యం వలన, ఆయన తన ఇంటి నుండి బయటికి వెళ్లి, తన తండ్రితో ఉన్న సన్నిహిత సంబంధమును మరచిపోతాడు. మీ దేశంలో ఇది చాలా అసాధారణమైన విషయము కాదు. చాలామంది కుమారులు ప్రేమ ఉన్న తండ్రి ఇంటి నుండి బయటకు వస్తారు. ఇది చాలా సాధారణ అనుభవం. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్యం కలిగి ఉన్నారు. అదేవిధముగా, మనము అందరము భగవంతుని కుమారులము, కానీ మనము, అదే సమయంలో, స్వతంత్రులము. పూర్తిగా స్వతంత్రముగా కాదు, కానీ స్వతంత్రముగా. మనము స్వాతంత్ర్యం కలిగిన ధోరణిని కలిగి ఉన్నాము. ఎందుకంటే భగవంతుడు పూర్తిగా స్వతంత్రుడు, మనము భగవంతుని నుండి జన్మించాము, కాబట్టి, మనము స్వాతంత్ర్యం యొక్క లక్షణము కలిగి ఉన్నాము. మనము భగవంతుని వలె పూర్తిగా స్వతంత్రముగా ఉండకపోయినా, కానీ ధోరణి ఉంది "నేను స్వతంత్రముగా ఉంటాను." కాబట్టి జీవులు, మనము-మనము భగవంతునిలో భాగము, భగవంతుడు-మనము భగవంతుని స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటున్నప్పుడు, అది మన బద్ధ జీవితము