TE/Prabhupada 0894 - కర్తవ్యమును పూర్తి చేయాలి. అదికొంచము బాధ అయినా కూడా. అది తపస్యా అని పిలువబడుతుంది

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730417 - Lecture SB 01.08.25 - Los Angeles


కర్తవ్యమును పూర్తి చేయాలి. అది కొంచము బాధ అయినా కూడా. అది తపస్యా అని పిలువబడుతుంది కాబట్టి అర్జునుడు కృష్ణుడిని ఈ ప్రశ్న అడిగినాడు: నీవు మాట్లాడుతున్నది ఏమైనా, అది సరియైనది. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ. అందరూ ఈ శరీరం కాదు. ఆయన ఆత్మ. ఈ శరీరం యొక్క వినాశనం తరువాత... "(మరోప్రక్క :) దానిని ఆపు. శరీరము మరణించిన తరువాత ఆత్మ వెళ్ళిపోతుంది కానీ నా కొడుకు మరణిస్తున్నప్పుడు, లేదా నా తాత చనిపోతున్నప్పుడు, నేను చనిపోతున్నాను, నా తాత చనిపోవడము లేదు , నా కొడుకు మరణించడం లేదని నేను ఎలా నన్ను ఓదార్చుకోగలను, అది కేవలం మార్చడము మాత్రమే అని? ఎందుకంటే నేను ఆ విధముగా ఆలోచించడానికి అలవాటు పడ్డాను. కాబట్టి బాధ ఉండాలి. " అందువల్ల కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు: "అవును, అది వాస్తవం, కాబట్టి మీరు సహించాలి, అది అంతే. ఇంకొక పరిష్కారము లేదు. "Tāṁs titikṣasva bhārata.

కృష్ణుడు ఇవి వాస్తవము కాదని ఎప్పుడునూ చెప్పలేదు, ఏవైతో అర్జునుడు వివరించాడో: నాకు తెలుసు నా కొడుకు మరణిస్తున్నాడు, నా కొడుకు శరీరం మారుస్తున్నాడు, లేదా నా తాత మరణిస్తున్నాడు, శరీరం మారుస్తున్నాడు, నాకు ఇది నాకు తెలుసు, కానీ ఇప్పటికీ, నేను చర్మం మీద అభిమానంతో ఉన్నాను కనుక, నేను బాధ పడాలి. " కృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు: "అవును, బాధ ఉంది, ఎందుకంటే నీవు కూడా శరీర భావనలో ఉన్నావు. కాబట్టి బాధ అక్కడ ఉండాలి. కాబట్టి తట్టుకోవడానికి ఇంత కంటే ఇతర పరిష్కారం లేదు. ఇతర పరిష్కారం లేదు. " Mātrā-sparśās tu kaunteya śītoṣṇa-sukha-duḥkha-dāḥ ( BG 2.14)

ఉదాహరణకు మీ దేశంలో వలె, ఉదయమున స్నానం చేయడము కొద్దిగా కష్టమైన పని. అంటే భక్తులు అయిన వారు, స్నానం చేయడాన్ని ఆపివేస్తారా? కాదు. చల్లగా ఉన్నా, చల్లగా ఉన్నా, స్నానం చేయాలి. కర్తవ్యము పూర్తి చేయాలి. కర్తవ్యము పూర్తి చేయాలి. కొంచము బాధగా ఉన్నా కూడా. అది తపస్య అని పిలువబడుతుంది. తపస్య అంటే మనము మన కృష్ణ చైతన్యములో మనము సుదీర్ఘముగా ముందుకు కొనసాగాలి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రమాదకరమైన మరియు విపత్తు ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ. దీనిని తపస్యా అని పిలుస్తారు. తపస్య అంటే జీవితములో ఇబ్బందులను స్వచ్ఛందంగా అంగీకరించడం. కొన్నిసార్లు తపస్యా, తపస్యా పద్ధతిలో, వేసవి కాలములో, వేసవిలో, తీవ్రమైన సూర్యుని వేడి ఉన్నప్పటికీ వారు చుట్టూ కొంత మంటను పెట్టుకుంటారు మధ్యలో కూర్చుని ధ్యానం చేస్తారు. తపస్యా యొక్క కొన్ని పద్ధతులు ఉన్నాయి. తీవ్రమైన వణుకు పుట్టించే చలిలో మెడ వరకు నీటిలో ఉండి ధ్యానం చేస్తారు. ఈ విషయాలు తపస్యాలో సూచించబడ్డాయి.

కానీ భగవంతుడు చైతన్య మహా ప్రభు మీకు అలాంటి పద్ధతులను ఇవ్వలేదు. ఆయన మీకు చాలా మంచి కార్యక్రమమును ఇచ్చాడు: కీర్తన చేయండి, నృత్యం చేయండి మరియు ప్రసాదం తీసుకోండి. (నవ్వు) అయినా మనము ఇష్టపడటము లేదు. మనము ఈ తపస్యని అంగీకరించలేము. మీరు చూడండి. మనము పతనము అయినాము. Su-sukhaṁ kartum avyayam ( BG 9.2) ఇది ఒక రకమైన తపస్యా, ఇది చాలా సులభం ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయినప్పటికీ, మనం సమ్మతించడము లేదు. మనము మనల్ని వీధిలో కుళ్ళబెట్టుకుంటాము, ఎక్కడైనా మరియు ప్రతీ చోట పడుకుంటాము ఇంకా, నేను తాగుతాను మరియు మైథున సుఖమును అనుభూతి చెందుతాను మరియు పడుకుంటాను. కాబట్టి ఏమి చేయవచ్చు? మనం మంచి సౌకర్యాలు ఇస్తున్నాం. ఇక్కడకు రండి కీర్తన చేయండి, నృత్యం చేయండి, శాంతిగా నివసించండి మరియు, కృష్ణ-ప్రసాదం తీసుకోండి. సంతోషంగా ఉండండి. కానీ ప్రజలు అంగీకరించరు. అది దురదృష్టం అని పిలుస్తారు.

చైతన్య మహా ప్రభు అందువలన అన్నారు: etādṛśī tava kṛpā bhagavan mamāpi durdaivam īdṛśam ihājani nānurāgaḥ ( CC Antya 20.16) చైతన్య మహా ప్రభు చెప్పినారు: nāmnām akāri bahudhā nija-sarva-śaktiḥ. భగవంతుని యొక్క పవిత్రమైన పవిత్ర నామములో, కృష్ణుడి, అన్ని శక్తులు ఉన్నాయి. కృష్ణుడు అపరిమిత శక్తులు కలిగి ఉన్న విధముగా, అదే విధముగా నామములో, కృష్ణుని యొక్క పవిత్ర నామములో, అపరిమితమైన శక్తి ఉంది. కావున ,nāmnām akāri bahudhā. కృష్ణుడికి అనేక పేర్లు ఉన్నాయి. కృష్ణునికి వేలాది పేర్లు ఉన్నాయి. కృష్ణ నామము ప్రధాన పేరు. Nāmnām akāri bahudhā nija-sarva-śaktis tatrārpitā niyamitaḥ smaraṇe na kālaḥ. మీరు ఈ సమయంలో లేదా ఆ సమయంలోనే కీర్తన చేయాలనే గంభీరమైన నియమాలు లేవు. లేదు. ఏ సమయంలో అయినా మీరు తీసుకోవచ్చు. ఈ నామము కృష్ణుడితో సమానంగా ఉంటుంది. ఈ తర్కంపై, కృష్ణుడి పవిత్ర పేరు, కృష్ణుడు. అది కృష్ణుడు కాకుండా మరొకటి కాదు. కృష్ణుడు గోలోకా వృందావనములో నివసిస్తున్నాడని మరియు ఆయన నామము భిన్నంగా ఉంటుంది అని అనుకోవద్దు. భౌతిక ప్రపంచంలో మనము ఈ భావన కలిగి ఉన్నాము. నిజానికి నామము వాస్తవానికి భిన్నంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అటువంటి వ్యత్యాసం లేదు. ఇది సంపూర్ణము అని పిలువబడుతుంది. కృష్ణుడు శక్తి కలిగి ఉన్నట్లు , పేరు శక్తి కలిగి ఉంది