TE/Prabhupada 0009 - భక్తునిగా మారిన దొంగ

Revision as of 23:39, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.2.12 -- Los Angeles, August 15, 1972

కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. nāhaṁ prakāśaḥ sarvasya yoga-māyā-samāvṛtaḥ( Bg. 7.25) నేను ప్రతి ఒక్కరికీ కనపడను. యోగమాయ, యోగమాయ కప్పుతోంది. కాబట్టి మీరు భగవంతున్ని ఎలా చూడగలరు? కానీ ఈ మూర్ఖత్వము కొనసాగుతోంది, మీరు భగవంతుని నాకు చూపిస్తారా? మీరు భగవంతుని చూసారా? భగవంతుడు ఒక ఆట వస్తువు అయిపోయాడు. ఇదిగో భగవంతుడు. ఈయన భగవంతుని అవతారం. న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః ( Bg. 7.15) వారు పాపులు, జులాయిలు, అవివేకులు, మానవజాతిలో అత్యల్పమైన వారు. వాళ్ళు ప్రశ్నిస్తారు: "మీరు నాకు భగవంతుని చూపిస్తారా?" మీరు ఎటువంటి అర్హత సాధించారు, భగవంతుని చూడటానికి? ఇక్కడ ఉంది అర్హత. అది ఏమిటి? తత్ శ్రద్దధానాః మునయః . ( SB 1.2.12) ఒకరు మొదటగా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము. శ్రద్దధానాః. నిజానికి అతను, భగవంతుణ్ణి చూడటానికి చాలా ఆసక్తి కలిగి ఉండాలి. ఒక సాధారణ, అల్పమైన కోరికగా కాదు, "మీరు నాకు భగవంతుని చూపుతారా?" ఒక మాయ, భగవంతుడు అంటే కేవలం ఒక మాయ లాగా. కాదు. అతను చాలా శ్రద్ధ కలిగి ఉండాలి: అవును, భగవంతుడు ఉన్నట్లు అయితే... మేము చూసాము, మేము భగవంతుడు గురించి తెలుసుకోవడం జరిగింది. కావున నేను తప్పక చూడాలి."

దీనికి సంబంధించి ఒక కథ ఉంది. ఇది చాలా వివరణాత్మకంగా ఉంటుంది; వినడానికి ప్రయత్నించండి. భాగవతమును ఒక ప్రొఫెషనల్ (వృత్తిలో నిపుణుడు) వల్లించేవాడు చెబుతున్నాడు. మరియు అతను కృష్ణుని గురించి వివరిస్తున్నాడు, బాగా అన్ని ఆభరణాలతో అలంకరించబడి ఉంటాడు, అతను ఆవులు కాచుట కొరకు అరణ్యానికి వెళ్ళాడు. ఆ సభలో ఒక దొంగ ఉన్నాడు. అందువలన అతను అనుకున్నాడు ఎందుకు వృందావనానికి వెళ్ళి, ఈ బాలుడుని దోపిడీ చేయకూడదు? అతను చాలా విలువైన రత్నాలతో అడవిలో ఉన్నాడు. నేను అక్కడికి వెళ్లి పిల్లాడిని పట్టుకుని అన్ని ఆభరణాలను తీసుకొనవచ్చు." అది తన ఉద్దేశం. కావున అతను బాలుడును కనుగునేందుకు చాలా తీవ్రమైన నిశ్చయంతో ఉన్నాడు అప్పుడు నేను ఒక రాత్రికి రాత్రే లక్షాధికారి అవ్వగలను. చాలా నగలు. లేదు." కావున అతను వెళ్ళాడు, కానీ అతని అర్హత మాత్రం "నేను కృష్ణుడిని తప్పకుండా చూడాలి, నేను కృష్ణుడిని తప్పకుండా చూడాలి," ఆ ఆందోళన, ఆ ఆసక్తి వల్ల వృందావనంలో కృష్ణుడిని చూడటానికి అతనికి సాధ్యపడింది. అతను కృష్ణుడిని భాగవతం చెబుతున్న వ్యక్తి చెప్పినట్లే చూసాడు. అప్పుడు అతను చూసి, "ఓహ్; ఓహ్, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, కృష్ణా." కావున అతను కృష్ణుడిని పొగడడం మొదలు పెట్టాడు. కృష్ణుడిని పొగడడం వల్ల తాను కొన్ని నగలు తీసుకొనవచ్చు అని అనుకున్నాడు. అతను తన అసలు విషయం చెప్పినప్పుడు, నేను మీ ఈ ఆభరణాలు కొన్ని తీసుకొనవచ్చా? మీరు చాలా ధనవంతుడిగా ఉన్నారు. లేదు, లేదు, లేదు నువ్వు తీసుకోవడానికి లేదు...మా అమ్మగారు కోపగించుకుంటారు. నేను ఇవ్వలేను.. కృష్ణుడు చిన్న పిల్లాడి వలె. కావున అతను మరింత ఆసక్తి కృష్ణుడిపై చూపించాడు. మరియు అప్పుడు.. కృష్ణుడితో ఉన్న బంధం వలన, అతను అప్పటికే పవిత్రము అయ్యాడు. అప్పుడు, చివరిగా, కృష్ణుడు చెప్పాడు, "సరే, నువ్వు తీసుకొనవచ్చు." అప్పుడు అతను వెంటనే, ఒక భక్తుడయ్యాడు. ఎందుకంటే కృష్ణుడితో ఉన్న సాంగత్యం వలన...

కావున ఏదో ఒక విధంగా, మనము కృష్ణుడితో సాన్నిహిత్యంగా ఉండాలి. ఏదో ఒక విధంగా. అప్పుడు మనము పవిత్రులము అవుతాము