TE/Prabhupada 0008 - "నేను ప్రతి ఒక్కరి తండ్రిని" అని కృష్ణుడు చెప్తాడు



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973

కాబట్టి, కనీసం భారతదేశంలో, గొప్ప వ్యక్తులు అందరూ, సాధువులు, ఋషులు మరియు ఆచార్యులు, వారు చక్కగా మరియు పూర్తిగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభివృద్ధి చేశారు, మరియు మనము దాని ప్రయోజనాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఈ శాస్త్రాలు మరియు ఆదేశాలు భారతీయులకు లేదా హిందువులకు లేదా బ్రాహ్మణుల కోసం మాత్రమే ఉద్దేశించినవి కాదు. ఇది అందరి కోసం ఉద్దేశించబడింది. ఎందుకంటే కృష్ణుడు పేర్కొన్నాడు

sarva-yoniṣu kaunteya
sambhavanti mūrtayaḥ yaḥ
tāsāṁ mahad brahma yonir
ahaṁ bīja-pradaḥ pitā
(BG 14.4)

కృష్ణుడు పేర్కొన్నాడు ఏమనగా "నేను ప్రతి ఒక్కరికీ తండ్రి." అందువలన, ఆయన మనల్ని సంతోషంగా మరియు శాంతంగా ఉంచడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు. ఏ విధంగా అంటే ఒక తండ్రి లాగా తన కొడుకును మంచి పరిస్థితిలో మరియు సంతోషంగా వుండాలని కోరుకుంటాడు. అదేవిధంగా, కృష్ణుడు కూడా ప్రతి ఒక్కరినీ సంతోషంగా మరియు మంచి పరిస్థితిలో చూడాలని కోరుకుంటాడు. అందువలన ఆయన కొన్నిసార్లు వస్తుంటాడు. Yadā yadā hi dharmasya glānir bhavati.( BG 4.7) ఇది కృష్ణుని ఆగమనం యొక్క ప్రయోజనం. కాబట్టి ఎవరైతే కృష్ణుని సేవకులో, వారు కృష్ణుని భక్తులు. వారు కృష్ణుని లక్ష్యమును తీసుకోవాలి. వారు కృష్ణుని లక్ష్యమును తీసుకోవాలి. అదే చైతన్య మహాప్రభు యొక్క వివరణ.

āmāra ajñāya guru hañā tāra ei deśa
yare dekha, tare kaha, 'kṛṣṇa'-upadeśa
(CC Madhya 7.128)

కృష్ణ-ఉపదేశం. కేవలం కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దానిని బోధించడానికి ప్రయత్నం చేయండి. అది ప్రతి భారతీయుని యొక్క కర్తవ్యం. చైతన్య మహాప్రభు చెప్పారు.

bhārata-bhūmite manuṣya janma haila yāra
janma sārthaka kari para-upakāra
(CC Adi 9.41)

కాబట్టి భారతీయులారా, భారతీయులు జీవితం యొక్క పరోపకారం కోసం ఉద్దేశించబడినారు భారతీయులు ఇతరులను దోపిడీ చేయడానికి కోసం ఉద్దేశించబడలేదు. అది భారతీయుల పని కాదు. భారత చరిత్ర అంతా పరోపకారం కోసము వుంది. మరియు గతంలో, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి, ఆధ్యాత్మిక జీవితం గురించి తెలుసుకోవడానికి భారతదేశం వచ్చేవారు. యేసుక్రీస్తు కూడా అక్కడికి వెళ్ళాడు. మరియు చైనా నుండి మరియు ఇతర దేశాల నుండి. అది చరిత్ర.. మరియు మనం మన సొంత ఆస్తిని మర్చిపోతున్నాం. ఎంత విచక్షణాజ్ఞానం లేకుండా వున్నాం మనం. ఇటువంటి ఒక మహోద్యమం, కృష్ణ చైతన్యం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. కానీ మన భారతీయులు మరియు ప్రభుత్వం విచక్షణా జ్ఞానం లేకుండా వున్నారు. వారు తీసుకోరు. ఇది మన దురదృష్టం. కానీ ఇది చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యము ఆయన చెప్పారు ఏ రకమైన భారతీయుడు అయినా, భారత భూమి తే మనుష్య జన్మ, అతను మనిషి అయితే, ఈ వేద సాహిత్యం యొక్క ప్రయోజనం తీసుకొని తన జీవితాన్ని పరిపూర్ణముగా చేసుకోవాలి. మరియు ప్రపంచవ్యాప్తంగా జ్ఞానాన్ని ప్రచారము చేయాలి. అది పరోపకారం. కాబట్టి భారతదేశం చేయగలదు. వారు నిజంగా అభినందిస్తున్నారు. ఈ యూరోపియన్లు, అమెరికన్ యువకులు, వారు ప్రశంసించడం ఇది ఎంత గొప్ప... నాకు రోజూవారీ డజన్ల కొద్దీ లేఖలు వస్తున్నాయి, ఈ ఉద్యమం ద్వారా వారు పొందుతున్న ప్రయోజనం గురించి. నిజానికి, అది వాస్తవం. ఇది చనిపోయిన వానికీ జీవితం ఇస్తుంది. నేను ప్రత్యేకంగా భారతీయుల్ని అభ్యర్ధిస్తున్నాను, ముఖ్యముగా దేశ ప్రథమ నాయకులను. దయచేసి ఈ ఉద్యమానికి సహకరించి, మరియు మీ జీవితం మరియు ఇతరుల జీవితం విజయవంతము చేయడానికి ప్రయత్నించండి. అది కృష్ణుని లక్ష్యము, కృష్ణుని ఆగమమునకు కారణము. చాలా ధన్యవాదాలు.