TE/Prabhupada 0902 - కృష్ణ చైతన్యము కొరత, మీరు కృష్ణ చైతన్యవంతులు అయితే అప్పుడు ప్రతిదీ కావలసినంత ఉంటుంది

Revision as of 23:45, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730415 - Lecture SB 01.08.23 - Los Angeles


కృష్ణ చైతన్యము కొరత, మీరు కృష్ణ చైతన్యవంతులు అయితే అప్పుడు ప్రతిదీ కావలసినంత ఉంటుంది ప్రభుపాద: కాబట్టి భౌతిక జీవితం యొక్క ఆరంభం కృష్ణుడి మీద అసూయపడటము. ఎందుకు కృష్ణుడు మాత్రమే ఆనందించాలి. నేను ఆనందిస్తాను. ఎందుకు కృష్ణుడు గోపికలను ఆనందించాలి? నేను కృష్ణుడు అవుతాను మరియు ఆనందిస్తాను, గోపికల సమాజాన్ని తయారు చేసుకొని మరియు ఆనందిస్తాను. " ఇది మాయ. ఎవరూ ఆనందించేవారు కాలేరు. కృష్ణుడు అంటాడు, bhoktāraṁ yajña ( BG 5.29) .. శ్రీ కృష్ణుడు మాత్రమే ఆనందించేవాడు. మనము ఆయన ఆనందం కోసం అవసరమయ్యే వాటిని సరఫరా చేస్తూ ఉంటే, అది మన జీవితము యొక్క పరిపూర్ణత. మనము కృష్ణుడిని అనుకరించాలని కోరుకుంటే, "నేను ఒక భగవంతుడను అవుతాను అని. నేను ఒక అనుకరించే ఆనందించేవాడను అవుతాను, అప్పుడు మీరు మాయలో ఉన్నారు. మనం కేవలం సేవకులం... ఉదాహరణకు గోపికల జీవితం లాంటిది. కృష్ణుడు ఆనందిస్తున్నాడు, వారు ఆయన ఆనందించే పదార్థాలను సరఫరా చేస్తున్నారు. అవును. ఇది భక్తి. మనము దాని కొరకు ఉన్నాము... కృష్ణుడు సరఫరా చేస్తున్నాడు... సేవకుడు మరియు యజమాని. సేవకుడు యొక్క అన్ని అవసరాలను యజమాని సరఫరా చేస్తున్నారు, కానీ సేవకుడు యొక్క కర్తవ్యము యజమానికి సేవ చేయడము. అంతే. Eko bahūnāṁ yo vidadhāti kāmān nityo nityānāṁ cetanaś cetanānām... (Kaṭha Upaniṣad 2.2.13). ఇవి వేదముల సమాచారం... కృష్ణుడు మీకు అపారముగా ఇస్తున్నాడు, జీవితపు అన్ని అవసరాలకు. కొరత లేదు. ఆర్థిక సమస్య లేదు. మీరు కృష్ణుడికి సేవ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు ప్రతిదీ పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన హృషికేశ. చాలా... కృష్ణుడు కోరితే, తగినంత సరఫరా ఉండవచ్చు. ఉదాహరణకు మీ దేశంలో వలె, తగినంత సరఫరా ఉంది. ఇతర దేశంలో... నేను స్విట్జర్లాండ్ కు వెళ్ళాను: ప్రతిదీ దిగుమతి అవుతుంది. సరఫరా లేదు. సరఫరా కేవలము మంచు మాత్రమే. (నవ్వు) మీకు నచ్చినంత మంచు తీసుకోండి. మీరు చూడండి? అదేవిధముగా ప్రతిదీ కృష్ణుడి నియంత్రణలో ఉంది. మీరు భక్తుడిగా ఉంటే, అప్పుడు మంచు సరఫరా ఉండదు - కేవలం ఆహార సరఫరా మాత్రమే ఉంటుంది. మీరు భక్తుడు కాకపోతే, మంచుతో కప్పబడి ఉండండి. (నవ్వు) అంతే. మేఘంతో కప్పబడి ఉంటుంది. ప్రతిదీ కృష్ణుడి నియంత్రణలో ఉంది.

వాస్తవానికి ఎటువంటి కొరత లేదు. కొరత కృష్ణ చైతన్యము. కావున మీరు కృష్ణ చైతన్య వంతులు అయినట్లయితే అప్పుడు ప్రతిదీ అపారముగా ఉంటుంది. కొరత లేదు. ఇది పద్ధతి. Tvayā hṛṣīkeśa... ఇక్కడ చెప్పబడింది: Tvayā hṛṣīkeśa... Yathā hṛṣīkeśa khalena devakī ( SB 1.8.23) . ప్రపంచం ప్రమాదాలతో నిండి ఉంది. కానీ దేవకీ... కుంతీదేవి చెప్తుంది, కానీ, దేవకీ నీ భక్తురాలు, నీవు ఆమెను కాపాడావు ఆమె అసూయపడే సోదరుడు ఇచ్చిన వేదనల నుండి. " సోదరుడు విన్న వెంటనే "నా సోదరి కుమారుడు, నా సోదరి ఎనిమిదవ కుమారుడు నన్ను చంపుతాడు" ఓ, ఆయన దేవకీని చంపడానికి వెంటనే సిద్ధమయ్యాడు. కానీ అతడిని దేవకీ భర్త శాంతింప చేసాడు. రక్షణ ఇవ్వడము భర్త యొక్క బాధ్యత. నా ప్రియమైన బావ, ఎందుకు నీ సోదరి పట్ల అసూయపడుతున్నావు? ఏమైనప్పటికీ, నీ సోదరి నిన్ను చంపడము లేదు. ఆమె కుమారుడు నిన్ను చంపుతాడు. అది సమస్య. నేను నా కుమారులందరినీ నీకు ఇస్తాను, నీవు నీకు ఇష్టము వచ్చినది చేసుకోవచ్చు. ఎందుకు నీవు ఈ అమాయకపు అమ్మాయిని చంపుతున్నావు, కొత్తగా వివాహం చేసుకున్నది? ఆమె నీ చిన్న సోదరి, నీ కుమార్తె లాంటిది నీవు ఆమెకు రక్షణ ఇవ్వాలి. నీవు ఏమి చేస్తున్నావు?"

కావున కంసుడు శాంతింపబడ్డాడు. వసుదేవుని మాటలను ఆయన నమ్మాడు, ఆయన తన అందరి కుమారులను ఇస్తాను అని అన్నాడు," నీకు నచ్చితే నీవు, చంప వచ్చు." ఆయన అనుకున్నాడు "ప్రస్తుత పరిస్థితిలో కాపాడుకుంటాను. ఏమైనప్పటికీ, తరువాత, కంసుడు ఒక మేనల్లుడును పొందినప్పుడు, అతను ఈ అసూయను మర్చిపోవచ్చు. " కానీ అతను ఎప్పటికీ, ఎప్పుడూ మర్చిపోలేదు. అవును. అతను కుమారులు అందరినీ హత్య చేసి వారిని జైలులో ఉంచాడు. Śucārpitā badhya aticiram ( SB 1.8.23) Aticiram అంటే చాలా కాలం. అందువలన ఆయన రక్షింపబడ్డాడు. ఏమైనప్పటికీ దేవకీ కూడా రక్షింపబడినది అదేవిధముగా మనం దేవకీ మరియు కుంతీ యొక్క పరిస్థితిని తీసుకుంటే... కుంతీ, ఆమె కుమారులతో, పంచ పాండవులతో- అయిదుగురు పాండవులు... ఆమె వితంతువుగా మారిన తర్వాత, మొత్తం ప్రణాళిక, ధృతరాష్ట్రుని, నా తమ్ముడి పిల్లలను చంపడము ఎలా? ఎందుకంటే, యాదృచ్ఛికంగా, నేను గుడ్డి వాడను కనుక, నేను రాజ్యం యొక్క సింహాసనం పొందలేకపోయాను. నా చిన్న సోదరుడికి అది వచ్చింది. ఇప్పుడు ఆయన చనిపోయాడు. కాబట్టి కనీసము నా కుమారులు, వారు సింహాసనాన్ని పొందాలి. " అది అతని విధానం, ధృతరాష్ట్రుని యొక్క విధానం: "నేను పొందలేకపోయాను." ఇది భౌతిక ప్రవృత్తి. "నేను సంతోషంగా ఉంటాను, నా కుమారులు సంతోషంగా ఉంటారు. నా సమాజము సంతోషంగా ఉండాలి. నా దేశం సంతోషంగా ఉండాలి. " ఇవి విస్తరించిన స్వార్థములు. కృష్ణుడి గురించి ఎవరూ ఆలోచించడము లేదు, కృష్ణుడు ఎలా సంతోషంగా ఉంటాడు. ప్రతి ఒక్కరూ తన స్వంత పధ్ధతిలో ఆలోచిస్తున్నారు: "నేను ఎలా ఆనందముగా ఉంటాను. నా పిల్లలు ఎలా సంతోషంగా ఉంటారు, నా వర్గము సంతోషంగా ఉంటుంది, నా సమాజం సంతోషంగా ఉంటుంది, నా దేశం... " ఇది జీవితము కోసం పోరాటం. ప్రతిచోటా మీరు కనుగొంటారు. ఇది భౌతిక జీవితము. కృష్ణుడు సంతోషంగా ఉండటము గురించి ఎవరు ఆలోచించడము లేదు.

కాబట్టి ఈ కృష్ణ చైతన్యము చాలా ఉత్కృష్టమైనది. భాగవతమును, భగవద్గీతను అర్థము చేసుకోవడానికి ప్రయత్నించండి. మరియు hṛṣīkeṇa hṛṣīkeśa-sevanam ( CC Madhya 19.170) మీ ఇంద్రియాలను నిమగ్నం చేయడానికి ప్రయత్నించండి ఇంద్రియాల యజమాని యొక్క సేవ కోసం. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ శ్రీల ప్రభుపాద