TE/Prabhupada 0901 - నాకు ఈర్ష్య లేకపోతే,నేను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాను.ఎవరైనా పరీక్ష చేసుకోవచ్చు
730415 - Lecture SB 01.08.23 - Los Angeles
నాకు ఈర్ష్య లేకపోతే, అప్పుడు నేను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాను.ఎవరైనా పరీక్ష చేసుకోవచ్చు ప్రస్తుత క్షణములో,మన ఇంద్రియాలు కలుషితమైనవి. నేను ఆలోచిస్తున్నాను: "నేను అమెరికన్, కాబట్టి నా ఇంద్రియాలను ఉపయోగించుకోవాలి నా దేశం యొక్క సేవ కోసం, నా సమాజం, నా దేశం. " గొప్ప, గొప్ప నాయకులు, చాలా గొప్ప, గొప్ప విషయాలు. వాస్తవమైన భావన ఏమిటంటే "నేను అమెరికన్, నా ఇంద్రియాలు అమెరికన్ ఇంద్రియాలు. కాబట్టి అవి అమెరికా కోసం ఉపయోగించబడాలి. "అదే విధముగా భారతీయులు ఆలోచిస్తున్నారు, ఇతరులు ఆలోచిస్తున్నారు. కానీ వారిలో ఎవరికి తెలియదు, అవి కృష్ణునికి చెందుతాయి అని. ఇది అజ్ఞానం. ఏ బుద్ధి లేదు. వారు ప్రస్తుతము ఆలోచిస్తూన్నారు, ఈ ఇంద్రియాలు, ఉపాధి, ఉద్దేశించబడినవి... అమెరికన్ ఇంద్రియములు, ఇండియన్ ఇంద్రియములు, ఆఫ్రికన్ ఇంద్రియములు. కాదు. దీనిని మాయ అని పిలుస్తారు. ఇది కప్పబడి ఉంటుంది. అందువల్ల భక్తి అనగా sarvopādhi-vinirmuktam ( CC Madhya 19.170) మీ ఇంద్రియాలు ఈ అన్ని గుర్తింపులతో కలుషితము కానప్పుడు, అది భక్తి యొక్క ఆరంభం. నేను భావించినప్పుడు, "నేను అమెరికన్, నేను ఎందుకు కృష్ణ చైతన్యముని తీసుకోవాలి? ఇది హిందూ భగవంతుడు," ఇది మూర్ఖత్వం. నేను అనుకుంటే "నేను ముహమ్మదీయుడిని", "నేను క్రైస్తవుడను" అని, అప్పుడు పతనము అవుతారు. కానీ మనము "నేను ఆత్మను అని ఇంద్రియాలను పవిత్రము చేసుకుంటే, భగవంతుడు కృష్ణుడు" నేను కృష్ణుని యొక్క భాగం ; అందువలన కృష్ణుని సేవ చేయాలన్నదే నా బాధ్యత, " అప్పుడు మీరు వెంటనే స్వేచ్చను పొందుతారు. తక్షణమే. మీరు అమెరికన్, భారతీయుడు లేదా ఆఫ్రికన్ లేదా ఇది లేదా అది. మీరు కృష్ణ చైతన్యమును కలిగి ఉన్నారు, కృష్ణ చైతన్యము. అది కావలసినది.
అందువల్ల కుంతీదేవి చెప్తున్నది , "హృషీకేశ, నా ప్రియమైన కృష్ణ, నీవు ఇంద్రియాలకు గురువు, ఇంద్రియ తృప్తి కోసం, మేము భౌతిక జీవితములో పడి పోయినాము, వివిధ రకాల జీవితములలో " అందువల్ల మేము బాధపడుతున్నాము, ఎంత మేరకు బాధపడుతున్నాము అంటే, కృష్ణుడి తల్లి అయినా కూడా... ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచము కనుక, ఆమె కూడా బాధపడుతున్నారు, ఇతరులు గురించి ఏమి మాట్లాడతాము ? దేవకీ కృష్ణునికి తల్లి అయినది, ఆమె ఎంతో పవిత్రురాలు అయినది కానీ అయినప్పటికీ ఆమె కష్టాల్లో ఉంది. ఎవరి ద్వారా కష్టాలు? తన సోదరుడు కంసుని ద్వారా. కాబట్టి ఈ ప్రపంచం ఆ విధముగా ఉంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కృష్ణుడి తల్లి అయినా కూడా, మీ సోదరుడు కూడా, మీకు చాలా సమీప బంధువు. కాబట్టి మీరు, ప్రపంచంలో అంత అసూయ ఉంది, ఒకరి వ్యక్తిగత ఆసక్తి దెబ్బతింటే, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ప్రపంచం. ప్రతి ఒక్కరూ. ఆయన సోదరుడు అయినప్పటికీ, ఆయన తండ్రి అయినా కూడా. ఇతరుల గురించి ఏమి మాట్లాడాలి? Khalena. ఖల అంటే అసూయ. ఈ భౌతిక ప్రపంచం అసూయపడేది, అసూయపడేది. నేను నీ మీద అసూయగా ఉంటే . మీరు నా మీద అసూయతో ఉంటే. ఇది మన కర్తవ్యము. ఇది మన కర్తవ్యము.
అందుచే ఈ కృష్ణ చైతన్యము ఉద్యమము అటువంటి అసూయ లేని వ్యక్తుల కోసము, ఎవరు అసూయ లేకుండా ఉంటారో. పరిపూర్ణ వ్యక్తి. Dharmaḥ projjhita-kaitavo 'tra paramo nirmatsarāṇāṁ satāṁ vāstavaṁ vastu vedyam atra ( SB 1.1.2) అసూయ మరియు ఈర్ష్య కలిగిన వారు, ఈ భౌతిక ప్రపంచం లోపల ఉంటారు. అసూయ లేని వారు, వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. సాధారణ విషయము. మీకు మీరే పరీక్షించుకోండి, "నేను అసూయతో ఉన్నానా, నా ఇతర సహచరులు, స్నేహితులందరి మీద అసూయతో ఉన్నానా? " అప్పుడు నేను భౌతిక ప్రపంచంలో ఉన్నాను. నేను అసూయతో లేకపోతే, అప్పుడు నేను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాను. ఎవరైనా పరీక్షించుకోవచ్చు. నేను ఆధ్యాత్మికంగా పురోగతి చెందానా లేదా అనే ప్రశ్నే లేదు. మీరు మిమ్మల్ని పరీక్షించుకోవచ్చు. Bhaktiḥ pareśānubhavo viraktir anyatra syāt ( SB 11.2.42) ఉదాహరణకు మీరు తింటూ ఉంటే, మీ ఆకలి సంతృప్తి చెందినదా, సంతృప్తి చెందినారా, మీరు అర్థం చేసుకుంటారు. మీరు ఇతరుల నుండి సర్టిఫికేట్ తీసుకోవల్సిన అవసరం లేదు. అదేవిధముగా, మీరు మిమ్మల్ని పరీక్షించుకుంటే మీరు అసూయతో ఉన్నారా, మీరు ఈర్ష్యతో ఉన్నారా, అప్పుడు మీరు భౌతిక ప్రపంచంలో ఉన్నారు. మీరు అసూయతో లేకపోతే, మీరు ఈర్ష్యతో లేకపోతే అప్పుడు మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు అప్పుడు మీరు చాలా చక్కగా మీరు కృష్ణునికి సేవ చేయవచ్చు, మీకు అసూయ లేకపోతే . ఎందుకంటే మన అసూయ, మన ఈర్ష్య మొదలైంది, కృష్ణుని మీద నుండి మొదలైంది. ఉదాహరణకు మాయావాదుల వలె: "ఎందుకు కృష్ణుడు భగవంతుడు? నేను కూడా, నేను కూడా భగవంతుడను. నేను కూడా."