TE/Prabhupada 1038 - పులి యొక్క ఆహారము మరో జంతువు. మానవుని యొక్క ఆహారము పండ్లు, ధాన్యాలు, పాల పదార్థములు
730809 - Conversation B with Cardinal Danielou - Paris
పులి యొక్క ఆహారము మరో జంతువు. మానవుని యొక్క ఆహారము పండ్లు, ధాన్యాలు, పాల పదార్థములు
కార్డినల్ డేనియౌ: నేను మిమ్మల్ని కలసినందుకు చాలా ఆనందంగా ఉన్నాను...
ప్రభుపాద: నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా? యేసు చెప్పాడు: నీవు చంపకూడదు అని. కాబట్టి క్రైస్తవ ప్రజలు ఎందుకు చంపుతున్నారు?
కార్డినల్ డేనియౌ: (స్పానిష్...) యోగస్వారా: (స్పానిష్...)
కార్డినల్ డేనియొ: చంపడము అనేది క్రైస్తవ ధర్మములో నిషిద్ధం. అవును. కానీ ముఖ్యముగా మనుష్యుల జీవితానికి, మృగాల జీవితానికి మధ్య తేడా ఉందని మేము భావిస్తాము. (స్పానిష్...) మనుష్యుల జీవితం పవిత్రమైనది ఎందుకంటే మనిషి భగవంతుని ప్రతిరూపం. కానీ జంతువులకు, జంతువులకు, మేము అదే మర్యాదను కలిగి లేము మేము జంతువులు మనిషి యొక్క సేవలో ఉన్నాయి అని అనుకుంటాము, ఇది, మనిషికి, చట్టబద్ధమైనది అని అనుకుంటున్నాను... మనకు, ప్రతి జీవితం ఒకటే కాదు. వాస్తవమునకు ముఖ్యం ఏమిటంటే మనిషి యొక్క జీవితం, మానవ జీవితము వాస్తవమునకు పవిత్రమైనది, ఒక మానవుని చంపడము నిషిద్ధం...
ప్రభుపాద: లేదు, కానీ యేసు "మానవుడు" అని చెప్పలేదు. ఆయన సాధారణంగా ఇలా చెప్పాడు: "నీవు చంపకూడదు." యోగస్వారా: (స్పానిష్...)
కార్డినల్ డేనియౌ: (స్పానిష్...) బైబిలులో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఉదాహరణకి, బైబిల్లో చాలా బలి అర్పణలు, జంతువుల బలి ఉన్నాయి. మీకు తెలుసు. బైబిల్లో అనేక జంతు బలి ఉన్నాయి. మీరేమంటారు. ఇది నిషిద్ధం కాదు. ఒక వ్యక్తిని చంపడము ఇది ఒక గొప్ప పాపం అని అంగీకరిస్తాము యుద్ధము, యుద్ధము, జాతీయ యుద్ధము గొప్ప ప్రశ్న తప్పకుండా ఉంది., అది...
ప్రభుపాద: మీరు, మీరు, ఒక జంతువును చంపడము వలన ఏ పాపమూ లేదని మీరు అనుకుంటున్నారా?
కార్డినల్ డేనియౌ: కాదు, కాదు, కాదు. పాపం లేదు. పాపం లేదు. పాపం లేదు. సాధారణ జీవశాస్త్ర జీవితం పవిత్రం కాదని మేము భావిస్తున్నాము. అంటే, మానవ జీవితం, మానవ జీవితం పవిత్రమైనది. కానీ అటువంటి జీవితం, కాదు...
ప్రభుపాద: కానీ అది వ్యాఖ్యానము అని నేను భావిస్తున్నాను. యేసుక్రీస్తు సాధారణంగా ఇలా చెప్పాడు: "నీవు చంపకూడదు."
కార్డినల్ డేనియొ: అవును, యేసు చెప్పాడు... కానీ ఈ వాక్యము అలా లేదు, ఇది క్రీస్తు చెప్పినది కాదు. ఇది పాత నిబంధన యొక్క ఒక పాఠం, ఇది ఒక టెక్స్ట్...
ప్రభుపాద: కాదు, అది కొత్త నిబంధన కూడా.
కార్డినల్ డేనియౌ: పాత నిబంధన! పాత నిబంధన.
ప్రభుపాద: కాదు, అది కొత్త నిబంధనలో లేదా?.
కార్డినల్ డేనియొ: ఇది లెవిటిక్తో, లెవిటిక్తో, లెవిటిక్తో పుస్తకంలో ఉంది. ఇది యేసు యొక్క పదం కాదు. ఇది లెవిటిక్కు ఒక పదం, ఇది దేవుడు (మోసెసుకు) ఇచ్చిన పదినీతి ఆజ్ఞలలో భాగము భగవంతుడు మోసెసుకు ఇచ్చిన పది ఆజ్ఞలలో భాగము.
ప్రభుపాద: అది సరే. కానీ పది కమాండ్మెంట్స్, కమాండ్మెంట్స్లో ఒకటి: "నీవు చంప కూడదు."
యోగస్వారా: (స్పానిష్...)
కార్డినల్ డేనియౌ: (స్పానిష్...) (స్పానిష్...), అవును ఉంది, నేను పరిపూర్ణంగా అనుకుంటున్నాను, ఇది పరిపూర్ణంగా మనిషి యొక్క హత్య గురించి. భారతీయ ధర్మము లో అర్థం చేసుకోవడానికి నాకు చాలా కష్టముగా ఉంది ఎందుకు ... ఇది అసాధ్యం ఎందుకంటే... ఉదాహరణకు, ఇది అవసరం, (స్పానిష్...).
యోగస్వారా: ఆహారం కోసం.
కార్డినల్ డేనియౌ: (స్పానిష్...). ఆహారము కొరకు మనిషి తినడానికి, తినడానికి,..
ప్రభుపాద: మనిషి, ఆహార ధాన్యాలు, పండ్లు, పాలు, చక్కెర, గోధుమలు...తినవచ్చు
కార్డినల్ డేనియౌ: లేదు, కాదు, (స్పానిష్...)?
యోగస్వారా: మాంసం కాదా?
కార్డినల్ డేనియొ: మాంసం కాదా?
ప్రభుపాద: కాదు ఎందుకు? ఉదాహరణకు పండ్ల వలె. పండ్లు మానవులకు ఉద్దేశించబడ్డాయి. పులి మీ పండ్లు తినడానికి రాదు. కాబట్టి పులికి ఆహారము మరొక జంతువు. మనిషి యొక్క ఆహారం పండు, ఆహార ధాన్యాలు, పాల ఉత్పత్తులు. ఉదాహరణకు పండ్ల వలె ...
కార్డినల్ డేనియొ: ఎందుకు, ధాన్యం మరియు మొక్కలు కూడా జీవులు కాదా?
ప్రభుపాద: అది సరే, అది సరే. దానిని, మనము కూడా అర్థం చేసుకున్నాము. అయితే, మీరు జీవించగలిగితే... ఉదాహరణకు సాధారణంగా, నేను పండ్లు ధాన్యాలు పాలతో నివసించగలిగితే, నేను మరొక జంతువును ఎందుకు చంపాలి?