TE/Prabhupada 0982 - మనము ఒక కారుని పొందిన వెంటనే అది ఎంత చెత్తది అయినప్పటికీ, చాలా బాగుంది అని ఆనుకుంటాము

Revision as of 23:45, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


720905 - Lecture SB 01.02.06 - New Vrindaban, USA


మనము ఒక కారుని పొందిన వెంటనే అది ఎంత చెత్తది అయినప్పటికీ, మనం చాలా బాగుంది అని ఆనుకుంటాము కానీ భాగవతము చెప్తుంది yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke, నేను ఈ శరీరం కాదు. ఇది ఒక వాహనం. ఉదాహరణకు మనము ఒక కారును నడుపుతున్నప్పుడు, కారును నడుపుతున్నప్పుడు. నేను ఈ కారు కాదు. అదేవిధముగా, ఇది ఒక యంత్రము, కారు, యాంత్రికమైన కారు. కృష్ణుడు లేదా భగవంతుడు నాకు ఈ కారు ఇచ్చాడు, నాకు కావలెను. ఇది భగవద్గీతలో పేర్కొనబడింది, īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati ( BG 18.61) నా ప్రియమైన అర్జునా, పరమాత్మగా భగవంతుడు అందరి హృదయంలో కూర్చొని ఉన్నాడు. Bhrāmayan sarva-bhūtāni yantrārūḍhāni māyayā ( BG 18.61) ఆయన ప్రయాణం చేయడానికి జీవికి అవకాశం ఇస్తున్నాడు, తిరుగుతూ ఉండటానికి, సర్వ-భుతాని, "విశ్వమంతా". Yantrārūḍhāni māyayā, ఒక కారు నడుపుతున్నప్పుడు భౌతిక ప్రకృతి ఇచ్చిన కారును నడుపుతున్నప్పుడు. కాబట్టి మన వాస్తవమైన పరిస్థితి నేను ఆత్మను అని, నేను ఒక చక్కని కారు పొందినాను - ఇది ఒక చక్కని కారు కాదు, కానీ మనము ఒక కారును పొందిన వెంటనే, అది ఎంత చెత్తది అయినప్పటికీ, అది చాలా బాగుంది అని మనము అనుకుంటున్నాము, (నవ్వు) ఆ కారుతో మనము గుర్తుపడతాము. "నేను ఈ కారుని కలిగి ఉన్నాను, నాకు ఆ కారు ఉంది." ఒకరు మర్చిపోతారు... ఒక చాలా ఖరీదైన కారు నడుపుతూ ఉంటే, ఆయన ఒక పేద మనిషి అని తనను తాను మర్చిపోతాడు. ఆయన "నేను ఈ కారు." అని అనుకుంటాడు. ఇది గుర్తింపు.

కాబట్టి yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ ( SB 10.84.13) ఎవరైతే స్వయంగా ఈ శరీరాన్ని తనకు తానుగా భావిస్తాడో ఆ వ్యక్తి, శరీర సంబంధాలు, sva-dhīḥ, వారు నా స్వంత వారు. నా సోదరుడు, నా కుటుంబం, నా దేశం, నా సమాజం, నా వర్గము, చాలా విషయాలు, నా, నేను మరియు నాది. తప్పుడు అవగాహనతో శరీర సంబంధంలో "నేను" మరియు "నా" యొక్క Yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ ( SB 10.84.13) Bhauma ijya-dhīḥ, bhūmi, bhūmi అంటే భూమి Ijya-dhīḥ, ijya అంటే ఆరాధన అని అర్థం. కాబట్టి ప్రస్తుత సమయమున మనము "నేను ఈ శరీరము," అని చాలా గట్టిగా నమ్ముతున్నాము నేను అమెరికన్, మరియు " నేను ఇండియన్," "నేను ఐరోపియన్," "నేను హిందూ," "నేను ముస్లిం," నేను బ్రాహ్మణుడిని, "నేను క్షత్రియుడిని," "నేను శూద్రుడిని," "ఇది నేను, నేను..." చాలా ఉన్నాయి. ఇది చాలా బలంగా ఉంది bhauma ijya-dhīḥ,, ఎందుకంటే నేను ఒక నిర్దిష్టమైన శరీరముతో గుర్తిస్తున్నాను, ఎక్కడ నుండి ఈ శరీరం బయటకు వచ్చింది, ఈ భూమి ఆరాధించదగినది. అది జాతీయవాదం. కాబట్టి yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ ( SB 10.84.13) yat-tīrtha-buddhiḥ salile, తీర్థ, యాత్రా ధామము.

మనము వెళ్తున్నాము, నదిలో స్నానం చేస్తాము, క్రైస్తవులవలె, వారు జోర్డాన్ నదిలో స్నానం చేస్తారు, లేదా హిందువులు, వారు హరద్వార్ కు వెళ్తారు, గంగానది లేదా వృందావనములో స్నానం చేస్తారు, వారు స్నానం చేస్తారు. కానీ ఆ నీటిలో స్నానం చేయడం ద్వారా, ఆయన పని... ఆయన పని పూర్తయింది. కాదు వాస్తవానికి పని ఏమిటంటే అటువంటి తీర్థయాత్రలు, పవిత్ర స్థలాలు, అనుభవం, ఆధ్యాత్మిక పురోగతిని, కనుగొనేందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఎంతో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన అనేక మంది వ్యక్తులు అక్కడ నివసిస్తున్నారు. అందువలన అటువంటి స్థలాలకు వెళ్లి, అనుభవజ్ఞుడైన ఆధ్యాత్మిక వ్యక్తిని కనుగొనాలి, ఆయన నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఇది వాస్తవమునకు యాత్రలకు వెళ్ళటము అంటే. అంతే కానీ కేవలం వెళ్ళి స్నానము చేసి. పని పూర్తయ్యింది అని కాదు. కాదు

కాబట్టి

yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke
sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ
yat-tīrtha-buddhiḥ salile na karhicij
janeṣv abhijñeṣu...
(SB 10.84.13)

అభిజ్ఞే , ఎవరికైతే తెలుసో. (అస్పష్టముగా) మనము విషయాలు చాలా బాగా తెలిసిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి, అభిజ్ఞః . కృష్ణుడు అభిజ్ఞః , స్వరట్. అదేవిధముగా కృష్ణుడి ప్రతినిధి కూడా అభిజ్ఞః , సహజముగా. కృష్ణుడితో ఒకరు సహవాసం చేస్తే, కృష్ణుడితో ఒకరు మాట్లాడినట్లయితే, ఆయన చాలా అభిజ్ఞః అయి ఉండాలి, చాలా జ్ఞానము కలిగిన వాడు అయి ఉండాలి, ఎందుకంటే ఆయన కృష్ణుడి నుండి పాఠములు నేర్చుకున్నాడు. అందువలన... కృష్ణుడు జ్ఞానము పరిపూర్ణమైనది, అందువలన, ఆయన కృష్ణుడి నుండి జ్ఞానాన్ని తీసుకుంటాడు, ఆయన జ్ఞానం కూడా ఖచ్చితమైనది. అభిజ్ఞః. కృష్ణుడు మాట్లాడుతాడు. ఇది కల్పితమైనది కాదు, కాదు. కృష్ణుడు-నేను ఇప్పటికే చెప్పాను-కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చుని ఉన్నాడు ఆయన ప్రామాణికమైన వ్యక్తితో మాట్లాడతాడు. ఒక పెద్ద మనిషి లాగానే, ఆయన ఒక ప్రామాణికమైన వ్యక్తితో మాట్లాడతాడు, ఆయన తన సమయాన్ని అర్థంలేనివి మాట్లాడుతూ వృధా చేసుకోడు. ఆయన మాట్లాడుతాడు, అది వాస్తవము, కానీ ఆయన చెత్త వ్యక్తులతో మాట్లాడడు, ఆయన ప్రామాణికమైన ప్రతినిధితో మాట్లాడుతాడు. ఇది ఎలా తెలుస్తుంది? ఇది భగవద్గీతలో చెప్పబడింది, teṣāṁ satata-yuktānām ( BG 10.10) ఎవరు ప్రామాణికమైన ప్రతినిధితో వారితో.