TE/Prabhupada 0494 - నెపోలియన్ బలంగా తోరణాలు నిర్మించినాడు, కానీ ఆయన ఎక్కడకు వెళ్ళాడు, ఎవరికీ తెలియదు
Lecture on BG 2.14 -- Germany, June 21, 1974
అన్యథా రూపం అంటే లేకపోతే, ఉండటము లేక జీవించడము. లేకపోతే నేను ఆత్మ అని అర్థం. నాకు ఆధ్యాత్మిక శరీరం ఉంది. కానీ ఏదో ఒక మార్గము ద్వారా, సందర్భానుసారంగా, నా కోరిక ఆధారంగా, నేను కొన్నిసార్లు మానవ శరీరం, కొన్నిసార్లు కుక్క శరీరాన్ని పొందుతాను, కొన్ని సార్లు పిల్లి శరీరం, కొన్నిసార్లు చెట్టు శరీరం, కొన్నిసార్లు దేవతల యొక్క శరీరమును. వేర్వేరు 84,00,000 వివిధ రకాల శరీర రూపాలు ఉన్నాయి. నా కోరిక ప్రకారం నేను మారుతున్నాను. నా అంటురోగము ప్రకారం, కారణం గుణ - సంగస్య, ఇవి నిగూఢమైనవి. మానవుడికి అది నిజమైన జ్ఞానం, తాత్కాలిక ఆనందం కోసం ఏదో కనుగొనకూడదు. అది మూర్ఖత్వం. అది మూర్ఖత్వం, సమయం వృధా. ఈ ప్రస్తుత శరీరం యొక్క సుఖాల కోసం, ఒకవేళ మనం కనుగొంటే, నేను చాలా సౌకర్యంగా జీవిస్తాను, కానీ అయ్యా, మీరు సౌకర్యంగా జీవించటానికి, అనుమతించబడరు. మొదటిగా మీరు అర్థం చేసుకోండి. ఒక మనిషి చాలా మంచి ఇంటిని, చాలా బలమైన ఇంటిని నిర్మిస్తున్నాడని అనుకుందాం. అది ఏ పరిస్థితులలోనూ పడిపోదు. అది సరే, కానీ నీ కోసం నీవు ఏమి చేశావు, మీరు ఎన్నటికీ చనిపోరు మీరు దీనిని ఆనందిస్తారా? లేదు. ఉండనిమ్ము. నాకు చాలా బలంగా నిర్మించిన ఇల్లు కలదు. ఇల్లు ఉంటుంది. మీరు అక్కడకు వెళ్తారు. బలంగా నిర్మించిన దేశం. నెపోలియన్ బలంగా నిర్మించిన తోరణాలు నిర్మించినట్లుగానే, కానీ ఆయన ఎక్కడకు వెళ్ళాడు, ఎవరికీ తెలియదు. కాబట్టి భక్తి వినోద ఠాకురా ఇలా పాడాడు, జడ - విద్య జతో మాయార వైభవ తొమార భజనే బోధ. మనం భౌతిక ఆనందం లేదా భౌతిక పురోగతి అని పిలవబడుతున్న, వాటి పట్ల మనం ఎంత పురోగమిస్తే, మరింత మనము మన నిజమైన గుర్తింపును మర్చిపోతాము. ఇది ఫలితం.
కాబట్టి మనకు ఒక ప్రత్యేక కర్తవ్యము, నిజమైన కర్తవ్యము ఉన్నదనీ మనం అర్థం చేసుకోవాలి. అది ఆత్మ - సాక్షాత్కారముగా పిలువబడుతుంది, "నేను ఈ శరీరం కాదు." ఇది ఆత్మ - సాక్షాత్కారము. ఇది ప్రారంభంలో కృష్ణునిచే సూచించబడింది, "నీవు ఈ శరీరం కాదు." మొదటి అవగాహన, మొదటి జ్ఞానము, నేను ఈ శరీరాన్ని కాదు. నేను ఆత్మ. నాకు వేరే కర్తవ్యము ఉంది అని అర్థం చేసుకోవాలి. ఈ తాత్కాలిక పనులు లేదా కార్యములు కుక్క వలె, లేదా మానవుని వలె కాదు, లేదా పులిగా లేదా చెట్టుగా లేదా చేపగా, కార్యక్రమాలు ఉన్నాయి. ఆహార - నిద్ర - భయ - మైథునం చ. శారీరక అవసరాల యొక్క అదే సూత్రము. తినడం, నిద్ర, లైంగిక జీవితం మరియు రక్షణ. కానీ మానవ రూపంలో, నాకు ఒక ప్రత్యేక కర్తవ్యము ఉంది, ఆత్మ - సాక్షాత్కారము. ఈ శారీరక బంధనము నుండి బయటపడటం. దానిని జ్ఞానం అని పిలుస్తారు. ఈ జ్ఞానం లేకుండా, మనం ఏ జ్ఞానంలో పురోగమించినా, అది మూర్ఖత్వం, అంతే. శ్రమ ఏవ హి కేవలం ( SB 1.2.8)