TE/Prabhupada 0495 - నా కళ్ళు మూసుకుంటాను, నేను ప్రమాదము నుండి బయట పడతాను



Lecture on BG 2.14 -- Germany, June 21, 1974


Srama eva hi kevalam ( SB 1.2.8) శ్రమ ఏవ హి కేవలం అంటే వూరికే పనిచేయటం, నిష్ఫలంగా సమయం వృధా చేయటం. మీరు ప్రకృతి చట్టాన్ని మార్చలేరు. ఒకవేళ మీరు ఈ జీవితంలో గొప్ప నాయకుడు, ప్రధానమంత్రి, ప్రతీది అయితే. అది సరే, కానీ మీ మనస్తత్వం ప్రకారం మీరు తదుపరి జీవితాన్ని సృష్టించుకుంటున్నారు. కాబట్టి ఈ జీవితంలో మీరు ప్రధానమంత్రిగా ఉంటారు, తర్వాత జీవితంలో మీరు ఒక కుక్క గా మారతారు. అప్పుడు ప్రయోజనం ఎక్కడ ఉంది? కాబట్టి ఈ నాస్తిక మూర్ఖులు, వారు తరువాతి జీవితాన్ని తిరస్కరించాలి అనుకుంటారు. అది వారికి చాలా భయంకరమైనది. అది వారికి చాలా భయంకరమైనది. వారు తరువాతి జీవితాన్ని అంగీకరించినట్లయితే.... వారికి తెలుసు వారి జీవితము చాలా పాపమని. అప్పుడు ప్రకృతి చట్టాల ద్వారా వారు ఏ జీవితాన్ని పొందుతారు? వారు దాని గురించి ఆలోచించినప్పుడు, వారు కంపిస్తారు. "మంచిది దానిని తిరస్కరించండి. మంచిది దానిని తిరస్కరించండి". కేవలము ఒక కుందేలు వలె. శత్రువు తన ముందు ఉంది, ఇంక అతడు చనిపోతాడు, కానీ ఆలోచనలు, "నా కళ్ళు మూసుకుంటాను, నేను ప్రమాదము నుండి బయట పడతాను". ఇది నాస్తికత్వ దృక్పథం, వారు మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నారు అక్కడ ఉందని.... అందువల్ల వారు నిరాకరిస్తారు, "జీవితం లేదు". ఎందుకు కాదు? కృష్ణుడు చెప్పాడు, మీకు చిన్ననాటి శరీరం ఉంది, మీరు శిశు శరీరం కలిగి ఉన్నారు... ఆ శరీరం ఎక్కడ వుంది? మీరు దాన్ని వదిలేసారు. మీరు వేరే శరీరంలో ఉన్నారు. అదేవిధంగా, ఈ శరీరం మీరు మార్చుకుంటారు. మీరు మరొక శరీరాన్ని పొందుతారు. "ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పారు. అత్యంత ఉన్నతమైన ప్రామాణికం, ఆయన చెప్పారు. నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన చెప్పినపుడు... ఇది మన జ్ఞానం యొక్క పద్ధతి. మనము పరిపూర్ణ వ్యక్తి నుండి జ్ఞానం అంగీకరించాలి. నేను మూర్ఖుడిని అయి ఉండవచ్చు, కానీ పరిపూర్ణ వ్యక్తి నుండి పొందిన జ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది. ఇది మన పద్ధతి. కల్పన చేయుటకు ప్రయత్నించము. అది విజయవంతం అవ్వచ్చు లేదా కాకపోవచ్చు, కానీ మీరు పరిపూర్ణ ప్రామాణికం నుండి జ్ఞానాన్ని స్వీకరించినట్లయితే, ఆ జ్ఞానం సంపూర్ణంగా ఉంటుంది. మనము ఊహిస్తున్నట్లుగా, “నా తండ్రి ఎవరు"? మీరు మీ తండ్రి ఎవరు అని ఊహించవచ్చు, కానీ కల్పన మీకు సహాయం చేయదు. మీకు ఎప్పటికీ అర్థం కాదు మీ తండ్రి ఎవరు కానీ మీరు మీ తల్లి దగ్గరకు వెళ్తే, మహోన్నత ప్రామాణికం. ఆమె వెంటనే, "ఈయన మీ తండ్రి". అంతే. మీరు ఏ ఇతర విధంగా తండ్రిని తెలుసుకోలేరు. ఏ ఇతర మార్గం లేదు. ఇది ఆచరణాత్మక మైనది. మీరు మీ తండ్రిని తెలుసుకోలేరు, మీ తల్లి యొక్క ప్రామాణిక ప్రకటన లేకుండా. అదేవిధంగా, మీ అవగాహనకు మించిన విషయాలు, avan manasa-gocara, వీరు ఆలోచించలేరు, మీరు మాట్లాడలేరు. కొన్నిసార్లు వారు అంటారు, “భగవంతుని గురించి మాట్లాడలేము. భగవంతుని గురించి ఆలోచించబడలేము". అది సరైనది. కానీ భగవంతుడు మీ ముందుకు వచ్చి చెప్తే, "ఇక్కడ నేను ఉన్నాను", అప్పుడు కష్టం ఎక్కడ ఉంది? నేను అసంపూర్ణంగా ఉన్నాను. నాకు తెలియదు. ఫర్వాలేదు. కానీ భగవంతుడే నా ముందుకు వచ్చినట్లయితే.... (విరామం)