"కాబట్టి, ఈ భౌతిక జగత్తు మరియు ఆధ్యాత్మిక జగత్తు గురించి అనేక జ్ఞానములు కలవు. శ్రీమద్-భాగవతం రెండవ స్కందములో, ఆధ్యాత్మిక జగత్తు గురించి వివరణ పొందవచ్చును, దాని స్వభావము ఏమిటి, అక్కడ ఎలాంటి వ్యక్తులు ఉంటారు, వారి లక్షణాలు ఏమిటి - సవివరముగా తెలుపబడినది. ఆధ్యాత్మిక జగత్తులో, ఆధ్యాత్మిక విమానం ఉన్నట్లు మనకు సమాచారం లభిస్తుంది. మరియు అక్కడ జీవులు, ముక్తి పొందినవారు. వారు ఆ విమానంలో ఆధ్యాత్మిక జగత్తులో ప్రయాణించెదరు, మెరుపువలె ఇది చాలా బాగుండును. వారు మెరుపువలె ప్రయాణిస్తారు, అని వివరణ. కాబట్టి అన్నియు అక్కడ ఉండును. ఇది నకలు మాత్రమే. ఈ భౌతిక జగత్తు మరియు ప్రతిదీ, మీరు చూసేది-అన్ని నకిలీ, నీడ. ఇది నీడ."
|