TE/Prabhupada 0038 - జ్ఞానం వేదాల నుండి ఉద్భవించినది

Revision as of 18:25, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.1 -- Hong Kong, January 25, 1975

ఇప్పుడు, కృష్ణుడు ఉన్నాడు. మన దగ్గర కృష్ణుడి చిత్రము, కృష్ణుడి ఆలయం, ఎన్నో కృష్ణునివి ఉన్నాయి. అవి కల్పితము కాదు. అవి ఊహాజనితం కాదు. మాయావాది తత్వవేత్తలు అనుకుంటున్నట్లు, ఏంటంటే "మీ మెదడులోనే మీరు ఊహించుకోవచ్చు." లేదు. భగవంతుడిని ఊహించుకోలేము. అది మరొక మూర్ఖత్వం. భగవంతుడిని ఎలా ఊహించుకోవచ్చు? అప్పుడు భగవంతుడు మీ ఊహకు విషయం అవుతాడు. ఆయన ఎటువంటి పదార్ధం కాదు. అది భగవంతుడు కాదు. ఊహించుకున్నది, భగవంతుడు కాదు. భగవంతుడు మీ ముందు ఉన్నాడు, కృష్ణుడు. ఈ గ్రహం పైకి అయన వస్తాడు. తదాత్మానాం సృజామ్యహం, సంభవామి యుగే యుగే. కావున భగవంతుని చూసినవారి దగ్గర నుంచి మీరు సమాచారం తీసుకోవాలి.

తద్ విద్ధి ప్రణిపాతేన
పరిప్రస్నేన సేవయా
ఉపదేక్షంతి తే జ్ఞానం
జ్ఞానినాన్ తత్త్వ-దర్సినః
( BG 4.34)

తత్త్వ- దర్సినః. మీరు చూడనంత వరకు, నిజమైన సమాచారం ఇతరులకు ఎలా ఇవ్వగలరు? కావున భగవతుడు కనిపించాడు, చరిత్రలోనే చూడడం కాదు. చరిత్రలో, కృష్ణుడు ఈ గ్రహం మీద ఉన్నప్పుడు, కురుక్షేత్ర యుద్ధం యొక్క చరిత్రలో ఎక్కడైతే ఈ భగవద్గీత చెప్పబడిందో, అది చారిత్రక యదార్ధం. కావున చరిత్ర ద్వారా మరియు శాస్త్రాల ద్వారా భగవంతుడిని శ్రీ కృష్ణుడుని అర్ధము చేసుకోవచ్చు.

శాస్త్ర-చక్షుస. ఈ ప్రస్తుత క్షణం వలె, కృష్ణుడు భౌతికముగా లేడు, కానీ శాస్త్రము నుండి కృష్ణుడి అంటే ఏమిటి అని అర్థం చేసుకోవచ్చు. కావున శాస్త్ర- చక్షుస శాస్త్ర.. మీరు నేరుగా తెలుసుకోవచ్చు లేదా శాస్త్రము ద్వారా కూడా తెలుసుకోవచ్చు. నేరుగా తెలుసుకోవడం కన్నా శాస్త్రము ద్వారా తెలుసుకోవడం మంచిది. కావున మా జ్ఞానం, ఎవరైతే వేదముల సూత్రములు పాటిస్తున్నారో, వారి జ్ఞానం వేదములు నుండి ఉద్భవించింది. వారు ఎటువంటి జ్ఞానమును తయారు చేయరు. ఏదైతే వేదముల యొక్క ఆధారముతో అర్థం చేసుకున్నారో, అది సత్యము. కావున కృష్ణుడిని వేదముల ద్వారా అర్థం చేసుకోవాలి. వేదైశ్చ సర్వరహమైవ వేద్యః ( BG 15.15) అది భగవద్గీత లో పేర్కొనబడింది. మీరు కృష్ణుని గురించి ఊహించుకోలేరు. ఎవరైనా మూర్ఖుడు నేను ఊహించుకుంటున్నాను అని చెబితే, అది మూర్ఖత్వము. మీరు కృష్ణుడిని వేదముల ద్వారా చూడాలి. వేదైశ్చ సర్వరహమైవ వేద్యః ( BG 15.15) వేదములు చదవడం యొక్క లక్ష్యము అది. అందువలన దాన్ని వేదాంతము అని అంటారు. కృష్ణుడి గురించిన జ్ఞానము వేదాంతము.