TE/Prabhupada 0037 - ఎవరికైతే కృష్ణుడు తెలుసునో అతను గురువు



Lecture on BG 7.1 -- Hong Kong, January 25, 1975


మనము ఆ భగవంతుని శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి, అతని సృష్టి మరియు సృజనాత్మకమైన శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి, మరియు భగవంతుని శక్తి ఏంటి, ఆయన ప్రతి ఒక్కటి ఎలా చేస్తున్నాడు - అది కూడా గొప్ప శాస్త్రం. దాన్ని కృష్ణ శాస్త్రం అంటారు. కృష్ణ-తత్త్వ- జ్ఞాన్ ఏయ్ కృష్ణ-తత్త్వ-వేత్త, సేయ్ గురు హయ ( CC Madhya 8.128) చైతన్య మహాప్రభు గురువు అంటే ఎవరు అని చెప్తారు. గురువు అంటే ఏయ్ కృష్ణ-తత్త్వ-వేత్త, సేయ్ గురు హయ: ఎవరికైనా కృష్ణుడి గురించి తెలుస్తే, అతను గురువు. గురువును తయారు చేయలేము. వీలయినంత వరకు కృష్ణుడి గురించి తెలిసిన ఎవరైనా.. మనము కృష్ణుడి గురించి వంద శాతం తెలుసుకోలేము. అది సాధ్యం కాదు. కృష్ణుడి శక్తులు చాలా విధములు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే ( Cc. Madhya 13.65 purport) ఒక శక్తి ఒక విధంగా పని చేస్తోంది, మరొక శక్తి ఇంకో విధముగా పని చేస్తోంది. కానీ అవి అన్నీ కృష్ణుడి శక్తి. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. మాయాధ్యక్షేన ప్రకృతే సూయతే స-చరాచరం ( BG 9.10) ఈ ప్రకృతి.. ఈ ప్రకృతి నుంచి ఈ పువ్వు రావడం మనం చూస్తున్నాము, పువ్వు ఒక్కటే కాదు, చాలా ప్రకృతి నుంచి వస్తున్నాయి - విత్తనము ద్వారా. గులాబి విత్తనము నుంచి గులాబి చెట్టు, బేల విత్తనము నుండి బేల చెట్టు. కావున అది ఎలా జరుగుతోంది? ఒకే రకమైన భూమి, ఒకే రకమైన నీరు, మరియు విత్తనము కూడా ఒకే రకముగా ఉంటాయి, కానీ వేరే విధముగా బయటకు వస్తున్నాయి. అది ఎలా సాధ్యము? దాన్ని పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వభావికి జ్ఞాన. మాములు మనిషి లేదా శాస్త్రవేత్తగా చెప్పుకునే వ్యక్తి చెప్తారు, "ప్రకృతి వాటిని సృష్టిస్తోంది అని." కానీ వారికి తెలియదు ప్రకృతి అంటే ఏమిటో, ప్రకృతిని మరియు ప్రకృతి కార్యములకు ఎవరు పర్యవేక్షకుడో అని, ఈ భౌతిక ప్రపంచం, ఎలా పని చేస్తోంది.

అది భగవద్గీతలో చెప్పబడింది, మయాధ్యక్షేన ( BG 9.10) కృష్ణుడు చెప్తాడు, "నా పర్యవేక్షణలో ఈ ప్రకృతి పని చేస్తోంది." అది సత్యము. ప్రకృతి, పదార్థములు.. అవి వాటి అంతకు అవే మిళితం కాలేవు. ఈ ఆకాశ హార్మ్యాలు, అవి పదార్థములతో నిర్మించబడ్డాయి. కానీ పదార్థములు వాటి అంతకి అవే వచ్చి ఆకాశ హార్మ్యము అవ్వలేవు. అది సాధ్యం కాదు. ఒక చిన్న ఆధ్యాత్మిక ఆత్మ, ఇంజనీర్ లేదా శిల్పకర్త ఉన్నారు దాని వెనుక. అతను ఆ పదార్థములు తీసుకోని మరియు వాటిని అలంకరించి ఆకాశ హర్మ్యమును నిర్మిస్తాడు. అది మన అనుభవము. కావున మనము ఈ పదార్థములు వాటి అంతకు అవే పని చేస్తున్నాయి అని మనము ఎలా చెప్పగలము ? పదార్థములు వాటి అంతకు అవే పని చెయ్యలేవు. దానికి ఎక్కువ ఆలోచన, ఎక్కువ తెలివి అవసరము, అలాగే ఉన్నతమైన వారు ఈ భౌతిక ప్రపంచంలో మాదిరిగా మనకు సూర్యుడు ఉన్నతమైన వ్యక్తి , సూర్యుడు మరియు సూర్యుని కదలిక, సూర్యుడి యొక్క ఉష్ణ శక్తి, కాంతి శక్తి. ఎలా ఉపయోగించబడుతోంది? అది శాస్త్రములో చెప్పబడింది. యస్యాజ్ఞాయ భ్రమతి సంభ్ర్త-కల-చక్రో గోవిందం ఆది-పురుషం తమహం భజామి. సూర్యుని గ్రహము కూడా ఈ భూమి గ్రహము వంటిదే. ఈ గ్రహములో ఎందరో అధ్యక్షులు ఉండవచ్చు, కానీ పూర్వము ఒకే ఒక్క అధ్యక్షుడు ఉండేవాడు. అదే విధముగా, ప్రతి ఒక్క గ్రహములో ఒక అధ్యక్షుడు ఉంటాడు. సూర్యుని గ్రహములో, ఈ జ్ఞానము భగవద్గీత నుండి వస్తుంది. కృష్ణుడు చెప్తాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్త్వాన్ అహం అవ్యయం ( BG 4.1) నేను మొదటి సరిగా ఈ భగవద్గీత శాస్త్రాన్ని వివస్వాన్ కు ఉపదేశించాను. వివస్వాన్ అనగా సూర్య మండలానికి అధ్యక్షుడు, మరియు మనువు అతని పుత్రుడు. ఇది కాలము. ఈ కాలము నడుస్తోంది. దీన్ని వైవస్వత మను కాలము అంటారు. వైవస్వత అనగా వివస్వాన్ నుంచి, వివస్వాన్ యొక్క పుత్రుడు. అతన్ని వైవస్వత మనువు అని అంటారు