TE/Prabhupada 0059 - నేను శాశ్వతమైతే చాలా బాధాకరమైన జీవన పరిస్థితులు ఎందుకు వున్నాయి

Revision as of 15:50, 5 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0059 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 2.14 -- Mexico, February 14, 1975


అప్పుడు ప్రశ్న ఏమిటంటే: "నేను శాస్వతమైతే చాలా బాధాకరమైన జీవన పరిస్థితులు ఎందుకు వున్నాయి ఎందుకు నేను బలవంతంగా చనిపోవుతున్నాను కాబట్టి వాస్తవానికి తెలివైన ప్రశ్న: "నేను శాస్వతమైతే ఎందుకు నేను ఈ భౌతిక శరీరంలో వుండాలి. ఇ శరీరము జనన, మరణ, వృద్ధాప్యము మరియు వ్యాదులకు లోబడివున్నది జీవితంలో ఈ బాధాకరమైన పరిస్థితి బౌతిక శరీరం కారణము అని కృష్ణుడు బోధిస్తునాడు కామ్యకర్మిలు చేయువారు ఇంద్రియత్రుప్తిలో నిమగ్నిమైవుంటారు వారిని కామ్యకర్మిలు అని అంటాము కామ్యకర్మిలు, భవిష్యత్తు గురించి పట్టించుకోరు వారు కేవలం తక్షణ జీవన పరిస్థితులను గురించి ఆలోచిస్తారు. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా, రోజంతా అడుకుంటాడు మరియు జీవితం యొక్క భవిష్యత్తు గురించి పట్టించుకోడు, విద్యను నేర్చుకోడు కానీ మానవ జన్మలో, మనము నిజంగా తెలివైన వారమైతే జనన, మరణ, వృద్ధాప్యం, వ్యాధి లేని జీవితము లేదా శరీరంను పొందుటకు ప్రయత్నము చేస్తాను. కనుక కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క లక్ష్యం ప్రజలకు దీనిని అర్ధము అయేలా బోధించటము ఎవరైనా అడుగవచ్చును నేను కృష్ణ చైతన్యములో అంకితమైవుంటే నా బౌతిక అవసరాలు ఎలా తీరుతాయి కాబట్టి భగవద్గీత జవాబు చెబుతుంది, కేవలం కృష్ణా చైతన్యములో లో వున్నావ్యక్తి యొక్క, అవసరాలను కృష్ణడు చూసుకుంటాడు. కృష్ణడు ప్రతిఒక్కరి అవసరాలను చూసుకుంటున్నాడు Eko yo bahūnāṁ vidadhāti kāmān: "ఆ దేవాది దేవుడు అన్ని జీవుల యొక్క అవసరాలను తిరుస్తున్నాడు కాబట్టి భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ఒక భక్తుడుకి, ఏ కొరత ఉండదు నిశ్చితముగా వుండండి. కృష్ణుడు భగవద్గీతలో చేప్పుతున్నాడు teṣāṁ satata-yuktānāṁ yoga-kṣemaṁ vahāmy aham: (BG 9.22) నా సేవ లో ఎల్లప్పుడూ వున్నా నా భక్తుని అవసరాలను తీరుస్తాను ఒక ఆచరణాత్మకమైన ఉదాహరణ కృష్ణ చైతన్య ఉద్యమంలో, మాకు వంద కేంద్రాలను ఉన్నాయి, మరియు 25 నుండి, 250 వరకు భక్తులు ప్రతి ఆలయంలో నివసిస్తున్నారు. కాని మాకు ఏ స్థిరమైన ఆదాయం లేదు మరియు మేము నెలసరి అన్నిశాఖలు యందు ఎనభై వేల డాలర్లు ఖర్చు చేస్తాము. కానీ కృష్ణుడి దయ వలన మాకు కొరత లేదు, ప్రతిదీ అందించిన బడుతుంది ప్రజలు కొన్నిసార్లు ఆశ్చర్యపోతున్నారు: "ఈ వ్యక్తులు పని చేయరు అని, ఏ పని చెయ్యరు, వారు కేవలం హరే కృష్ణ మంత్రమును పఠిస్తారు. ఎలా వారు నివసిస్తున్నారు? " ఇది సమస్య కాదు. పిల్లులు మరియు కుక్కలు దేవుని దయ వలన బ్రతుకుతుంటే భక్తులు దేవుని దయ ద్వారా చాలా హాయిగా జీవించవచ్చు. అటువంటి ప్రశ్నే లేదు. కానీ ఎవరైనా ఆలోచించినట్లయితే: "నేను కృష్ణ చైతన్యమును తీసుకున్నాను. కానీ నేను అనేక విషయాలవలన బాధపడుతున్నాను, " వారికి లేదా మనందరికీ ఉపదేశము ఏమిటంటే mātrā-sparśās tu kaunteya śītoṣṇa-sukha-duḥkha-dāḥ: (BG 2.14) ఈ బాధ మరియు ఈ ఆనందాము శీతాకాలం మరియు వేసవి కాలము వంటివి . శీతాకాలంలో నీరు బాధాకరం, మరియు వేసవిలో నీరు ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి నీటి స్థానం ఏమిటి? ఇది ఆహ్లాదకరమ లేదా బాధాకరమ? ఇది బాధా కాదు లేదా ఆహ్లాదకరమైనది కాదు, కానీ కొన్ని ఋతువులలో చర్మం తాకడం వలన, అది బాధాగా లేదా ఆహ్లాదముగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నొప్పి మరియు ఆనందం గురించి ఇక్కడ వివరించబడినది. "అవి వచ్చి పోతాయి. అవి శాశ్వతమైనవి కావు" Āgama apāyinaḥ anityāḥ (BG 2.14) అంటే అవి వచ్చి పోతాయి. అవి శాశ్వతమైనవి కావు కృష్ణుడు అందువలన సలహా ఇస్తున్నాడు, tāṁs titikṣasva bhārata (BG 2.14): సహించుట నేర్చుకో కానీ మీ నిజమైన విధి, కృష్ణ చైతన్యమును మరిచిపోకండి. భౌతిక భాదలు మరియు ఆనందములను పట్టించుకోవద్దు