TE/Prabhupada 0059 - నేను శాశ్వతమైతే చాలా బాధాకరమైన జీవన పరిస్థితులు ఎందుకు వున్నాయి
Lecture on BG 2.14 -- Mexico, February 14, 1975

అప్పుడు ప్రశ్న ఏమిటంటే: "నేను శాశ్వతమైతే చాలా బాధాకరమైన జీవన పరిస్థితులు ఎందుకు వున్నాయి ఎందుకు నేను బలవంతంగా చనిపోతున్నాను కాబట్టి వాస్తవానికి తెలివైన ప్రశ్న: "నేను శాశ్వతమైతే ఎందుకు నేను ఈ భౌతిక శరీరంలో వుండాలి. ఈ శరీరము జనన, మరణ, వృద్ధాప్యము వ్యాదులకు సేవకునిగా వున్నది జీవితంలో ఈ బాధాకరమైన పరిస్థితికి భౌతిక శరీరం కారణము అని కృష్ణుడు బోధిస్తున్నాడు కామ్యకర్మలు చేయువారు ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై వుంటారు వారిని కామ్యకర్ములు అని అంటాము కామ్యకర్ములు , భవిష్యత్తు గురించి పట్టించుకోరు వారు కేవలం తక్షణ జీవన పరిస్థితులను గురించి ఆలోచిస్తారు. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా, రోజంతా ఆడుకుంటాడు జీవితం యొక్క భవిష్యత్తు గురించి పట్టించుకోడు, విద్యను నేర్చుకోడు కానీ మానవ జన్మలో, మనము వాస్తవమునకు తెలివైన వారమైతే జనన, మరణ, వృద్ధాప్యం, వ్యాధి లేని జీవితము లేదా శరీరమును పొందుటకు ప్రయత్నము చేస్తాము.

కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క లక్ష్యం ప్రజలకు దీనిని అర్థము అయ్యేలా ప్రచారము చేయడం కొందరు అడుగవచ్చును నేను కృష్ణ చైతన్యములో అంకితమైవుంటే నా భౌతిక అవసరాలు ఎలాా తీరుతాయి కాబట్టి భగవద్గీత జవాబు చెబుతుంది, కేవలం కృష్ణ చైతన్యములో వున్న వ్యక్తి యొక్క, అవసరాలను కృష్ణుడు చూసుకుంటాడు. కృష్ణడు ప్రతి ఒక్కరి అవసరాలను చూసుకుంటున్నాడు ఏకో యో బహునాం విదధాతి కామాన్ : "ఆ దేవాదిదేవుడు భగవంతుడు అన్ని జీవుల యొక్క అవసరాలను తీరుస్తున్నాడు కాబట్టి భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ఒక భక్తుడుకి, ఏ కొరత ఉండదు నిశ్చితముగా వుండండి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు తేషాం సతత యుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ( BG 9.22) నా సేవ లో ఎల్లప్పుడూ వున్న నా భక్తుని అవసరాలను తీరుస్తాను ఒక ఆచరణాత్మకమైన ఉదాహరణ కృష్ణ చైతన్య ఉద్యమంలో, మనకు వంద కేంద్రాలు ఉన్నాయి, 25 నుండి, 250 వరకు భక్తులు ప్రతి ఆలయంలో నివసిస్తున్నారు. కానీ మనకు ఏ స్థిరమైన ఆదాయం లేదు మనము నెలసరి అన్ని శాఖల యందు ఎనభై వేల డాలర్లు ఖర్చు చేస్తాము. కానీ కృష్ణుడి దయ వలన మనకు కొరత లేదు, ప్రతిదీ అందించబడుతుంది ప్రజలు కొన్నిసార్లు ఆశ్చర్యపోతున్నారు: "ఈ వ్యక్తులు పని చేయరు అని, ఏ పని చెయ్యరు, వారు కేవలం హరే కృష్ణ మంత్రమును పఠిస్తారు. ఎలా వారు నివసిస్తున్నారు? " ఇది సమస్య కాదు. పిల్లులు కుక్కలు భగవంతుని దయ వలన బ్రతుకుతుంటే భక్తులు భగవంతుని దయ ద్వారా చాలా హాయిగా జీవించవచ్చు.

అటువంటి ప్రశ్నే లేదు. కానీ కొంత మంది ఆలోచించినట్లయితే: "నేను కృష్ణ చైతన్యమును తీసుకున్నాను. కానీ నేను అనేక విషయాల వలన బాధపడుతున్నాను, " వారికి లేదా మనందరికీ ఉపదేశము ఏమిటంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయా శీతోష్ణ సుఖ దుఃఖదాః ( BG 2.14) ఈ బాధ ఈ ఆనందము శీతాకాలం వేసవి కాలము వంటివి. శీతాకాలంలో నీరు బాధాకరం, వేసవిలో నీరు ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి నీటి పరిస్థితి ఏమిటి? ఇది ఆహ్లాదకరమా లేదా బాధాకరమా? ఇది బాధా కాదు లేదా ఆహ్లాదకరమైనది కాదు, కానీ కొన్ని ఋతువులలో చర్మాన్ని తాకడం వలన, అది బాధగా లేదా ఆహ్లాదముగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నొప్పి ఆనందం గురించి ఇక్కడ వివరించబడినది. "అవి వచ్చి పోతాయి. అవి శాశ్వతమైనవి కావు" ఆగమాపాయినః అనిత్య ( BG 2.14) అంటే అవి వచ్చి పోతాయి. అవి శాశ్వతమైనవి కావు అందువలన కృష్ణుడు సలహా ఇస్తున్నాడు, తాంస్తితిక్షస్వ భారత ( BG 2.14) సహించుట నేర్చుకో కానీ మీ వాస్తవమైన కర్తవ్యము, కృష్ణ చైతన్యమును మరిచిపోకండి. భౌతిక బాధలు ఆనందములను పట్టించుకోవద్దు