TE/Prabhupada 0067 - గోస్వాములు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవారు

Revision as of 14:28, 7 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0067 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 1.16.26-30 -- Hawaii, January 23, 1974

ఏమైనప్పటికీ కృష్ణ చైతన్య ఉద్యమం, ముందుకు సాగుతోంది అంటే అది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉదార కరుణ కారణము. ఈ కలి యుగాములో బాధపడుతున్న ప్రజలకు. కృష్ణ భక్తునిగా మారడం సులభం కాదు, సులభం కాదు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కనికరంతో కృష్ణ భక్తునిగా మారడానికి అవకాశం వచ్చినది, ఎవ్వరు ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. అది ఆత్మహత్య వంటిది. పతనమవవద్దు. అది చాలా సులభం. కేవలము హరే కృష్ణ మంత్రం జపిస్తూ, ఎల్లప్పుడూ, ఇరవై నాలుగు గంటల, చైతన్య మహాప్రభు సిఫార్సు, kīrtanīyaḥ sadā hariḥ (CC Adi 17.31), ఎల్లప్పుడూ జపము చేయుట. ఇది సూత్రము. కానీ మనము అలా చేయము, ఎందుకంటే మనము కలి యొక్క ప్రభావముతో మనం ఎంతో పతనమవుతున్నాము కనీసం పదహారు మాలల జపము చేయండి. దీన్ని వదిలవేయవద్దు. దీన్ని వదిలవేయవద్దు ఇబ్బంది ఏమిటి, పదహారు మాలలు చేయటానికి. దాదాపు రెండు గంటలు పడుతుంది. మీకు ఇరవై నాలుగు గంటల ఉన్నాయి. మీరు నిద్ర పోవాలనుకుంటే. సరే పది గంటల నిద్ర, పొండి. ఇది సూచించ బడలేదు. ఆరు గంటలకు పైగా నిద్ర పోవదు. కానీ వారు నిద్ర పోవాలని కోరుకుంటున్నారు. వారు ఇరవై నాలుగు గంటలు నిద్రించాలనుకుంటున్నారు. అది కలి యుగములో వారి కోరిక. అప్పుడు మీరు సమయం వృధా చేస్తున్నారు. తినడం , నిద్రపోవటము, సంభోగం చేయుట మరియు రక్షించుకొనుట తగ్గించుకోండి ఇవి సున్న అయినప్పుడు, అది పరిపూర్ణత.

ఎందుకంటే ఇవి శారీరక అవసరాలు. తినడం, నిద్ర, సంభోగం, శారీరక అవసరాలు. నేను ఈ శరీరం కాదు. Dehino 'smin yathā dehe kaumāram... (BG 2.13). అయితే ఇది గుర్తించడానికి సమయం పడుతుంది. మనము మన విధి గురించి అవగాహన కలిగి ఉండాలి. కానీ మనము నిజంగా కృష్ణ చైతన్యములో పురోభివృద్ధి చెందినప్పుడు మనము మన విధి గురించి అవగాహన కలిగి ఉండాలి. ఆరు గంటల కన్నా ఎక్కువ నిద్ర పోకూడదు. నియంత్రించలేని వారు ఎనిమిది గంటల కంటే నిద్ర పోకూడదు. కానీ పది గంటల, పన్నెండు గంటలు, పదిహేను గంటల, నిద్రపోవటము అప్పుడు ఉపయోగం ఏమిటి? ఎవరో ఒకడు ఉన్నత భక్తుని చూడటానికి వెళ్ళాడు. అతను తొమ్మిది గంటలకు అతను నిద్రిస్తున్నాడు. అతడు ఒక ఉన్నత భక్తుడా? ఎలా? కాబట్టి ఏమిటి ? ఆయన ఏ విధమైన భక్తుడు? భక్తుడు ఉదయాన్నే నాలుగు గంటలకు ముందే నిద్ర లేవాలి. ఐదు గంటలప్పటికి , అతను తన స్నానం మరియు ఇతర విషయాలు పూర్తి చేయాలి. అప్పుడు అతను జపము చేయవలెను తరువాత చాలా సేవలు ఇరవై నాలుగు గంటల సేవ ఉండాలి. నిద్ర పోవడము మంచిది కాదు. గోస్వాములు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయారు. నేను కూడా రాత్రి పుస్తకాలు వ్రాసి నేను కూడా మూడు గంటల కంటే ఎక్కువ నిద్రపోను. కానీ నేను కొన్నిసార్లు కొంచం ఎక్కువ నిద్ర పోతాను నేను గోస్వామిలను అనుకరించడం లేదు. అది సాధ్యం కాదు. కానీ వీలైనంతవరకూ, నివారించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. మనము ఆహారము తీసుకొనుట తగించుకుంటే నిద్ర తగ్గుతుంది తినడం, నిద్రపోవటము. తినడం తరువాత, నిద్రిపోవటము. మనము ఎక్కువ తిoటే, ఎక్కువ నిద్ర వస్తుంది. మనము తక్కువ తిoటే, తక్కువ నిద్ర వస్తుంది. తినడం, నిద్రపోవడము, సంభోగం చేయడము. మరియు సంభోగం చేయడము పూర్తిగా మానివేయవలెను ఇది ఒక గొప్ప నిషేధం. లైంగిక జీవితం వీలైనంత వరకు తగ్గించాలి. అందువల్ల ఈ నియమము వుంది, "అక్రమ లైంగిక సంబంధం వద్దు" సెక్స్ జీవితం, కావాలని మనము చెప్పడములేదు, "మీరు చేయవద్దు." ఎవరూ చేయవద్దు. కాబట్టి సెక్స్ జీవితం అంటే వైవాహిక జీవితంలోనే, ఒక చిన్న రాయితీ. లైసెన్స్, "సరే, మీరు ఇ అనుమతిని తీసుకోండి." కానీ అక్రమ లైంగిక జీవితము వద్దు. అప్పుడు మీరు ఎప్పటికీ భక్తి చేయలేరు.

కావున తినడం, నిద్రపోవడము, సంభోగం చేయడము మరియు రక్షించుకోవటము మరియు రక్షించడానికి, మనము అనేక విధాలుగా మనము రక్షించడానికి, కానీ ఇప్పటికీ, యుద్ధo ఉంది, మరియు భౌతిక ప్రకృతి యొక్క దాడి మీ దేశం బాగా రక్షిస్తుంది. కానీ ఇప్పుడు పెట్రోల్ను తీసివేయబడుతుంది. మీరు రక్షించలేరు. అదేవిధంగా, ప్రతిదీ ఏ సమయంలోనైన తీసివేయబడుతుంది కాబట్టి కృష్ణునిపై ఆధారపడoడి, రక్షణ కొరకు. Avaśya rakṣibe kṛṣṇa. ఇది శరణాగతి శరణాగతి, అనగా ... కృష్ణుడు చెప్తాడు, "నీవు నాకు శరణు పొందు. sarva-dharmān parityajya (BG 18.66). ఇది నమ్ముదాము. కృష్ణుడు తనకి శరణాగతి పొందాలని అడుగుతున్నాడు.. శరణాగతి పొందుదాము. కృష్ణుడు నన్ను ప్రమాదంనుండి కాపాడుతాడు. దీనిని శరణాగతి అంటారు