TE/Prabhupada 0067 - గోస్వాములు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవారు



Lecture on SB 1.16.26-30 -- Hawaii, January 23, 1974

ఏమైనప్పటికీ కృష్ణ చైతన్య ఉద్యమం,ముందుకు సాగుతోంది అంటే అది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉదార కరుణ కారణము. ఈ కలి యుగములో బాధపడుతున్న ప్రజలకు. కృష్ణుడి భక్తులుగా మారడం సులభం కాదు, సులభం కాదు. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కనికరంతో కృష్ణుడి భక్తునిగా మారడానికి అవకాశం వచ్చినది, ఎవ్వరూ ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. అది ఆత్మహత్య వంటిది. పతనమవ్వవద్దు. అది చాలా సులభం. కేవలము హరే కృష్ణ మంత్రం జపిస్తూ, ఎల్లప్పుడూ, ఇరవై నాలుగు గంటలు, చైతన్య మహా ప్రభు సిఫార్సు చేసినట్లుగా, కీర్తనీయః సదా హరిః ( CC Adi 17.31) ఎల్లప్పుడూ జపము చేయండి. ఇది సూత్రము. కానీ మనము అలా చేయము, ఎందుకంటే మనము కలి యొక్క ప్రభావముతో మనం ఎంతో నిమగ్నము అయినాము కనీసం పదహారు మాలలు జపము చేయండి. చేయకుండా ఉండవద్దు, చేయకుండా ఉండవద్దు. ఇబ్బంది ఏమిటి, పదహారు మాలలు చేయటానికి. దాదాపు రెండు గంటలు తీసుకుంటుంది మీకు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి. మీరు నిద్ర పోవాలనుకుంటే. సరే పది గంటలు నిద్ర పొండి. ఇది సూచించ బడలేదు. ఆరు గంటలకు పైగా నిద్ర పోవద్దు. కానీ వారు నిద్ర పోవాలని కోరుకుంటున్నారు. వారు ఇరవై నాలుగు గంటలు నిద్రించాలనుకుంటున్నారు. అది కలి యుగములో వారి కోరిక. అప్పుడు మీరు సమయం వృధా చేస్తున్నారు. తినడం, నిద్రపోవటము, సంభోగము చేయడము, రక్షించుకొనుట తగ్గించుకోండి. ఇవి సున్నా అయినప్పుడు, అది పరిపూర్ణము.

ఎందుకంటే ఇవి శారీరక అవసరాలు. తినడం, నిద్ర పోవడము, సంభోగము చేయడము, శారీరక అవసరాలు. నేను ఈ శరీరం కాదు. దేహినోస్మిన యథా దేహే కౌమారం... ( BG 2.13) అయితే ఇది గుర్తించడానికి సమయం పడుతుంది. కానీ మనము వాస్తవమునకు కృష్ణ చైతన్యములో పురోభివృద్ధి చెందినప్పుడు మనము మన కర్తవ్యము గురించి అవగాహన కలిగి ఉండాలి. ఆరు గంటలు కన్నా ఎక్కువ నిద్ర పోకూడదు. నియంత్రించలేని వారు ఎనిమిది గంటలు కంటే నిద్ర పోకూడదు. కానీ పది గంటలు, పన్నెండు గంటలు, పదిహేను గంటలు, నిద్రపోవటము అప్పుడు ఉపయోగం ఏమిటి? ఎవరో ఒకడు ఉన్నత భక్తుని చూడటానికి వెళ్ళాడు. ఆయన తొమ్మిది గంటలకు ఆయన నిద్రిస్తున్నాడు. అతడు ఒక ఉన్నత భక్తుడు ఎలా? కాబట్టి ఏమిటి...? ఆయన ఏ విధమైన భక్తుడు? భక్తుడు ఉదయాన్నే నాలుగు గంటలకు ముందే నిద్ర లేవాలి. ఐదు గంటలప్పటికి, ఆయన తన స్నానం ఇతర విషయాలు పూర్తి చేయాలి. అప్పుడు ఆయన జపము చేయవలెను తరువాత చాలా సేవలు ఇరవై నాలుగు గంటలు సేవ ఉండాలి. నిద్ర పోవడము మంచిది కాదు. గోస్వాములు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయారు. నేను కూడా రాత్రి పుస్తకాలు వ్రాసి నేను కూడా మూడు గంటల కంటే ఎక్కువ నిద్రపోను. కానీ నేను కొన్నిసార్లు కొంచెం ఎక్కువ నిద్ర పోతాను నేను గోస్వామిలను అనుకరించడం లేదు. అది సాధ్యం కాదు. కానీ వీలైనంతవరకూ, నివారించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. మనము ఆహారము తీసుకొనుట తగించుకుంటే నిద్ర తగ్గుతుంది తినడం, నిద్రపోవటము. తినడం తరువాత, నిద్రిపోవటము. మనము ఎక్కువ తింటే, ఎక్కువ నిద్ర వస్తుంది. మనము తక్కువ తింటే, తక్కువ నిద్ర వస్తుంది. తినడం, నిద్రపోవడము, సంభోగము చేయడము. సంభోగము చేయడము పూర్తిగా మానివేయవలెను ఇది ఒక గొప్ప నిషేధం. లైంగిక జీవితం వీలైనంత వరకు తగ్గించాలి. అందువల్ల ఈ నియమము వుంది, "అక్రమ లైంగిక సంబంధం వద్దు" మైథునజీవితం, "మీరు చేయకూడదు. అని చెప్పము " ఎవరూ చేయకూడదు. కాబట్టి మైథునజీవితం అంటే వైవాహిక జీవితంలోనే, ఒక చిన్న రాయితీ. ఒక లైసెన్స్, "సరే, మీరు ఈ అనుమతిని తీసుకోండి." కానీ అక్రమ లైంగిక జీవితము వద్దు. అప్పుడు మీరు ఎప్పటికీ భక్తి చేయలేరు.

తినడం, నిద్రపోవడము, సంభోగము చేయడము రక్షించుకోవటము రక్షించడానికి, మనము అనేక విధాలుగా రక్షించు కుంటున్నాము, కానీ ఇప్పటికీ, యుద్ధం ఉంది, భౌతిక ప్రకృతి యొక్క దాడి వుంది మీ దేశం బాగా రక్షిస్తుంది. కానీ ఇప్పుడు పెట్రోలు తీసివేయబడుతుంది. మీరు రక్షించుకోలేరు. అదేవిధముగా, ప్రతిదీ ఏ సమయంలోనైనా తీసివేయబడుతుంది కాబట్టి కృష్ణుడిపై ఆధారపడండి, రక్షణ కొరకు. ఆవశ్య రక్షిబే కృష్ణ. ఇది శరణాగతి శరణాగతి, అనగా... కృష్ణుడు చెప్తాడు, "నీవు నాకు శరణు పొందు. సర్వ ధర్మాన్ పరిత్యజ్య ( BG 18.66) ఇది నమ్ముదాము. కృష్ణుడు తనకి శరణాగతి పొందాలని అడుగుతున్నాడు.. శరణాగతి పొందుదాము. కృష్ణుడు నన్ను ప్రమాదం నుండి కాపాడుతాడు. దీనిని శరణాగతి అంటారు