TE/Prabhupada 0068 - ఈ భౌతిక శరీరాన్ని పొందిన వారు ఎవరైనా పనిచేయాలి

Revision as of 09:40, 11 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0068 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 6.1.45 -- Laguna Beach, July 26, 1975


నితాయ్: ఈ జీవితంలో, ఒక వ్యక్తి తాను చేస్తున్న విభిన్న చర్యలకు తగ్గట్లుగా ధార్మికమైన లేదా అధార్మికమైన పనులను తరువాతి జీవితంలో కూడా అదే స్థాయిలో అదే వ్యక్తి, అదే రకముగా, తన కర్మల యొక్క ఫలితాన్ని తానే ఆనందిoచాలి లేదా బాధపడాలి. " ప్రభుపద:

yena yāvān yathādharmo
dharmo veha samīhitaḥ
sa eva tat-phalaṁ bhuṅkte
tathā tāvad amutra vai
(SB 6.1.45)

కాబట్టి మునుపటి శ్లోకాములో మనము చర్చించాము, dehavān na hy akarma-kṛt. ఈ భౌతిక శరీరాన్ని పొందిన వారు ఎవరైనా పనిచేయాలి. అందరూ పని చేయాలి. ఆధ్యాత్మిక శరీరంలో కూడా మీరు పని చేయాలి. భౌతిక శరీరంలో కూడా మీరు పని చేయాలి. ఎందుకంటే పని చేయటమనేది ఆత్మ యొక్క సూత్రం ఆత్మకు జీవిత శక్తి ఉంది అందువలన అది బిజీగా ఉంటుంది. జీవమున్న శరీరంలో కదలిక ఉంటుంది. పని ఉంటుంది. అతను కాలిగా కూర్చోని ఉండలేడు. భగవద్-జితాలో ఇలా చెప్పబడింది, ఒక్క క్షణం కూడా పనిచేయకుండ ఉండలేదు. ఇది జీవన లక్షణం. మనము చేస్తున్న పని ప్రత్యేకముగా మన శరీరం ప్రకారం ఉంటుంది కుక్క కూడా పరిగెడుతోంది, మరియు ఒక మనిషి కూడా పరిగెడుతున్నాడు. కానీ ఒక మనిషి అతను చాలా నాగరికతతో ఉన్నాడు అని భావిస్తాడు. ఎందుకంటే అతను మోటారు కారులో పరిగెడున్నాడు. వారిద్దరూ పరిగెడుతున్నారు, కానీ మనిషి ఒక ప్రత్యేకమైన శరీరానికి కలిగియున్నాడు అతను ఒక వాహనం లేదా సైకిల్ను సిద్ధంగా చేసుకొని పరిగెత్తవచ్చు. అతను "నేను కుక్క కంటే ఎక్కువ వేగంతో పరిగెడుతున్నాను, కనుక నాకు నాగరికత ఉంది అని అనుకుంటాడు" ఇది ఆధునిక మనస్తత్వం. అతనికి తెలియదు ఇ పరుగుల మధ్య తేడా ఏమిటి యాభై మైళ్ళు వేగం లేదా ఐదు మైళ్ళ వేగం లేదా ఐదు వేల మైళ్ళు వేగం లేదా ఐదు మిలియన్ల మైళ్ల వేగం. " అంతరిక్షము అపరిమితంగా ఉంది. మీరు ఎంత వేగముతో ప్రయాణము చేయుట కనుగొన్నా అది ఎప్పటికీ సరిపోదు. ఎప్పటికీ సరిపోదు." కనుక ఇది జీవితం కాదు, "నేను కుక్క కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తగలను, అందుచే నేను నాగరికము అనుట సరికాదు

panthās tu koṭi-śata-vatsara-sampragamyo
vāyor athāpi manaso muni-puṅgavānāṁ
so 'py asti yat-prapada-sīmny avicintya-tattve
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(Bs. 5.34)

మన వేగము ... వేగం దేని కోసము? ఎందుకంటే మనము ఫలానా గమ్యానికి చేరాలనికుంటున్నాము. అది అతని వేగం. కాబట్టి నిజమైన గమ్యం గోవింద, విష్ణువు. మరియు na te viduḥ svārtha-gatiṁ hi viṣṇu. వారు వేర్వేరు వేగంతో పరిగెడుతున్నారు, కానీ వారి గమ్యస్థానం ఏమిటో తెలియదు. మా దేశంలో ఒక పెద్ద కవి, రవీంద్రనాథ్ టాగోర్, అతను ఒక వ్యాసం రాశారు - నేను చదివాను - అయిన లండన్లో ఉన్నప్పుడు. మీ దేశంలో, పశ్చిమ దేశాలలో, కారు మరియు ..., వారు అధిక వేగంతో వెళ్లుతారు. కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్, అయిన ఒక్క కవి. అయిన ఆలోచిస్తున్నారు "ఈ ఆంగ్లేయుల దేశం చాలా చిన్నది,వారు చాలా గొప్ప వేగంతో పరిగెడుతు వారు సముద్రంలో పడిపోతారు" అయిన ఆలా పేర్కొన్నారు. ఎందుకు వారు వేగంగా పరిగెడుతున్నారు? అదేవిధంగా, మనము నరకానికి వెళ్ళటానికి చాలా వేగంగా పరిగేడుతున్నాము ఇది మన స్థానము. ఎందుకంటే, గమ్యం ఏమిటి అనేది మనకు తెలియదు. నాకు గమ్యము ఏమిటో తెలియదు మరియు పూర్తి వేగంతో నా కారును నడపడానికి నేను ప్రయత్నించినట్లయితే, ఫలితమేమిటి? ఫలితంగా విపత్తుగా ఉంటుంది. మనము ఎందుకుపరిగేడుతున్నమో మనము తప్పక తెలుసుకోవాలి. నదీ గొప్ప వరదతో ప్రవహిస్తుంది, కానీ గమ్యం సముద్రము నది సముద్రంలోకి వచ్చినప్పుడు, దానికి గమ్యం ఉండదు. అదేవిధంగా, మనము గమ్యం ఏమిటో తెలుసుకోవాలి. మన గమ్యం విష్ణువు, దేవుడు. మనము దేవునిలో భాగం. ఏదో ఒక విదముగా మనము ఈ భౌతిక ప్రపంచములోనికి పడిపోయాము. అందువల్ల మన జీవిత గమ్యస్థానం తిరిగి ఇంటికి వెళ్ళుట. దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళటము ఆది మన గమ్యము. ఇంకొక గమ్యము లేదు. కృష్ణ చైతన్య ఉద్యమం బోధిస్తుంది. మీరు మీ జీవితం యొక్క లక్ష్యాన్ని నిర్దేసించుకోండి. మరియు జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? "ఇంటికి తిరిగి వెళ్ళుట, దేవునిదగ్గరకు తిరిగి వెళ్ళుట. మీరు వెళ్ళావల్సిన దానికి, వ్యతిరేక దశలో వెళుతున్నారు. నరకము వైపుకి. ఇది మీ గమ్యం కాదు. మీరు ఇటు వైపుకు తిరిగి దేవుని దగ్గరకు తిరిగిరండి " ఇది మా ప్రచారము.