TE/Prabhupada 0068 - ఈ భౌతిక శరీరాన్ని పొందిన వారు ఎవరైనా పనిచేయాలి



Lecture on SB 6.1.45 -- Laguna Beach, July 26, 1975

నితాయ్: ఈ జీవితంలో, ఒక వ్యక్తి తాను చేస్తున్న విభిన్న కార్యక్రమాలకు తగ్గట్లుగా ధార్మికమైన లేదా అధార్మికమైన పనులను తరువాతి జీవితంలో కూడా అదే స్థాయిలో అదే వ్యక్తి, అదే రకముగా, తన కార్యక్రమాల యొక్క ఫలితాన్ని తానే ఆనందించాలి లేదా బాధపడాలి." ప్రభుపాద:

యేన యావాన్ యథాధర్మో
ధర్మో వేహ సమీహితః!
స ఏవ తత్ఫలం భుంక్తే
తథా తావదముత్ర వై
( SB 6.1.45)

కాబట్టి మునుపటి శ్లోకములో మనము చర్చించాము, దేహవాన్ న హి అకర్మ కృత్. ఈ భౌతిక శరీరాన్ని పొందిన వారు కొంత మంది పనిచేయాలి. అందరూ పని చేయాలి. ఆధ్యాత్మిక శరీరంలో కూడా మీరు పని చేయాలి. భౌతిక శరీరంలో కూడా మీరు పని చేయాలి. ఎందుకంటే పని చేయటమనేది ఆత్మ యొక్క సూత్రం ఆత్మకు జీవిత శక్తి ఉంది అందువలన అది బిజీగా ఉంటుంది. జీవమున్న శరీరంలో ఉద్యమము ఉంటుంది. పని ఉంటుంది. ఆయన ఖాళీగా కూర్చోని ఉండలేదు. భగవద్గీతలో ఇలా చెప్పబడింది, ఒక్క క్షణం కూడా పనిచేయకుండ ఉండలేదు. ఇది జీవన లక్షణం. మనము చేస్తున్న పని ప్రత్యేకముగా మన శరీరం ప్రకారం ఉంటుంది కుక్క కూడా పరిగెడుతోంది, ఒక మనిషి కూడా పరిగెడుతున్నాడు. కానీ ఒక మనిషి ఆయన చాలా నాగరికతతో ఉన్నాడు అని భావిస్తాడు. ఎందుకంటే ఆయన మోటారు కారులో పరిగెడుతున్నాడు. వారిద్దరూ పరిగెడుతున్నారు, కానీ మనిషి ఒక ప్రత్యేకమైన శరీరాన్ని కలిగియున్నాడు ఆయన ఒక వాహనం లేదా సైకిల్ ను సిద్ధంగా చేసుకొని పరిగెత్తవచ్చు. ఆయన "నేను కుక్క కంటే ఎక్కువ వేగంతో పరిగెడుతున్నాను, నాకు నాగరికత ఉంది అని అనుకుంటాడు" ఇది ఆధునిక మనస్తత్వం. ఆయనకి తెలియదు ఈ పరుగుల మధ్య తేడా ఏమిటి యాభై మైళ్ళు వేగం లేదా ఐదు మైళ్ళ వేగం లేదా ఐదు వేల మైళ్ళు వేగం లేదా ఐదు మిలియన్ల మైళ్ల వేగం. అంతరిక్షము అపరిమితంగా ఉంది. మీరు ఎంత వేగముతో ప్రయాణము చేయుట కనుగొన్న అది ఎప్పటికీ సరిపోదు. ఎప్పటికీ సరిపోదు."

ఇది జీవితం కాదు, "నేను కుక్క కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తగలను, అందుచే నేను నాగరికము అనుట సరికాదు

పంథాస్తు కోటి శతవత్సరసంప్రగమ్యో
వాయోరథాపి మనసో మునిపుంగవానామ్
స్యోఽప్యస్తి యత్ప్రపదసీమ్న్యవిచింత్యతత్త్వే
గోవిందమాదిపురుషం తమహం భజామి
(Bs. 5.34)

మనః వేగము... వేగం దేని కోసము? ఎందుకంటే మనము ఫలానా గమ్యానికి చేరాలకుంటున్నాము. అది ఆయన వేగం. కాబట్టి వాస్తవమైన గమ్యం గోవింద, విష్ణువు. న తే విధుః స్వార్థ గతిః విష్ణు. వారు వేర్వేరు వేగంతో పరిగెడుతున్నారు, కానీ వారి గమ్యం పరిస్థితి ఏమిటో తెలియదు. మా దేశంలో ఒక గొప్ప కవి, రవీంద్రనాథ్ ఠాగోర్, ఆయన ఒక వ్యాసం రాశారు - నేను చదివాను - ఆయన లండన్లో ఉన్నప్పుడు. మీ దేశంలో, పశ్చిమ దేశాలలో, కారులో..., వారు అధిక వేగంతో వెళ్లుతారు. కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయన ఒక కవి. ఆయన ఆలోచిస్తున్నారు ఈ ఆంగ్లేయుల దేశం చాలా చిన్నది, వారు చాలా గొప్ప వేగంతో పరిగెడుతున్నవారు సముద్రంలో పడిపోతారు ఆయన అలా పేర్కొన్నారు. ఎందుకు వారు వేగంగా పరిగెడుతున్నారు? అదేవిధముగా, మనము నరకానికి వెళ్ళటానికి చాలా వేగంగా పరిగెడుతున్నాము ఇది మన స్థానము. ఎందుకంటే, గమ్యం ఏమిటి అనేది మనకు తెలియదు. నాకు గమ్యము ఏమిటో తెలియదు పూర్తి వేగంతో నా కారును నడపడానికి నేను ప్రయత్నించినట్లయితే, ఫలితమేమిటి? ఫలితంగా విపత్తు ఉంటుంది. మనము ఎందుకు పరిగెడుతున్నామో మనము తప్పక తెలుసుకోవాలి. నది గొప్ప వరదతో ప్రవహిస్తుంది, కానీ గమ్యం సముద్రము. నది సముద్రంలోకి వచ్చినప్పుడు, దానికి గమ్యం ఉండదు. అదేవిధముగా, మనము గమ్యం ఏమిటో తెలుసుకోవాలి. మన గమ్యం విష్ణువు, భగవంతుడు. మనము భగవంతుడులో భాగం. ఏదో ఒక విధముగా మనము ఈ భౌతిక ప్రపంచములోనికి పడిపోయాము. అందువల్ల మన జీవిత గమ్యము తిరిగి ఇంటికి వెళ్ళుట. భగవంతుడు దగ్గరకు తిరిగి వెళ్ళటము అది మన గమ్యము. ఇంకొక గమ్యము లేదు. కృష్ణ చైతన్య ఉద్యమం బోధిస్తుంది. మీరు మీ జీవితం యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? "భగవత్ ధామమునకు తిరిగి వెళ్ళుట, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళుట. మీరు వెళ్ళవల్సిన దానికి, వ్యతిరేక దిశలో వెళుతున్నారు. నరకము వైపుకి. ఇది మీ గమ్యం కాదు. మీరు ఇటు వైపుకు తిరిగి, భగవంతుని దగ్గరకు తిరిగి రండి " ఇది మన ప్రచారము