TE/Prabhupada 0071 - మనము నిర్లక్ష్యముగా ఉన్నా కూడా దేవుని యొక్క కుమారులము

Revision as of 10:02, 11 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0071 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Room Conversation With French Commander -- August 3, 1976, New Mayapur (French farm)

మనము నిర్లక్ష్యముగా వున్నా దేవుని యొక్క కుమారులము మనము దేవుని కుమారులము, ఎటువంటి సందేహం లేదు, కానీ ప్రస్తుత సమయంలో, నిర్లక్ష్యముతో ఎందుకు పనికి రాకుండా వున్నాము మనము మన విలువైన జీవితాన్ని వృధా చేస్తున్నాము, మనము నిర్లక్ష్యంగా ఉన్నాము. కృష్ణ చైతన్య ఉద్యమము మనలోని నిర్లక్ష్యన్ని నివారించడము కొరకే మరియు మన బాధ్యతలను గుర్తుచేసి తిరిగి ఇంటికి , దేవుని దగ్గరకు తీసుకువేళ్ళుతుంది. ఇది కృష్ణ చైతన్యము. కానీ ప్రజలు ఎంతటి నిర్లక్ష్యంగా కలిగి వున్నారంటే, మీరు దేవుని గురించి ఏమి చెప్పిన వెంటనే, వెంటనే వారు నవ్వుతు, "ఓహ్, అర్ధంలేని, దేవుడు." ఇది తారాస్థాయి నిర్లక్ష్యం. భారతదేశం దేవుని గురించి చాలా పట్టుదలతో ఉండేది. భారతదేశంలో నేటికి ఇ పట్టుదల ఉంది. ఇప్పుడు, ప్రస్తుత నాయకులు అనుకుంటున్నారు, భారతీయులు , కేవలం దేవుని గురించి ఆలోచిస్తు చెడిపోయారు అని వారు ఆర్ధిక అభివృద్ధి కోసం అమెరికన్లు మరియు యూరోపియన్లు వలె ఆలోచిoచడము లేదు. ఇది పరిస్థితి మరియు ఇది చాలా కష్టమైనది కానీ ఈ కృష్ణ జ్ఞాన చైతన్య ఉద్యమాన్ని బోధించడం ద్వారా మనము మానవజాతికి ఏదో ఒకటి చెయ్యావచ్చును. అదృష్టం ఉన్నవారు, వారు వచ్చి, తీవ్రంగా తీసుకుంటారు. మనము నిర్లక్ష్యంతో తప్పిపోయిన కుమారుల యొక్క ఉదాహరణలు చాల వున్నాయి ఉదాహరణకు, కొన్ని పెట్రోలియం నిల్వలు ఉన్నట్లుగా మరియు వారు పెట్రోలియముతో గుర్రం లేకుండా కార్లు నడుపవచ్చు అనేది కనుగొన్నారు కాబట్టి, మిలియన్ల కొద్దీ కార్లు ఉత్పత్తి చేసి మొత్తం చమురును పాడుచేస్తున్నారు. ఇది నిర్లక్ష్యం. మరియు అది పూర్తి అయినప్పుడు, అప్పుడు వారు విలపిస్తారు. మరియు అది పూర్తి అవుతుంది. ఇది జరుగుతోంది. నిర్లక్ష్యంగా. నిర్లక్ష్యoగా ఉన్న బాలుడికి, అతని త0డ్రి కొoత ఆస్తిని విడిచిపెట్టాడు, దాన్ని ఉపయోగిoచమని అతనికి వచ్చిన వెంటనే దానిని పోగొటుకుంటాడు, అంతే.ఇది నిర్లక్ష్యము. శరీరం లో కొన్ని బలం ఉంది, మరియు అతనులైంగిక జీవితం యొక్క కొంత రుచి పొందిన వెంటనే, శక్తీ మొతాన్ని ఉపయోగిoచాలి ఉపయోగిoచాలి అని," మొత్తం శక్తిని ఉపయోగిస్తాడు. మెదడు ఖాళీగా అవుతుంది. పన్నెండవ సంవత్సరం నుండి ప్రారంభించి, ముప్పై ఏళ్ల వచ్చేసరికి మొత్తము ముగిసిపోతుంది. అప్పుడు అతను నపుంసకుడు. మా చిన్ననాటిలో - మా బాల్యంలో ఎనభై సంవత్సరాల క్రితం లేదా వంద సంవత్సరాల క్రితం ఏ మోటారు కారు లేదు. ఇప్పుడు, మీరు ఎక్కడికి వెళ్లినా, ఏ దేశంలో అయినా, లక్షలాది కార్లను చూస్తారు. ఇది నిర్లక్ష్యం. వందల సంవత్సరాల క్రితం వారు మోటారుకారు లేకుండా జీవించారు ఇప్పుడు వారు కారు లేకుండా జీవించలేరు. ఈ విధంగా, అనవసరంగా, వారు జీవితంలో శారీరక లేదా భౌతిక అవసరాలు పెoచుకుంటున్నారు. ఇది నిర్లక్ష్యము. మరియు ఈ నిర్లక్ష్యన్ని ప్రోత్సహిoచినా నాయకుల నాయకత్వము, మంచి నాయకత్వం. ఎవరు చెప్పుతారు, "ఈ అర్ధంలేనివాటిని ఆపండి, కృష్ణ చైతన్యములోనికి రండి" ఎవరూ పట్టించుకోరు. Andhā yathāndhair upanīyamānās te 'pīśa-tantryām uru-dāmni baddhāḥ (SB 7.5.31). గుడ్డి నాయకుడు గుడ్డి అనుచరులకు నిర్దేశము చేయుట ప్రకృతి యొక్క ఖచ్చితమైన, కఠినమైన చట్టాలచే కట్టుబడి ఉన్నామని వారికి తెలియదు. (విరామం) ... ప్రకృతి చట్టాలు ఎలా పని చేస్తాయో వారికీ తెలియదు. వారు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారు. వారికి తెలియదు. ఇది ఆధునిక నాగరికత అని. ప్రకృతి చట్టాలు అవి నిర్దేశించిన విధముగా పనిచేస్తాయి. మీరు శ్రద్ధ వహించండి లేదా వాటిని పట్టించుకోవద్దు, అది మీ ఇష్టము, కానీ ప్రకృతి యొక్క చట్టాలు పని చేస్తాయి. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ (BG 3.27). కానీ ఈ జులాయులకు, వారికి ప్రకృతి చట్టాలు ఎలా పని చేస్తాయో వారికీ తెలియదు. ప్రకృతి చట్టాలను అధిగమించడానికి కృత్రిమంగా మూర్ఖత్వంతో కృషి చేస్తున్నారు. ఈ విజ్ఞానశాస్త్రం, జులాయిలు శాస్త్రం, ఇది అసాధ్యం. కానీ వారు ప్రయత్నిస్తున్నారు. దీనిని రాస్కల్డమ్ అని పిలుస్తారు. మూర్ఖత్వం. శాస్త్రవేత్తలు ఇలా చెప్పలేదా? "మనము అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాము." మీరు అలా చెయ్యలేరు ఎప్పటికీ. కానీ ఈ మోసం కొనసాగుతోంది. మరియు వారిని ప్రశంసిస్తున్నాము. చక్కగా చేశారు చాల చక్కగా చేశారు అని "ఓహ్, మీరు చంద్ర గ్రహమునకు వెళ్తున్నారు." కానీ అన్ని ప్రయత్నం చేసిన తరువాత, ద్రాక్షలు పుల్లనివి: "ఇది ఉపయోగకరం కాదు." అంతే. మీకు కథ తెలుసా? నక్క? ద్రాక్ష కోసం ప్రయత్నము చేసినది , గెంతినది ఎగిరినది ఎగిరినది ఎగిరినది. ఆది వైఫల్యం అయినప్పుడు, అది ఇలా అన్నాది, "ఓహ్, ఇది పుల్లగా ఉంది, ఇది ఉపయోగం లేదు." (నవ్వు) కాబట్టి వారు ఆలా చేస్తున్నారు. నక్కలు గెంతుతున్నాయి, అంతే. మరియు మనము ఈ జులాయిలు అనవసరంగా ఎగరడం చూస్తున్నాము. (నవ్వులు) కాబట్టి ఈ వెర్రి నక్కలను అనుసరించకుండా మనం ప్రజలను హెచ్చరిస్తున్నాం. వివేకంతో ఉండండి మరియు కృష్ణ చైతన్యముతో ఉండండి. అది మీ జీవితాన్ని విజయవంతం చేస్తుంది.