TE/Prabhupada 0176 - మీరు కృష్ణుడిని ప్రేమిస్తే మీతో కృష్ణుడు నిరంతరం ఉంటాడు

Revision as of 14:23, 19 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0176 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.8.45 -- Los Angeles, May 7, 1973

మనకు ఈ యోగ శక్తులు ఉన్నాయి, కానీ మనకు తెలియదు. ఉదాహరణ ఇలా ఇవ్వబడింది. జింక నాభి దగ్గర నుండి మంచి సువాసన వస్తుంది అందువలన అది ఇక్కడ అక్కడ గెంతుతూ, అక్కడ ఇక్కడ తిరుగువుంటుంది ఈ వాసన ఎక్కడ ఉంది? దానికి తెలియదు ఆ వాసన తన నాభిలోనుండే వస్తుంది అని. మీరు చూడoడి. వాసన దానిలోనే ఉంది, కానీ అది"ఎక్కడ వుంది ఎక్కడ ఉంది?" అదేవిధంగా మనలో చాలా నిద్రాణమైన మర్మమైన శక్తులు మనలో ఉన్నాయి కాని మనకు తెలియదు. కానీ మీరు ఆధ్యాత్మిక యోగా పద్ధతిని అభ్యసిస్తే, వాటిలో కొన్ని చాలా చక్కగా మీరు నేర్చుకోవచ్చు. పక్షులు ఎగురుతున్నట్లుగా, కానీ మనము ఎగరలేము కొన్నిసార్లు మనము కోరుకుంటాము, "నేను ఒక పావురం యొక్క రెక్కలు కలిగి ఉన్నా ..." కవిత్వములు ఉన్నాయి: "నేను వెంటనే వెళ్ళుతాను." కానీ ఆ ఆధ్యాత్మిక శక్తి మీలో కూడా ఉంది. మీరు యోగ అభ్యాసం ద్వారా అభివృద్ధి చేస్తే, మీరు కూడా గాలిలో ఎగురుతారు. అది సాధ్యమే. సిద్దోలోకా అని పిలువబడే ఒక లోకము ఉంది. సిధలోకములో, నివాసులు, సిధ్లోలోకములోని వారు చాలా యోగ శక్తులు కలిగి ఉంటారు. మనము యంత్రాలు ద్వారా చంద్ర గ్రహానికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాము. వారు ఎగురుతారు. వారు కోరిన వెంటనే, వారు వెళ్ళవచ్చు.

యోగ శక్తీ అందరిలోను ఉంది. దానిని అభివృద్ధి చేయాలి. Parasya saktir vividhaiva sruyate (CC Madhya 13.65 భాష్యము. మనకు చాలా నిద్రాణమైన శక్తులు ఉన్నాయి. వాటిని పె౦పొందిoచుకోవాలి నాలుగు లేదా ఐదు సంవత్సరాల క్రితం, మీకు కృష్ణుడు అంటే ఏమిటో తెలియదు. అభ్యాసము ద్వారా మీరు కృష్ణుడిని తెలుసుకుంటారు, దేవుడు ఏమిటి, మన సంబంధం ఏమిటి. మానవ జీవితం అలాంటి అభ్యాసము కోసం ఉద్దేశించబడింది, ఆహారం ఎక్కడ, ఆశ్రయం ఎక్కడ , సెక్స్ ఎక్కడ అనే దాని కొరకు కాదు. ఇవి ఇప్పటికే ఉన్నాయి. Tasyaiva hetoh prayateta kovido na labhyate... (SB 1.5.18). ఈ విషయాలు మనవిచారణ చేసే విషయములు కాదు. ఇవి ఇప్పటికే ఉన్నాయి. పక్షులకు జంతువులకు కూడా తగినంత ఉంది. మానవుని గురించి ఏమి మాట్లాడాలి? కానీ వారు చాలా దుష్టులు అయ్యారు. వారు కేవలం ఆహారం ఎక్కడ ఉంది, ఎక్కడ ఆశ్రయం ఉంది, ఎక్కడ సెక్స్ ఉంది, రక్షణ ఎక్కడఉంది అనే ఆలోచనలోనే ఉన్నారు ఇది తప్పుదోవ పట్టిన నాగరికత. ఈ విషయాల గురించి ఎటువంటి ప్రశ్నే లేదు ... ఏ సమస్య లేదు. జంతువుకు సమస్య లేదని వారు చూడలేరు, పక్షికి సమస్య లేదు. మానవ సమాజమునకు అలాంటి సమస్య ఎందుకు ఉంది? ఇది సమస్య కాదు. వాస్తవ సమస్య పుట్టడము, మరణం, వృద్ధాప్యం వ్యాధి ఈ పునరావృతం ఆపడాము ఎలా. అది వాస్తవమైన సమస్య. ఈ సమస్యను కృష్ణ చైతన్యము ఉద్యమం పరిష్కరిస్తుంది. మీరు కృష్ణుడు అంటే ఏమిటో అర్థం చేసుకుంటే, అప్పుడు భౌతిక జన్మ అనేది లేదు. tyaktva deham punar janma naiti (BG 4.9)

అందువల్ల కృష్ణ చైతన్య ఉద్యమము చాల మంచిది. మీరు కృష్ణుడితో స్నేహం చేస్తే, మీరు కృష్ణుడితో మాట్లాడవచ్చు. యుధిష్టర మహారాజా అభ్యర్ధించిన విధంగా: "కృష్ణ, దయ చేసి కొద్ది రోజులు ఉండండి." కృష్ణుడు, కొద్ది రోజులు మాత్రమే కాదు, మీరు కృష్ణుడిని ప్రేమిస్తే మీతో కృష్ణుడు నిరంతరం ఉంటాడు. చాలా ధన్యవాదాలు.